వీవో S2 ఫోన్ ప్రీమియం ఫ్లాగ్షిప్ లెవెల్ స్పెసిఫికేషన్లతో రాబోతోంది.
Photo Credit: Vivo
Vivo
Vivo S2 : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వీవో భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు ఒక బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కంపెనీ తన పాపులర్ S-సిరీస్‌ను తిరిగి భారత్‌లోకి లాంచ్ చేసేందుకు రంగాన్ని సిద్ధం చేసింది. 2019లో అత్యంత ప్రజాదరణ పొందిన Vivo S1 లాంచ్ అయిన తర్వాత ఈ సిరీస్ మార్కెట్లో నిలిచిపోయింది. అయితే ఇప్పుడు సరికొత్త అప్డేట్స్, అత్యాధునిక ఫీచర్లతో Vivo S2 పేరుతో ఈ లైనప్‌ను రీ-ఎంట్రీ చేయిస్తున్నట్లు కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది.
లాంచ్ తేదీ, సేల్ వివరాలు
ప్రముఖ టెక్ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్, సోషల్ మీడియా లీక్స్ కథనాల ప్రకారం.. ఈ Vivo S2 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో ఆగస్టు 6న అధికారికంగా విడుదల కానుంది. ఇక ఈ డివైజ్ మొదటి సేల్ ఆగస్టు 11 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీవో ఇండియా కూడా తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఒక ఆసక్తికరమైన ప్రోమో పోస్టర్‌ను షేర్ చేస్తూ ఈ లాంచ్‌ను ధృవీకరించింది.
1.5K OLED డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 చిప్సెట్
లీకైన సమాచారం ప్రకారం.. వీవో S2 ఫోన్ ప్రీమియం ఫ్లాగ్షిప్ లెవెల్ స్పెసిఫికేషన్లతో రాబోతోంది.
* డిస్ప్లే: 6.59 ఇంచుల 1.5K రెజల్యూషన్ కలిగిన OLED డిస్ప్లేను అందించనున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు సెక్యూరిటీ కోసం అండర్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.
* ప్రాసెసర్: స్మూత్ పర్ఫార్మెన్స్, మల్టీ టాస్కింగ్ కోసం ఇందులో శక్తివంతమైన Snapdragon 8 Gen 5 చిప్‌సెట్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది.
* ర్యామ్, స్టోరేజ్: ఈ ఫోన్ 8GB ర్యామ్‌తో రానుంది. స్టోరేజ్ పరంగా 128GB, 256GB ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది.
* కలర్స్: వైవిధ్యమైన డిజైన్‌తో Sapphire Blue, Regal Bronze, Silk White వంటి మూడు ఆకర్షణీయమైన షేడ్స్‌లో లభించనుంది.
VPN Safety : నెట్లో ప్రైవసీ కావాలా బాస్? ఆండ్రాయిడ్‌లో ఈ చిన్న VPN ట్రిక్ వాడేయండి
ధర ఎంత ఉండొచ్చు?
ఈ అడ్వాన్స్డ్ ఫ్లాగ్షిప్ కంబైన్డ్ ఫీచర్ల కారణంగా వీవో S2 ప్రారంభ ధర భారత్‌లో సుమారు రూ.38,000 నుంచి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక టాప్ ఎండ్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 42,000 వరకు వెళ్లే అవకాశం ఉంది. అధునాతన ప్రాసెసింగ్ పవర్, డిజైన్, కెమెరా ప్రాధాన్యత ఇచ్చే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని వీవో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Tomb Raider: Legacy of Atlantis Gets New Trailer Showing Lara Croft Gameplay
Samsung Galaxy S27 Exynos 2700 Chipset Reportedly Outperforms Snapdragon 8 Elite Gen 6 Series