Google : గూగుల్ జెమినిలో అదిరిపోయే ఫీచర్.. ఇక మీలాగే మాట్లాడే ఏఐ అవతార్ వచ్చేస్తోంది

గూగుల్ ప్రవేశపెట్టిన సరికొత్త ఏఐ మోడల్ జెమిని ఆమ్నీ ఆధారంగా ఈ అవతార్ ఫీచర్ పనిచేస్తుంది. ఈ మోడల్ ఏ రకమైన ఇన్‌పుట్‌నైనా సరే క్షణాల్లో ప్రాసెస్ చేసి అద్భుతమైన కంటెంట్‌ను జనరేట్ చేయగలదు.

Google : గూగుల్ జెమినిలో అదిరిపోయే ఫీచర్.. ఇక మీలాగే మాట్లాడే ఏఐ అవతార్ వచ్చేస్తోంది

Photo Credit: Google

Omni is Google's first video generation model that combines multimodal input in a single prompt

ముఖ్యాంశాలు
  • గూగుల్ జెమినిలో అదిరిపోయే ఫీచర్
  • ఇక మీలాగే మాట్లాడే 'ఏఐ అవతార్'
  • టెక్నాలజీ ప్రపంచంలోనే మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్
ప్రకటన

Google : ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ జెమినిలో సరికొత్త విప్లవాత్మక ఫీచర్‌ను పరిచయం చేసింది. అదే జెమిని అవతార్. ఈ సరికొత్త ఫీచర్ సహాయంతో యూజర్లు తమలాగే హూబూహూ కనిపించే, మాట్లాడే ఒక డిజిటల్ రూపానికి ప్రాణం పోయవచ్చు. ప్రస్తుతం ఈ అద్భుతమైన ఫీచర్‌ను పెయిడ్ జెమిని సబ్‌స్క్రైబర్లకు గూగుల్ అందుబాటులోకి తెస్తోంది. గూగుల్ ప్రవేశపెట్టిన సరికొత్త ఏఐ మోడల్ జెమిని ఆమ్నీ ఆధారంగా ఈ అవతార్ ఫీచర్ పనిచేస్తుంది. ఈ మోడల్ ఏ రకమైన ఇన్‌పుట్‌నైనా సరే క్షణాల్లో ప్రాసెస్ చేసి అద్భుతమైన కంటెంట్‌ను జనరేట్ చేయగలదు.

జెమిని అవతార్ ఫీచర్‌ను ఎలా యాక్సెస్ చేయాలి?
ఈ కొత్త ఫీచర్‌ను వాడటం చాలా సులభం. జెమిని యాప్ వాడుతున్న పెయిడ్ యూజర్లు ముందుగా యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‎లోకి వెళ్లాలి. అక్కడ వారికి  అవతార్ అనే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఎనేబుల్ చేసుకున్న తర్వాత యూజర్లు తమ ఫేషియల్ ఫీచర్స్, వాయిస్ టోన్, మాట్లాడే శైలిని పోలిన ఏఐ అవతార్‌ను డిజైన్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ అవతార్ క్రియేట్ అయ్యాక, జెమిని చాట్స్‌లో కేవలం కొన్ని కమాండ్స్ ఇవ్వడం ద్వారా దీనిని యాక్టివేట్ చేయవచ్చు. దీని ద్వారా యూజర్లు తమ సొంత ముఖంతో రకరకాల వీడియోలను ఈజీగా తయారు చేసుకోవచ్చు.

ఫేస్ ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
జెమిని అవతార్ సెటప్ ప్రక్రియ చాలా సింపుల్‌గా ఉంటుంది. దీని కోసం యూజర్లు రెండు రకాల ట్రైనింగ్ సెషన్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటిది కెమెరా బేస్డ్ ఫేస్ ట్రైనింగ్. ఇందులో భాగంగా యూజర్లు తమ మొబైల్ ఫోన్‌ను కంటిచూపు లెవెల్లో పట్టుకోవాలి. ఆ తర్వాత స్క్రీన్‌పై వచ్చే సూచనలను పాటిస్తూ ముఖాన్ని వివిధ కోణాల నుంచి కెమెరాకు చూపించాల్సి ఉంటుంది. దీనివల్ల జెమిని ఏఐ మీ ముఖ ఆకృతిని, కళ్ల కదలికలను క్షుణ్ణంగా స్కాన్ చేసి ఒక పర్ఫెక్ట్ 3D మోడల్‌ను సిద్ధం చేస్తుంది.

Lumio : స్మార్ట్ టీవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి లుమియో విజన్ 9, విజన్ 7 కొత్త వేరియంట్లు

వాయిస్ ట్రైనింగ్ కూడా అవసరం
ఫేస్ స్కాన్ పూర్తయిన తర్వాత రెండో దశలో వాయిస్ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో జెమిని స్క్రీన్‌పై కొన్ని రాండమ్ వాక్యాలను, నంబర్లను చూపిస్తుంది. యూజర్లు వాటిని బిగ్గరగా చదవాలి. ఈ ప్రాసెస్ ద్వారా ఏఐ సిస్టమ్ మీ మాట్లాడే విధానం, వాయిస్ టోన్, యాక్సెంట్, శైలిని పూర్తిగా స్టడీ చేస్తుంది. ఈ రెండు దశలు విజయవంతంగా పూర్తయ్యాక, మీ ఏఐ అవతార్ మీ గూగుల్ అకౌంట్‌తో లింక్ అవుతుంది. ఆ తర్వాత గూగుల్ జెమినికి సంబంధించిన అన్ని సర్వీసుల్లో ఈ అవతార్ అందుబాటులోకి వస్తుంది.

