ప్రైమ్ డే సేల్‌లో వస్తువులు కొనేవారి కోసం అమెజాన్ కొన్ని ప్రముఖ బ్యాంకులతో చేతులు కలిపింది.
Photo Credit: Amazon India
Amazon Prime Day Sale 2026
Amazon Prime Day Sale : ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 జూలై 4వ తేదీన ప్రారంభమై జూలై 6వ తేదీ వరకు నడుస్తుంది. అయితే ఈ సేల్ అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉన్న కస్టమర్లు మాత్రమే ఈ ప్రత్యేకమైన డీల్స్, డిస్కౌంట్లను సొంతం చేసుకోగలరు. ఈ సేల్‌లో భాగంగా అమెజాన్ తన సొంత బ్రాండ్ ప్రొడక్ట్స్ అయిన అలెక్సా డివైజెస్, ఎకో స్మార్ట్ స్పీకర్లు, ఫైర్ టీవీ స్టిక్స్, ఫైర్ టీవీ సాఫ్ట్‌వేర్‌తో వచ్చే స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది.
బ్యాంక్ ఆఫర్లతో అదనపు లాభాలు
ప్రైమ్ డే సేల్‌లో వస్తువులు కొనేవారి కోసం అమెజాన్ కొన్ని ప్రముఖ బ్యాంకులతో చేతులు కలిపింది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఫుల్ పేమెంట్ చేసినా లేదా ఈఎంఐ ట్రాన్సాక్షన్లు జరిపినా కస్టమర్లకు 10 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇవే కాకుండా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్‌పై నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడుతుంటే, ప్రతి షాపింగ్‌పై అపరిమితంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.
ఎకో స్మార్ట్ స్పీకర్లపై ఉన్న క్రేజీ డీల్స్
మీ ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చాలనుకుంటే అలెక్సా సపోర్ట్ ఉన్న స్మార్ట్ స్పీకర్లను కొనేందుకు ఇదే సరైన సమయం. ఈ సేల్‌లో లభించే ముఖ్యమైన ఎకో స్పీకర్ల ధరలు ఇలా ఉన్నాయి:
* Echo Pop: దీనిపై ఏకంగా 41% డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్ లో దీని ధర కేవలం రూ.2,949 మాత్రమే.
* Echo Dot (5th Gen): 27% తగ్గింపు తర్వాత ఈ స్పీకర్ రూ.3,999 కి లభిస్తుంది.
* Echo (4th Gen): దీనిపై ఏకంగా 50% అంటే సగం ధరకే ఆఫర్ ఇస్తున్నారు. ఇది రూ.5,000 కే సొంతం చేసుకోవచ్చు.
* Echo Dot Max: కొత్తగా వచ్చిన ఈ మోడల్‌పై 18% డిస్కౌంట్‌తో రూ.8,999 ధర నిర్ణయించారు.
* Echo Spot: దీనిపై రూ.2,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది. ఆఫర్ ధర రూ.6,999.
* Echo Show 8: పెద్ద స్క్రీన్ ఉన్న ఈ డివైజ్‌పై ఏకంగా రూ.7,000 భారీ తగ్గింపు లభిస్తుంది. ఇది రూ.17,999 కి దొరుకుతుంది.
* Echo Show 11 & Echo Studio: ఈ రెండింటిపై రూ.2,500 వరకు తగ్గింపు ఉంది. వీటి ధరలు వరుసగా రూ.24,499, రూ.21,499 గా ఉన్నాయి.
ఫైర్ టీవీ డివైజెస్ పై ఆఫర్ల వర్షం
మీ సాధారణ టీవీని స్మార్ట్ టీవీగా మార్చుకోవడానికి లేదా మీ టీవీలో ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పెంచుకోవడానికి ఫైర్ టీవీ స్టిక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రైమ్ డే సేల్‌లో వీటిపై ఉన్న ఆఫర్లు చూద్దాం:
* Fire TV Stick HD: దీనిపై అత్యధికంగా 45% డిస్కౌంట్ ఇస్తున్నారు. తగ్గింపు పోను ఇది రూ.2,999 కి లభిస్తుంది.
* Fire TV Stick 4K Select & 4K Plus: ఈ రెండింటిపై 36% డిస్కౌంట్ ఉంది. ఇవి వరుసగా రూ.3,499 మరియు రూ.4,499 ధరకు అందుబాటులో ఉంటాయి.
* Fire TV Cube: దీనిపై రూ.1,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది, దీని ధర రూ.12,999.
* Fire TV Built-in Smart TVs: ఇన్-బిల్ట్‌గా ఫైర్ టీవీ సాఫ్ట్వేర్ వచ్చే స్మార్ట్ టీవీలపై ఏకంగా 55 శాతం వరకు బంపర్ డిస్కౌంట్లను అమెజాన్ అందిస్తోంది.
ఈ డివైజెస్‌తో లాభాలు ఏంటి?
అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్ల సహాయంతో వినియోగదారులు కేవలం తమ వాయిస్ కమాండ్స్ ద్వారానే నచ్చిన పాటలు ప్లే చేసుకోవచ్చు, ఇంట్లోని స్మార్ట్ లైట్లు, ఏసీలను కంట్రోల్ చేయవచ్చు, రిమైండర్లు సెట్ చేసుకోవచ్చు. అంతేకాదు, కేవలం అలెక్సాతో మాట్లాడి అమెజాన్‌లో వస్తువులను కూడా ఆర్డర్ చేయవచ్చు. ఇక ఫైర్ టీవీ డివైజెస్ ద్వారా ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, యూట్యూబ్, జీ5 వంటి అనేక రకాల ఓటీటీ స్ట్రీమింగ్ యాప్స్, లైవ్ టీవీ ఛానెళ్లను హై-క్వాలిటీలో వీక్షించవచ్చు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
WhatsApp Reels Shortcut for Chats Rolling Out to Android Beta Testers
Spotify Says Family Plan Verification Will Continue as It Tightens Account-Sharing Rules