జూన్ 4, 2026 న ఈ మొబైల్ అధికారికంగా ఇండియాలో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. లాంచ్‌కు ముందే కంపెనీ దీని డిజైన్, కలర్ ఆప్షన్లు, కెమెరా కాన్ఫిగరేషన్‌ను టీజ్ చేస్తూ కస్టమర్లలో భారీ అంచనాలను పెంచేసింది.
Photo Credit: Flipkart/ Motorola
Motorola Edge 70 Pro+ will sport a curved display
Motorola : భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు మోటోరోలా సంస్థ సరికొత్త విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది. తన ప్రీమియం ఎడ్జ్ సిరీస్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ ఫోన్‌ను వచ్చే వారం మార్కెట్లోకి దించబోతోంది. జూన్ 4, 2026 న ఈ మొబైల్ అధికారికంగా ఇండియాలో గ్రాండ్‌గా లాంచ్ కానుంది. లాంచ్‌కు ముందే కంపెనీ దీని డిజైన్, కలర్ ఆప్షన్లు, కెమెరా కాన్ఫిగరేషన్‌ను టీజ్ చేస్తూ కస్టమర్లలో భారీ అంచనాలను పెంచేసింది. దీనికి తోడు ప్రముఖ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్ గీక్‌బెంచ్‌లో ఈ ఫోన్ ప్రత్యక్షమవడంతో.. ఇందులో వాడబోయే హై-ఎండ్ ప్రాసెసర్, ర్యామ్, ఆపరేటింగ్ సిస్టమ్ వివరాలు లీకైపోయాయి. వన్‌ప్లస్, ఐకూ వంటి బ్రాండ్లకు చుక్కలు చూపించడానికి వస్తున్న ఈ ఫోన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం.. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ చిప్‌సెట్‌తో రన్ కానుంది. దీని మోడల్ నంబర్ MT6899 గా ఉంది, దీనిని మార్కెట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ప్రాసెసర్‌గా పిలుస్తారు. ఈ చిప్‌సెట్‌లో గరిష్టంగా 3.40GHz క్లాక్ స్పీడ్ అందించే ప్రైమ్ కోర్, 3.20GHz స్పీడ్ ఇచ్చే మూడు పర్ఫార్మెన్స్ కోర్లు, 2.20GHz స్పీడ్ గల నాలుగు ఎఫిషియన్సీ కోర్లు ఉన్నాయి. గ్రాఫిక్స్ కోసం ARM Mali-G720 MC8 జీపీయూను జత చేశారు. గీక్‌బెంచ్ పరీక్షల్లో ఈ ఫోన్ సింగిల్-కోర్‌లో 1,722 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టులో ఏకంగా 5,623 పాయింట్ల సాలిడ్ స్కోర్ సాధించి తన సత్తా చాటింది.
గీక్‌బెంచ్ లీక్స్ ద్వారా ఈ ఫోన్ మెమరీ కెపాసిటీ కూడా బయటపడింది. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ మొబైల్ కనీసం 11.18జీబీ అవైలబుల్ ర్యామ్‌తో లిస్ట్ అయ్యింది, అంటే మార్కెట్లోకి ఇది 12జీబీ ర్యామ్ వేరియంట్‌తో అడుగుపెట్టనుంది. దీనికంటే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే మొదటి ఫోన్లలో ఒకటిగా నిలవబోతోంది. దీనివల్ల యూజర్లకు సరికొత్త ఏఐ ఫీచర్లు, స్మూత్ ఇంటర్‌ఫేస్ లభించనున్నాయి.
![]()
ఈ ఫోన్ కెమెరా విభాగంలో ఒక తిరుగులేని సంచలనం సృష్టించబోతోంది. దీని వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కాగా, దానికి సోనీ ఎల్‌వైటీ-710 ఫ్లాగ్‌షిప్ సెన్సార్‌ను మరియు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌ను అమర్చారు. దీనితో పాటు ఏకంగా 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కూడా మోటోరోలా అమర్చడం విశేషం. ఇది 50x డిజిటల్ జూమ్ సామర్థ్యంతో వస్తోంది. దీనివల్ల ఎంత దూరంలో ఉన్న వస్తువులనైనా చాలా స్పష్టంగా ఫోటోలు తీయవచ్చు.
జూన్ 4న లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటోరోలా ఇండియా అధికారిక వెబ్‌సైట్, ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ మొత్తం మూడు రకాల విభిన్నమైన పాంటోన్ కలర్ వేరియంట్లలో లభించనుంది. అవి.. స్కల్ప్టెడ్ ఉడ్ ఫినిష్‌తో వచ్చే పాంటోన్ చికోరీ కాఫీ, ట్విల్ ఫినిష్‌తో వచ్చే పాంటోన్ స్టార్మీ సీ, శాటిన్ లక్స్ ఫినిష్‌తో వచ్చే పాంటోన్ జిన్‌ఫాండెల్.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999