ప్రస్తుతం ఈ ఇయర్‌బడ్స్‌ను చైనా మార్కెట్లో విడుదల చేశారు. చైనా మార్కెట్లో ఈ సరికొత్త లెనోవో యోగా ఇయర్‌బడ్స్ ధరను 599 యువాన్లు (మన భారత కరెన్సీలో సుమారు రూ.8,500)గా నిర్ణయించారు.
Photo Credit: JD.com
Lenovo Yoga
Lenovo Yoga Earbuds : ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ సంస్థ లెనోవో ఆడియో మార్కెట్లోకి సరికొత్త సరిహద్దులను దాటుకుంటూ అడుగుపెట్టింది. తన ప్రీమియం యోగా సిరీస్ కింద సరికొత్త లెనోవో యోగా ఇయర్‌బడ్స్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇప్పటివరకు లాప్‌టాప్‌లు, టాబ్లెట్లలో తన మార్కు చూపించిన లెనోవో.. ఇప్పుడు ఇయర్‌బడ్స్ రంగంలో కూడా మోస్ట్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఈ ఇయర్‌బడ్స్‌ను చైనా మార్కెట్లో విడుదల చేశారు. చైనా మార్కెట్లో ఈ సరికొత్త లెనోవో యోగా ఇయర్‌బడ్స్ ధరను 599 యువాన్లు (మన భారత కరెన్సీలో సుమారు రూ.8,500)గా నిర్ణయించారు. ఇవి ఇప్పటికే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో లిస్ట్ అయ్యాయి. చైనాకు చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సైట్ JD.comలో ఈ ఇయర్‌బడ్స్‌పై పరిమిత కాలం పాటు ప్రత్యేక లాంచ్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందిస్తున్నారు. త్వరలోనే ఈ ఇయర్‌బడ్స్ భారతదేశంతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విడుదల కానున్నాయి.
సౌండ్ క్వాలిటీ అద్భుతం.. బయటి సౌండ్లకు నో ఎంట్రీ
ఈ ఇయర్‌బడ్స్‌లో సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే లెనోవో అదిరిపోయే హార్డ్‌వేర్‌ను వాడింది. ఇందులో 12.2mm పవర్‌ఫుల్ డైనమిక్ డ్రైవర్లను అమర్చారు. ఇది బేస్, ట్రెబుల్‌ను చాలా క్లియర్‌గా వినిపించేలా చేస్తుంది. వీటన్నింటికీ తోడు ఇందులో 40dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను అందించారు. దీనివల్ల మీరు జనాభా ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో లేదా జర్నీలో ఉన్నప్పుడు బయటి అల్లరి శబ్దాలు ఏవీ వినపడకుండా ప్రశాంతంగా మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. అలాగే ఇందులో ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ కూడా ఉంది.
క్రిస్టల్ క్లియర్ కాల్స్, పెబుల్ డిజైన్
వాయిస్, వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి వీలుగా లెనోవో ప్రతి ఇయర్‌బడ్‌లో మూడు మైక్రోఫోన్ల చొప్పున.. మొత్తం 6 మైక్రోఫోన్లను అందించింది. ఇవి కాలింగ్ సమయంలో అవతలి వారికి మీ వాయిస్‌ను చాలా స్పష్టంగా అందేలా చేస్తాయి. ఈ ఇయర్‌బడ్స్ డిజైన్ చాలా సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. దీని ఛార్జింగ్ కేస్ గుండ్రంగా, సముద్రపు రాయి తరహా ఆకారంలో చూడముచ్చటగా ఉంటుంది. ఇవి బరువులో చాలా తేలికగా ఉంటాయి, ఒక్కో ఇయర్‌బడ్ బరువు కేవలం 4.7 గ్రాములు మాత్రమే ఉంటుంది.
డ్యూయల్ కనెక్టివిటీ, స్మార్ట్ టచ్ కంట్రోల్స్
లెనోవో యోగా ఇయర్‌బడ్స్‌లో ఉన్న మరొక సూపర్ ఫీచర్ డ్యూయల్ డివైజ్ కనెక్టివిటీ. దీని సహాయంతో ఈ ఇయర్‌బడ్స్‌ను ఒకే సమయంలో రెండు వేర్వేరు డివైజ్‌లకు (ఉదాహరణకు మీ ఫోన్, లాప్‌టాప్) కనెక్ట్ చేసుకోవచ్చు. లాప్‌టాప్‌లో వీడియో చూస్తున్నప్పుడు ఫోన్ వస్తే.. ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇందులో స్మార్ట్ ట్యాప్ కంట్రోల్స్ ఉన్నాయి. వీటి ద్వారా ఏఎన్‌సీ మోడ్ మార్చుకోవడం, వాల్యూమ్ అడ్జస్ట్ చేయడం వంటి సెట్టింగ్స్‌ను మనకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే ఇవి IPX4 రేటింగ్‌తో వస్తాయి కాబట్టి చిన్నపాటి వర్షపు జల్లులు, పసిని వూటల నుంచి వీటికి ఎలాంటి ప్రమాదం ఉండదు.
36 గంటల భారీ బ్యాటరీ లైఫ్
బ్యాటరీ పరంగా లెనోవో యోగా ఇయర్‌బడ్స్ కస్టమర్లను అస్సలు నిరాశపరచవు. మీరు ఒకవేళ ఏఎన్‌సీ మోడ్ ఆన్ చేయకుండా కేవలం నార్మల్ మోడ్‌లో మ్యూజిక్ వింటే.. ఇయర్‌బడ్స్ సింగిల్ ఛార్జ్‌పై 7 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 36 గంటల భారీ బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. అదే ఒకవేళ ఏఎన్‌సీ మోడ్ ఆన్ చేస్తే ఇయర్‌బడ్స్ 4.5 గంటలు, కేస్‌తో కలిపి 24 గంటల పాటు వస్తాయి. ఇందులో క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు.. ఏకంగా 2 గంటల పాటు వాడుకోవచ్చు. ఈ ఇయర్‌బడ్స్ కంప్లీట్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి కేవలం 1 గంట సమయం పడుతుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know
WhatsApp Could Bring New Theme Categories and Wallpapers to Android