చాలా మంది తమ ఫోన్లకు ఐపీ సర్టిఫికేషన్ ఉందని, కాబట్టి వర్షంలో తడిసినా ఏమీ కాదని గుడ్డిగా నమ్ముతుంటారు. కానీ వాతావరణంలో ఉండే తేమ వల్ల కూడా ఫోన్లు పాడవుతాయనేది చేదు నిజం.
Photo Credit: AI Generated
Monsoon Smartphone Care: వర్షాలు ప్రారంభం కాగానే కేవలం మనం జాగ్రత్తగా ఉంటే సరిపోదు, మన జేబుల్లో ఉండే స్మార్ట్‌ఫోన్ల విషయంలోనూ అదనపు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వర్షాకాలంలో కొద్దిపాటి నిర్లక్ష్యం వహించినా సరే, ఫోన్ స్పీకర్లు, చార్జింగ్ పోర్ట్, డిస్‌ప్లే లేదా లోపల ఉండే అత్యంత ఖరీదైన మదర్‌బోర్డ్ పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంది. చాలా మంది తమ ఫోన్లకు ఐపీ సర్టిఫికేషన్ ఉందని, కాబట్టి వర్షంలో తడిసినా ఏమీ కాదని గుడ్డిగా నమ్ముతుంటారు. కానీ వాతావరణంలో ఉండే తేమ వల్ల కూడా ఫోన్లు పాడవుతాయనేది చేదు నిజం. ఈ వర్షాకాలంలో మీ స్మార్ట్‌ఫోన్ సురక్షితంగా ఉండాలంటే కొన్ని సాధారణ, ముఖ్యమైన విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి.
IP68, IP69 రేటింగ్ ఉన్నా నమ్మొద్దు
మీ మొబైల్‌కు IP67, IP68 లేదా సరికొత్త IP69 రేటింగ్ ఉన్నప్పటికీ, దానిని కావాలని వర్షంలో గానీ, నీటిలో గానీ ఉపయోగించకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే ఈ రేటింగ్స్ కేవలం కొన్ని పరిమిత పరిస్థితులలో, ల్యాబ్ పరీక్షలలో మాత్రమే రక్షణ ఇస్తాయి. ఫోన్ పాతబడే కొద్దీ, లేదా చేతిలోంచి కింద పడినప్పుడు ఈ వాటర్ రెసిస్టెన్స్ సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి, వర్షంలో ఎక్కువగా తిరిగే వారు తప్పనిసరిగా మంచి క్వాలిటీ ఉన్న వాటర్-రెసిస్టెంట్ లేదా వాటర్‌ప్రూఫ్ ఫోన్ పౌచ్‌లను వాడటం అలవాటు చేసుకోవాలి. ఇది అకస్మాత్తుగా వచ్చే వర్షాల నుంచి మీ ఫోన్‌ను కాపాడుతుంది.
ఫోన్ తడిస్తే వెంటనే చార్జింగ్ పెడుతున్నారా?
వర్షంలో తడిసి ఇంటికి రాగానే చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే, ఫోన్‌ను వెంటనే చార్జింగ్‌కు పెట్టడం. ఒకవేళ మీ కారు చార్జింగ్ పోర్ట్‌లో కొద్దిగా తేమ లేదా నీటి చుక్కలు ఉంటే, విద్యుత్ ప్రవహించినప్పుడు ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల, మొదట ఫోన్‌ను, చార్జింగ్ పోర్ట్‌ను పూర్తిగా ఆరనివ్వాలి. ప్రస్తుత కాలంలో కొన్ని స్మార్ట్‌ఫోన్లు తేమను గుర్తించినప్పుడు ఆటోమేటిక్‌గా చార్జింగ్‌ను నిలిపివేసే సెన్సార్లను కలిగి ఉంటున్నాయి. అయినప్పటికీ, రిస్క్ తీసుకోకుండా ఫోన్ పూర్తిగా ఎండిపోయే వరకు చార్జింగ్ లేదా హెడ్‌ఫోన్లు పెట్టే తొందరపాటు పని చేయకండి.
హెయిర్ డ్రైయర్ అసలు వాడకండి
ఒకవేళ మీ ఫోన్ నీటిలో తడిస్తే, వెంటనే దానిని స్విచ్ఛాఫ్ చేసి, పొడి బట్టతో బాగా తుడవాలి. ఫోన్‌ను త్వరగా ఆరబెట్టాలనే కంగారులో హెయిర్ డ్రైయర్లు , ఓవెన్లు లేదా తీవ్రమైన ఎండలో పెట్టడం వంటి పనులు అస్సలు చేయకూడదు. హెయిర్ డ్రైయర్ నుంచి వచ్చే వేడి గాలి వల్ల ఫోన్ లోపల ఉన్న సున్నితమైన ప్లాస్టిక్ విడిభాగాలు, ఐసీలు, బ్యాటరీ పూర్తిగా దెబ్బతింటాయి. ఫోన్‌ను సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఫ్యాన్ కింద ఆరబెట్టడమే అన్నిటికంటే సురక్షితమైన పద్ధతి. అవసరమైతే ఒక రోజంతా ఫోన్‌ను అలాగే వదిలేయడం మంచిది.
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఊహించని ఆఫర్.. సగం ధరకే Nothing Phone 3
మీ బ్యాగుల్లో సిలికా జెల్ ప్యాకెట్లు ఉన్నాయా?
మీరు తరచుగా ప్రయాణాలు చేసే వారైతే ఒక అద్భుతమైన చిట్కా ఉంది. మనం కొత్త బ్యాగులు లేదా షూస్ కొన్నప్పుడు వాటిలో చిన్న చిన్న సిలికా జెల్ ప్యాకెట్లు వస్తుంటాయి. వాటిని పారేయకుండా దాచి ఉంచుకోండి. ఈ సిలికా జెల్ ప్యాకెట్లకు చుట్టుపక్కల ఉన్న తేమను చాలా వేగంగా పీల్చుకునే శక్తి ఉంటుంది. వర్షాకాలంలో ప్రయాణించేటప్పుడు మీ ఫోన్ పెట్టే బ్యాగ్ జేబులో ఈ ప్యాకెట్లను ఉంచితే, అవి తేమ చేరకుండా ఫోన్‌ను పొడిగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే, వర్షాకాలంలో ఫోన్లు ఎప్పుడు ఎలా పాడవుతాయో చెప్పలేం కాబట్టి, మీ ఫోన్ లోని ముఖ్యమైన ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లను గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ వంటి క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసి పెట్టుకోవడం చాలా ఉత్తమం.
ఫోన్ నీళ్లలో పడి స్విచ్ఛాఫ్ అయిందా?
ఒకవేళ పొరపాటో, గ్రహపాటో మీ ఫోన్ ఎక్కువ సేపు నీళ్లలో మునిగిపోయి, దానంతట అదే స్విచ్ఛాఫ్ అయిపోతే గనుక.. దానిని పదే పదే ఆన్ చేయడానికి అస్సలు ప్రయత్నించవద్దు. లోపల నీరు ఉన్నప్పుడు ఫోన్ ఆన్ చేస్తే షార్ట్ సర్క్యూట్ జరిగి ఫోన్ శాశ్వతంగా పాడైపోతుంది. అటువంటి పరిస్థితిలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా, వెంటనే ఆ ఫోన్ బ్రాండ్‌కు సంబంధించిన అథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌కు తీసుకువెళ్లి టెక్నీషియన్లకు చూపించడమే ఏకైక సురక్షితమైన మార్గం.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999