భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+ కేవలం ఒకే ఒక వేరియంట్‌లో లభిస్తుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ఉన్న ఈ ఏకైక మోడల్ లాంచ్ ధరను కంపెనీ రూ.47,999 గా నిర్ణయించింది.
Photo Credit: Flipkart/ Motorola
Motorola Edge 70 Pro+ features a hole-punch display cutout
Motorola Edge 70 Pro+ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా ఇండియాలో తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మొబైల్‌ను లాంచ్ చేసింది. కొన్ని వారాల క్రితం మార్కెట్లోకి తెచ్చిన ఎడ్జ్ 70 ప్రో మోడల్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+ను గురువారం అధికారికంగా విడుదల చేసింది. పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే విభాగాల్లో భారీ మార్పులు చేశారు. ముఖ్యంగా ప్యాంటోన్ సర్టిఫైడ్ కలర్స్, సరికొత్త ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ ప్రీమియం లవర్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+ కేవలం ఒకే ఒక వేరియంట్‌లో లభిస్తుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ఉన్న ఈ ఏకైక మోడల్ లాంచ్ ధరను కంపెనీ రూ.47,999 గా నిర్ణయించింది. అయితే ఇది కేవలం ఇంట్రడక్టరీ ఆఫర్ ధర మాత్రమేనని, ఆ తర్వాత రేట్లు పెరగొచ్చని సంస్థ తెలిపింది. దీనిపై అదనంగా రూ.3,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ జూన్ 11 నుంచి ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటోరోలా ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అమ్మకానికి రానుంది. ఇది ప్యాంటోన్ చికోరీ కాఫీ, ప్యాంటోన్ స్టార్మీ సీ, ప్యాంటోన్ జిన్‌ఫాండెల్ అనే మూడు అదిరిపోయే కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.
నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ డిస్‌ప్లే
డిస్‌ప్లే పరంగా ఈ ఫోన్ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో 6.8 ఇంచుల 1.5K ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ స్క్రీన్‌ను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 100 శాతం డిసిఐ-పి3 కలర్ గ్యామట్,హెచ్‌డీఆర్10+కు సపోర్ట్ చేస్తుంది. అవుట్‌డోర్‌లో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ఏకంగా 5,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇందులో ఇచ్చారు. అన్నింటికంటే వినూత్నంగా ఇందులో వాటర్ టచ్ ఫీచర్‌ను జత చేశారు. దీనివల్ల చేతులు తడిగా ఉన్నా లేదా ఫోన్ స్క్రీన్‌పై నీటి చుక్కలు పడినా సరే టచ్ రెస్పాన్స్ ఏమాత్రం తగ్గకుండా స్మూత్‌గా పనిచేస్తుంది.
దుమ్ము, నీటికి తట్టుకునేలా మిలిటరీ గ్రేడ్ బాడీ
ఫోన్ డ్యూరబిలిటీ విషయంలో మోటోరోలా ఎలాంటి రాజీ పడలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఇచ్చారు. అంటే ఇది దుమ్ము, నీటి నుంచి ఫోన్‌కు గరిష్ట రక్షణ ఇస్తుంది. అంతేకాకుండా, కఠినమైన పరిస్థితులను సైతం తట్టుకునేలా దీనికి మిలిటరీ గ్రేడ్ MIL-810H సర్టిఫికేషన్‌ను కూడా అందించారు. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ డ్యూయల్ సిమ్ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత హెల్లో యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
Google : గూగుల్ జెమినిలో అదిరిపోయే ఫీచర్.. ఇక మీలాగే మాట్లాడే ఏఐ అవతార్ వచ్చేస్తోంది
పవర్‌ఫుల్ ప్రాసెసర్, కూలింగ్ సిస్టమ్
ఈ ఫోన్‌లో 4nm ఆర్కిటెక్చర్‌పై తయారైన పవర్‌ఫుల్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 3.4GHz క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. ప్రముఖ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్ ఆన్‌టుటులో ఈ ఫోన్ ఏకంగా 24 లక్షలకు పైగా స్కోర్ సాధించిందని కంపెనీ పేర్కొంది. ఇందులో 12జీబీ LPDDR5x ర్యామ్, 256జీబీ UFS 4.1 స్టోరేజ్ ఉన్నాయి. హెవీ గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ హీట్ అవ్వకుండా ఉండేందుకు 4,600 చదరపు మిల్లీమీటర్ల విస్తీర్ణం కలిగిన వేపర్ ఛాంబర్ కూలింగ్ టెక్నాలజీని ఇందులో అమర్చారు.
కెమెరాల పండగ.. 50ఎంపీ పెరిస్కోప్ లెన్స్
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం మోటోరోలా ఇందులో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌ను అద్భుతంగా డిజైన్ చేసింది. ఇందులో మెయిన్ కెమెరాగా సోనీ LYT-710 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్‌ను ఇచ్చారు. దీనితో పాటు 3x ఆప్టికల్ జూమ్, 50x డిజిటల్ జూమ్, ఓఐఎస్ సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను అందించడం విశేషం. ఇక మూడోది 112 డిగ్రీల వైడ్ వ్యూ ఇచ్చే 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా. ఇది 2-ఇన్-1 లైట్ సెన్సార్‌తో వస్తుంది. ఈ బ్యాక్ కెమెరాల ద్వారా 4K/60 fps వేగంతో వీడియోలను రికార్డ్ చేయవచ్చు. సెల్ఫీల కోసం ముందు భాగంలో ఆటోఫోకస్ ఫీచర్ ఉన్న 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు.
బాహుబలి బ్యాటరీ, కనెక్టివిటీ ఫీచర్లు
బ్యాటరీ పరంగా ఈ ఫోన్ ఒక పవర్‌హౌస్ అని చెప్పొచ్చు. ఇందులో ఏకంగా 6,500mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని ప్యాక్ చేశారు. దీనికి తోడు 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే ఎమర్జెన్సీ సమయంలో ఇతర డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవడానికి 5W రివర్స్ వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, వైఫై 6E, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి అన్ని ఫీచర్లు ఉన్నాయి. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, ఈ ఫోన్ కేవలం 7.19mm మందం, 190 గ్రాముల బరువు మాత్రమే ఉండటం విశేషం.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999