Nothing Phone (4a) Price Hike : స్మార్ట్‎ఫోన్ లవర్స్‎కు షాకింగ్ న్యూస్.. ఆగస్టు 1 నుంచి భారీగా పెరగనున్న నథింగ్ ఫోన్ ధరలు

ఆగస్టు 1 నుంచి నథింగ్ ఫోన్ (4a) వేరియంట్లపై ఏకంగా రూ. 3,000 వరకు ధర పెరగనుంది.

Nothing Phone (4a) Price Hike : స్మార్ట్‎ఫోన్ లవర్స్‎కు షాకింగ్ న్యూస్.. ఆగస్టు 1 నుంచి భారీగా పెరగనున్న నథింగ్ ఫోన్ ధరలు

Photo Credit: Nothing

Nothing Phone (4a)

ముఖ్యాంశాలు
  • నథింగ్ ఫోన్ ప్రేమికులకు షాకింగ్ న్యూస్
  • ఆగస్టు 1 నుంచి మోత మోగనున్న నథింగ్ ఫోన్ (4a) ధరలు
  • నథింగ్ ఫోన్ (4a) అన్ని వేరియంట్లపై రూ. 3,000 ధరల పెంపు
ప్రకటన

Nothing Phone (4a) Price Hike : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నథింగ్ తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయింది. భారతీయ మార్కెట్లో అత్యంత పాపులర్ అయిన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (4a) ధరలను కంపెనీ త్వరలోనే భారీగా పెంచబోతోందని తెలుస్తోంది.  ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ ఫోన్‌లోని అన్ని ర్యామ్, స్టోరేజ్ వేరియంట్ల ధరలు పెరగనున్నాయని ప్రముఖ ఆన్‌లైన్ టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నెలలో నథింగ్ ఫోన్ (4a) ప్రోతో పాటు మార్కెట్లోకి విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్, తన వినూత్నమైన డిజైన్, మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో మంచి ఆదరణ పొందింది.

వేరియంట్ల వారీగా ఎంత పెరగనుందంటే?
టిప్‌స్టర్ అందించిన సమాచారం ప్రకారం ఆగస్టు 1 నుంచి నథింగ్ ఫోన్ (4a) వేరియంట్లపై ఏకంగా రూ. 3,000 వరకు ధర పెరగనుంది. దీని ప్రకారం చూస్తే, ప్రారంభ వేరియంట్ అయిన 8GB + 128GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 42,999కి చేరుకోనుంది. అలాగే 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 46,999, టాప్ వేరియంట్ అయిన 12GB + 256GB స్టోరేజ్ ధర రూ. 49,999 వరకు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ. 39,999, రూ. 43,999, రూ. 46,999 గా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ధరల పెంపుపై నథింగ్ సంస్థ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఒకవేళ మీరు ఈ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఆగస్టు 1 కంటే ముందే ఆర్డర్ చేసుకోవడం మంచిది.

అదిరిపోయే ఫీచర్లు.. ఫుల్లీ లోడెడ్ డిస్‌ప్లే 
ఫీచర్ల విషయానికి వస్తే నథింగ్ ఫోన్ (4a) లో అత్యంత అద్భుతమైన డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ 6.78 అంగుళాల ఎల్టీపీఎస్ ఫ్లెక్సిబుల్ అమోలెడ్  డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 1224x2720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, ఏకంగా 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS 4.1 పై పనిచేస్తుంది. ప్రాసెసింగ్ కోసం ఇందులో పవర్ఫుల్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4  చిప్‌సెట్‌ను అమర్చారు.

Kerala Boy Cardboard Robot : పాత అట్టపెట్టెలతో అమ్మకి సాయం చేసే రోబోట్.. కేరళ కుర్రాడి వినూత్న ప్రయోగం

కెమెరా క్వాలిటీ అద్భుతం 
ఫొటోగ్రఫీ లవర్స్ కోసం ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో f/1.88 అపెర్చర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందూ భాగంలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో 5,400mAh భారీ బ్యాటరీని అందించారు, ఇది 50W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ బ్లాక్, వైట్, బ్లూ, పింక్ రంగులలో అందుబాటులో ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G, వై-ఫై, బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్, టైప్-సి పోర్ట్ సదుపాయాలు ఉన్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »