మెటా ప్రొడక్ట్ హెడ్ నవోమి గ్లీట్ ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ గ్లోబల్ లాంచ్‌ను ధృవీకరించారు.
Photo Credit: Reuters
Meta has not officially announced pricing for its new subscription plans
Meta Subscribed : ఇప్పటివరకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ యాప్‌లను పూర్తిగా ఉచితంగా వాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్న సోషల్ మీడియా ప్రియులకు మెటా సంస్థ ఒక బిగ్ షాక్ ఇచ్చింది. తన పాపులర్ ప్లాట్‌ఫామ్స్ కోసం సరికొత్త పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను మెటా అధికారికంగా ప్రకటించింది. వినియోగదారులకు మరింత అడ్వాన్స్డ్ ఫీచర్లు, ఎక్స్‌క్లూజివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను అందించేందుకు వీలుగా.. ఫేస్‌బుక్ ప్లస్, ఇన్‌స్టాగ్రామ్ ప్లస్, వాట్సాప్ ప్లస్ అనే మూడు ప్రత్యేక ప్లాన్లను మెటా మార్కెట్లోకి తెస్తోంది. మెటా ప్రొడక్ట్ హెడ్ నవోమి గ్లీట్ ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఈ గ్లోబల్ లాంచ్‌ను ధృవీకరించారు. అయితే సాధారణ యూజర్లు కంగారు పడాల్సిన అవసరం లేదు, బేసిక్ యాప్స్ ఎప్పటిలాగే ఫ్రీగా పనిచేస్తాయి. కేవలం ప్రీమియం ఫీచర్లు కావాలనుకునే వారి కోసమే ఈ ప్లాన్లు తీసుకొచ్చారు.
మెటా సంస్థ ఈ ప్లాన్ల ధరలను అధికారికంగా వెల్లడించనప్పటికీ.. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం ఇన్‌స్టాగ్రామ్ ప్లస్, ఫేస్‌బుక్ ప్లస్ ప్లాన్ల ధర నెలకు 3.99 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.350)గా ఉండే అవకాశం ఉంది. ఈ ప్లాన్ తీసుకునే ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ యూజర్లకు మైండ్ బ్లాకింగ్ ఫీచర్లు లభిస్తాయి. ముఖ్యంగా మీరు పెట్టిన స్టోరీని ఎవరెవరు మళ్లీ మళ్లీ చూశారు అనే విషయాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే క్లోజ్ ఫ్రెండ్స్ లిమిట్ లేకుండా అపరిమిత ఫ్రెండ్ లిస్ట్ క్రియేట్ చేసుకోవడం, వారానికి ఒకసారి మీ స్టోరీని ఎక్కువ వ్యూస్ వచ్చేలా స్పాట్‌లైట్ చేయడం, మీ పేరు వ్యూవర్ లిస్ట్‌లో పడకుండానే ఇతరుల స్టోరీలను సీక్రెట్‌గా ప్రివ్యూ చూడటం వంటి క్రేజీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫేస్‌బుక్ ప్లస్‌లో కూడా దాదాపు ఇలాంటి ప్రొఫైల్ కస్టమైజేషన్ ఫీజులే అందుబాటులో ఉంటాయి.
Airtel : ఇక నో సిగ్నల్ టెన్షన్..ఇండియాలోనే మొదటిసారి ఎయిర్‌టెల్ ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్
ఇక మనందరికీ ఎంతో ఇష్టమైన వాట్సాప్ కోసం తీసుకువస్తున్న వాట్సాప్ ప్లస్ ప్లాన్ ధర నెలకు 2.99 డాలర్లు (మన కరెన్సీలో దాదాపు రూ.270) గా ఉండనుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకునే వారికి వాట్సాప్ సరికొత్త లుక్‌లో కనిపించబోతోంది. ఇందులో భాగంగా మీకు నచ్చిన అద్భుతమైన యాప్ థీమ్స్ మార్చుకోవడం, ప్రత్యేకమైన చాట్‌ల కోసం కస్టమ్ రింగ్‌టోన్లు సెట్ చేసుకోవడం, ఎక్కువ చాట్‌లను స్క్రీన్ పైనే పిన్ చేసి పెట్టుకోవడం, సరికొత్త ప్రీమియం స్టిక్కర్లను వాడుకునే వెసులుబాటు లభిస్తుంది.
మెటా సంస్థ ఈ విడివిడి ప్లాన్లతో పాటు వీటన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెస్తూ మెటా వన్ బండిల్‌ను టెస్ట్ చేస్తోంది. ఇందులో క్రియేటర్స్, బిజినెస్ యూజర్లు, ఏఐ పవర్‌ఫుల్ టూల్స్ వాడే వారి కోసం విభిన్నమైన ప్లాన్లు ఉన్నాయి. నివేదికల ప్రకారం.. మెటా వన్ ప్లస్ ధర నెలకు $7.99 (రూ.600), మెటా వన్ ప్రీమియం ధర $19.99 (రూ.1,800)గా ఉండనుంది. ఇవి కాకుండా క్రియేటర్ల ఐడెంటిటీని కాపాడే బేసిక్ మెటా వన్ ఎసెన్షియల్ ప్లాన్ ధర $14.99 (రూ.1,300), అత్యంత అడ్వాన్స్డ్ అనలిటిక్స్, ఎక్కువ రీచ్ ఇచ్చే మెటా వన్ అడ్వాన్స్‌డ్ ప్లాన్ ధర ఏకంగా $49.99 (రూ.4,600)గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ కొత్త ప్లాన్ల వల్ల బ్లూ టిక్ ఇచ్చే పాత మెటా వెరిఫైడ్ సర్వీస్‌కు ఎలాంటి ఢోకా ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Vivo Pad FE Reportedly Surfaces on TDRA, TUV Certifications; Charging Specifications Revealed
OpenAI Lawsuit Says Employee Who Left for Apple Took Files About Unreleased Device