Moto G77 Power : మార్కెట్లోకి మోటోరోలా కొత్త సంచలనం.. ఈ వారమే లాంచ్ కాబోతున్న Moto G77 Power

భారతదేశంలోని మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన లిస్టింగ్ ఇప్పటికే ప్రత్యక్షమైంది.

Moto G77 Power : మార్కెట్లోకి మోటోరోలా కొత్త సంచలనం.. ఈ వారమే లాంచ్ కాబోతున్న Moto G77 Power

Photo Credit: Motorola

moto

ముఖ్యాంశాలు
  • భారత మార్కెట్లోకి మోటోరోలా కొత్త సంచలనం
  • ఈ వారమే లాంచ్ కాబోతున్న ‘Moto G77 Power’
  • మోటోరోలా వెబ్‌సైట్‌లో సరికొత్త ఫోన్ ఫీచర్లు లీక్
ప్రకటన

Moto G77 Power : ప్రముఖ అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా భారతీయ వినియోగదారుల కోసం మరో సరికొత్త మొబైల్‌ను పరిచయం చేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ వారంలోనే సరికొత్త Moto G77 Power స్మార్ట్‌ఫోన్ దేశీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ కాబోతోంది. లాంచ్‌కు ముందే కంపెనీ ఈ ఫోన్ డిస్‌ప్లే, కెమెరా క్వాలిటీ, బ్యాటరీ సామర్థ్యానికి సంబంధించిన కీలక వివరాలను అధికారికంగా వెల్లడించింది. వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ ఫోన్‌ను నాలుగు విభిన్నమైన, స్టైలిష్ పాంటోన్ కలర్ ఆప్షన్లలో తీసుకురాబోతున్నట్లు మోటోరోలా ప్రకటించింది.

నాలుగు అదిరిపోయే పాంటోన్ కలర్ ఆప్షన్లు 
భారతదేశంలోని మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన లిస్టింగ్ ఇప్పటికే ప్రత్యక్షమైంది. ఈ లిస్టింగ్ ప్రకారం.. మోటో జీ77 పవర్ స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు వేరియంట్లలో లభించనుంది. అందులో మొదటిది 4 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ కాగా, రెండోది 8 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ ఆప్షన్. కలర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పాంటోన్ ఇంపెనెట్రబుల్, పాంటోన్ నాటికల్ బ్లూ, పాంటోన్ ఫుచ్సియా రెడ్, పాంటోన్ లారెల్ గ్రీన్ వంటి నాలుగు అద్భుతమైన రంగులలో కొనుగోలుకు అందుబాటులో ఉండబోతోంది.

మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్ 
ఈ స్మార్ట్‌ఫోన్ యొక్క డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్ వివరాలను పరిశీలిస్తే.. ఇందులో 2,400 x 1,080 పిక్సెల్స్ రెజల్యూషన్ కలిగిన 6.72 ఇంచుల ఫుల్ HD+ LCD డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ రన్నింగ్ చాలా స్మూత్‌గా ఉండేలా 120 Hz రీఫ్రెష్ రేట్, 120 Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఫీచర్లు ఉన్నాయి. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించడానికి 1,050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ ఇచ్చారు. దీనితో పాటు స్క్రీన్ రక్షణ కోసం బలమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను ఉపయోగించారు. కారు వేగం లాంటి పర్ఫార్మెన్స్ కోసం ఇందులో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో పాటు ఆర్మ్ మాలి-G57 MP2 జీపీయూ సపోర్ట్‌ను ఇచ్చారు. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.

Flipkart Goat Sale : లాంచ్ ధర కంటే రూ.7,825 తగ్గింపు.. గెలాక్సీ A36 5G పై ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో క్రేజీ డిస్కౌంట్లు 


కెమెరా విభాగంలో మోటోరోలా ఈసారి సరికొత్త టెక్నాలజీని వాడింది. ఈ ఫోన్ వెనుక వైపు డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో f/1.8 అపెర్చర్ కలిగిన 50 మెగాపిక్సెల్ సోనీ లిటియా 600 ప్రైమరీ కెమెరాతో పాటు, అదిరిపోయే ల్యాండ్‌స్కేప్ ఫోటోల కోసం మరొక 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను అమర్చారు. ఇక సెల్ఫీలు, హై-క్వాలిటీ వీడియో కాల్స్ మాట్లాడుకోవడం కోసం ఫోన్ ముందు భాగంలో ఏకంగా 32 మెగాపిక్సెల్ పవర్‌ఫుల్ ఫ్రంట్ కెమెరాను అందించడం విశేషం.

ఛార్జింగ్ టెన్షన్‌కు బై-బై 
ఈ ఫోన్ లో ఉన్న అన్నిటికంటే పెద్ద ప్లస్ పాయింట్ దీని బ్యాటరీ లైఫ్. మొబైల్‌ను ఎక్కువగా వాడే వారి కోసం మోటోరోలా ఇందులో ఏకంగా 7,000 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చింది. దీనిని త్వరగా ఛార్జ్ చేయడం కోసం 30W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను ఇచ్చారు. అంతేకాకుండా, అత్యవసర సమయాల్లో ఈ ఫోన్ ద్వారా ఇతర చిన్న పరికరాలను ఛార్జ్ చేసుకునేలా 6W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా కల్పించారు. మంచి ఆడియో అనుభూతి కోసం డాల్బీ అట్మోస్  సపోర్ట్ ఉన్న స్టీరియో స్పీకర్లను ఇచ్చారు. ఫోన్ సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కాన్ ఫీచర్ ఉంది.

గత నెలలోనే విడుదలైన Motorola Edge 70 Pro+ 
మోటోరోలా సంస్థ గత నెలలోనే భారతదేశంలో తన ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మోడల్ Motorola Edge 70 Pro+ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోన్‌లో 6.8 ఇంచుల సూపర్ HD+ ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. పర్ఫార్మెన్స్ కోసం అందులో అత్యంత పవర్‌ఫుల్  MediaTek Dimensity 8500 Extreme ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆ ప్రీమియం ఫోన్ లో 6,500 mAh బ్యాటరీతో పాటు 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్,  15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు రాబోతున్న Moto G77 Power మోడల్ అంతకంటే తక్కువ ధరలో భారీ బ్యాటరీతో మిడ్-బడ్జెట్ కస్టమర్లను ఆకట్టుకోనుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »