ఈ స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద హైలైట్ దీని బ్యాటరీ సామర్థ్యమే. ఇందులో ఏకంగా 7,000 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించారు.
Moto G77 Power
Moto G77 Power : ఈ ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ మార్కెట్లో Moto G77 మోడల్‌ను పరిచయం చేసిన మోటోరోలా, ఇప్పుడు భారతీయ వినియోగదారుల కోసం మరింత శక్తివంతమైన వెర్షన్‌ను తీసుకువస్తోంది. వచ్చే వారం (జూలై 8న) భారతదేశంలో Moto G77 Power స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన ల్యాండింగ్ పేజీ లైవ్‌లోకి వచ్చింది.
3 రోజుల పాటు నాన్‌స్టాప్ బ్యాటరీ లైఫ్
ఈ స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద హైలైట్ దీని బ్యాటరీ సామర్థ్యమే. ఇందులో ఏకంగా 7,000 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించారు. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో 5,000 mAh బ్యాటరీలను చూస్తుంటాం, కానీ మోటో ఇందులో అంతకంటే పెద్ద బ్యాటరీని అమర్చింది. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఏకంగా మూడు రోజుల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చని కంపెనీ ధీమాగా చెబుతోంది. ఎక్కువగా ప్రయాణాలు చేసే వారికి, గేమర్లకు ఈ బ్యాటరీ బాగా ఉపయోగపడుతుంది.
సినిమాటిక్ డిస్‌ప్లే అండ్ లగ్జరీ లుక్
మోటో G77 పవర్ స్మార్ట్‌ఫోన్ 6.72 ఇంచుల ఫుల్ HD+ డిస్‌ప్లేతో వస్తోంది. స్క్రీన్ స్మూత్‌గా పనిచేయడానికి వీలుగా ఇందులో 120 Hz రిఫ్రెష్ రేట్‌ను అందించారు. అలాగే స్క్రీన్‌కు రక్షణగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. లుక్ పరంగా కూడా ఈ ఫోన్ చాలా ప్రీమియంగా ఉండబోతోంది. దీని వెనుక భాగంలో వీగన్ లెదర్ ఫినిషింగ్ ఉంటుంది. బ్లూ, రెడ్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ ఫోన్ కలర్స్‌ను అంతర్జాతీయ కలర్ స్పేస్ పాంటోన్ క్యూరేట్ చేయడం విశేషం.
సోనీ సెన్సార్‌తో అదిరిపోయే కెమెరాలు
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే, మోటోరోలా ఇందులో బెస్ట్ కెమెరా సెటప్‌ను జోడించింది. దీని వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా యూనిట్ ఉంది. అందులో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ కాగా, దీనికోసం అడ్వాన్స్‌డ్ Sony Lytia-600 సెన్సార్‌ను ఉపయోగించారు. దీనివల్ల రాత్రి వేళల్లో కూడా అద్భుతమైన ఫోటోలు వస్తాయి. దీనితో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ హై-రెజల్యూషన్ కెమెరాను అందించారు.
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్ హంగామా.. ఎకో స్పీకర్లు, ఫైర్ టీవీ స్టిక్స్‌పై భారీ డిస్కౌంట్లు
సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్, డాల్బీ అట్మోస్ సౌండ్
ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హెల్లో యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. యూజర్ ఎక్స్‌పీరియన్స్ చాలా క్లీన్‌గా, ఫాస్ట్‌గా ఉంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియుల కోసం ఇందులో డాల్బీ అట్మోస్ సపోర్ట్ గల డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అమర్చారు. దీనివల్ల సినిమా చూస్తున్నప్పుడు లేదా పాటలు వింటున్నప్పుడు థియేటర్ లాంటి సౌండ్ ఎఫెక్ట్ లభిస్తుంది.
ధర ఎంత ఉండొచ్చు?
భారత మార్కెట్లో ఈ సరికొత్త మోటో G77 పవర్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.30,000 కంటే తక్కువగానే ఉంటుందని కంపెనీ హింట్ ఇచ్చింది. ఫీచర్లు, 7,000 mAh బ్యాటరీని బట్టి చూస్తే మిడ్-రేంజ్ బడ్జెట్లో ఇదొక బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది. కాగా, ఇటీవల మోటోరోలా ఇండియాలో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 16తో కూడిన మోటో G37 (5,200 mAh బ్యాటరీ), మోటో G37 పవర్ (7,000 mAh బ్యాటరీ) ఫోన్లను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ప్రకటన
ప్రకటన
The Witcher 4 Is Targeting Launch in 2028, CD Projekt Red Confirms