స్కాన్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మీ ఫేస్, వాయిస్ స్కాన్‌లు పర్ఫెక్ట్‌గా రిజిస్టర్ అవ్వాలంటే కొన్ని నియమాలు పాటించాలని గూగుల్ సూచించింది. రూమ్‌లో లైటింగ్ మరీ తక్కువగా గానీ, మరీ ఎక్కువగా గానీ ఉండకూడదు. కళ్లు, ముక్కు, నోరు స్పష్టంగా కనిపించాలి. సాధారణ కళ్లద్దాలు పెట్టుకోవడానికి అనుమతి ఉన్నప్పటికీ.. టోపీలు, సన్‌గ్లాసెస్, మాస్క్‌లు ధరించకూడదు. అన్నింటికంటే ముఖ్యంగా మీరు స్కాన్ చేసుకునేటప్పుడు మీ వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలాంటి ఇతర వ్యక్తులు గానీ, ఫోటోలు గానీ ఉండకూడదు. ప్రశాంతమైన వాతావరణంలో మాత్రమే ఈ సెటప్ చేసుకోవాలి.

మిస్ యూజ్ కాకుండా గూగుల్ గట్టి సేఫ్‌గార్డ్స్
ఇలాంటి రియలిస్టిక్ ఏఐ అవతార్ల వల్ల భవిష్యత్తులో డీప్‌ఫేక్ ముప్పు వచ్చే అవకాశం ఉన్నందున గూగుల్ కొన్ని కఠినమైన భద్రతా నియమాలను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే యూజర్ వయస్సు ఖచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలి. అవతార్ క్రియేట్ చేసేటప్పుడు అకౌంట్ ఓనర్ లైవ్‌లో ఫిజికల్‌గా ప్రెజెంట్ అయి ఉండాలి. అంతేకాకుండా, జెమిని అవతార్ ద్వారా క్రియేట్ చేసే ప్రతి వీడియోలో గూగుల్ ప్రత్యేకంగా సింత్ ఐడీ అనే ఇన్విజిబుల్ వాటర్‌మార్క్‌ను పొందుపరుస్తుంది. ఈ వాటర్‌మార్క్ కంటికి కనిపించకపోయినా గూగుల్ టూల్స్ ద్వారా దీనిని కనిపెట్టవచ్చు. దీనివల్ల సోషల్ మీడియాలో ఆ వీడియోలను చూసేవారికి అది ఏఐ జనరేటెడ్ వీడియో అని సులభంగా అర్థమవుతుంది. ప్రస్తుతానికి పెయిడ్ యూజర్లకే పరిమితమైన ఈ ఫీచర్, ఫ్రీ యూజర్లకు ఎప్పుడు వస్తుందనే దానిపై గూగుల్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

సంబంధిత వార్తలు

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. రూ. 20 వేల లోపే వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్
  2. Flipkart Freedom Sale: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. రూ. 30 వేల మేర తగ్గిన శాంసంగ్ గెలాక్సీ S25+ ధర
  3. Amazon Great Freedom Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ధమాకా రూ. 2,000 బడ్జెట్‌లోనే బెస్ట్ ఇయర్ బడ్స్
  4. iPhone 17: యాపిల్ లవర్స్‎కు ఊహించని షాక్.. ఆకాశాన్ని తాకనున్న ఐఫోన్ 17 ధరలు
  5. Flipkart Freedom Sale 2026:  ఫ్రీడమ్ సేల్ ధమాకా.. ఎల్‌జీ, శాంసంగ్, సోనీ స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్లు
  6. Amazon Freedom Sale 2026: అమెజాన్ ఫ్రీడమ్ సేల్ ధమాకా.. హోమ్ సెక్యూరిటీ సీసీటీవీ కెమెరాలపై భారీ ఆఫర్లు
  7. Freedom Sale 2026: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్‌లో ధమాకా డిస్కౌంట్లు.. సగం ధరకే బ్రాండెడ్ 55-ఇంచ్ 4K టీవీలు
  8. UPI: యూపీఐ వాడితే చార్జీలు పడతాయా? గందరగోళానికి తెరదించిన ఆర్థిక మంత్రి
  9. Motorola G37 Power 5G: మోటోరోలా బంపర్ ఆఫర్.. 7000mAh భారీ బ్యాటరీ ఫోన్‌పై ఏకంగా 47% డిస్కౌంట్
  10. iQOO Z11 : భారత్‌లోకి ఐకూ Z11 గ్రాండ్ ఎంట్రీ.. ఆగస్టు 20న లాంచ్ కాబోతున్న పవర్‌ఫుల్ 5G ఫోన్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »