మిడిల్ ఈస్ట్, జపాన్, యూరప్‌లోని కొన్ని భాగాలు సహా దాదాపు 12 రకాల అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నథింగ్ తప్పుకోబోతోందని ఆ నివేదిక పేర్కొంది.
Nothing
Nothing : గ్లోబల్ మార్కెట్ల నుంచి వెనక్కి తగ్గుతోందంటూ వస్తున్న వార్తలపై ప్రముఖ లండన్ ఆధారిత టెక్ బ్రాండ్ నథింగ్ మొత్తానికి స్పందించింది. అంతర్జాతీయంగా ఎలాంటి వ్యాపారాన్ని మూసివేయడం లేదని, వస్తున్న వార్తలన్నీ తప్పుడు సమాచారమేనని కంపెనీ కో-ఫౌండర్ అకిస్ ఇవాంజెలిడిస్ సోషల్ మీడియా వేదికగా ఖండించారు.
అసలు వివాదం ఏమిటి?
ఇటీవల Digit ప్రచురించిన ఒక నివేదిక టెక్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. మిడిల్ ఈస్ట్, జపాన్, యూరప్‌లోని కొన్ని భాగాలు సహా దాదాపు 12 రకాల అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నథింగ్ తప్పుకోబోతోందని ఆ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, గ్లోబల్ స్థాయిలో 40 శాతం ఉద్యోగులను తగ్గించుకుంటోందని చైనా, లండన్‌లలోని ఆర్ అండ్ డి విభాగాల్లో దాదాపు 50 శాతం వరకు లేఆఫ్‌లు చేపడుతోందని అందులో కథనాలు వచ్చాయి. రీసెంట్‌గా రామ్, మెమరీ చిప్‌ల ధరలు నాలుగు రెట్లు పెరిగిపోవడం వల్ల బడ్జెట్ డివైజ్‌ల విక్రయాల్లో ఒత్తిడి పెరిగిందని ఈ సుస్తికి కారణాలుగా విశ్లేషించారు.
నథింగ్ ఘాటు స్పందన
ఈ రూమర్లపై నథింగ్ కో-ఫౌండర్ అకిస్ ఇవాంజెలిడిస్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. "ఇది కేవలం ఫేక్ న్యూస్. మేము ఏ మార్కెట్‌నూ మూసివేయడం లేదు. రీసెంట్‌గా లాంచ్ చేసిన Nothing Phone (4b) కేవలం మొదటి రోజే 29,537 యూనిట్లు అమ్ముడుపోయి ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. రాబోయే రోజుల్లో కంపెనీని మరింత విస్తరించేందుకు, ప్రత్యేక ఏఐ-నేటివ్ బిజినెస్ యూనిట్‌లను ఏర్పాటు చేసేందుకు టీమ్‌లను పునర్వ్యవస్థీకరిస్తున్నాం తప్ప మార్కెట్ నుంచి వెళ్లిపోవడం లేదు" అని స్పష్టం చేశారు.
Vivo S2 : ఏడేళ్ల తర్వాత వీవో సరికొత్త సంచలనం.. ఆగస్టు 6న భారత్‌లో Vivo S2 లాంచ్
కంపెనీ తదుపరి దశ ఎదుగుదల కోసం దేశాల వారీ ఆపరేషన్లను ప్రాంతీయ హబ్‌లుగా మారుస్తున్నట్లు వివరించారు. మెమరీ ధరలు పెరిగిన మాట వాస్తవమే అయినా, బ్రాండ్ రీఆర్గనైజేషన్ ద్వారా నథింగ్ మరింత బలంగా తిరిగి వస్తుందని అభిమానులకు భరోసా ఇచ్చారు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains