లెవిన్ టాలెంట్ కేవలం ఈ రోబోట్ తయారీతోనే ఆగిపోలేదు. తన తెలివితేటలతో ఇంట్లో రోజువారీ పనులను సులభతరం చేసే మరికొన్ని డిఐవై పరికరాలను కూడా రూపొందించాడు.
Photo Credit: indiatoday
Kerala Boy Cardboard Robot
Kerala Boy Cardboard Robot : నేటి డిజిటల్ యుగంలో చాలామంది పిల్లలు, యువత తమ ఖాళీ సమయాన్ని స్మార్ట్‌ఫోన్లు, గేమ్స్ లేదా సోషల్ మీడియాలో వ్యర్థం చేస్తుంటారు. కానీ కేరళకు చెందిన లెవిన్ పౌలోస్ అనే సాధారణ కుర్రాడు మాత్రం తన క్రియేటివిటీతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంట్లో పడి ఉన్న పాత గత్తెలు, కార్డ్‌బోర్డ్ ముక్కలు, చిన్న మోటార్లు, వైర్లు, బ్యాటరీలు, నట్-బోల్టులను ఉపయోగించి అతను ఒక పనిచేసే రోబోను తయారు చేశాడు. కేవలం ప్రదర్శన కోసం మాత్రమే కాకుండా, తన తల్లికి ఇంటి పనుల్లో నిజంగా సాయపడేలా ఈ రోబోను డిజైన్ చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఒక్కటి కాదు.. ఎన్నో ఉపయోగకరమైన ఆవిష్కరణలు
లెవిన్ టాలెంట్ కేవలం ఈ రోబోట్ తయారీతోనే ఆగిపోలేదు. తన తెలివితేటలతో ఇంట్లో రోజువారీ పనులను సులభతరం చేసే మరికొన్ని డిఐవై పరికరాలను కూడా రూపొందించాడు. ఇంట్లో వాడే డస్ట్ శుభ్రం చేయడానికి వాక్యూమ్ క్లీనర్, ఆటోమేటిక్‌గా పనిచేసే కర్టెన్ ఓపెనర్, మజ్జిగ చిలకడానికి ఉపయోగపడే మిషన్లను కూడా స్వయంగా తయారు చేశాడు. ఎలాంటి పెద్ద చదువులు లేదా హైటెక్ కోర్సులు చదవకపోయినా, అతనిలోని అపారమైన ఆసక్తి, పట్టుదల, కష్టం అతడిని ఒక చిన్నపాటి సైంటిస్ట్‌గా మార్చాయి.
ల్యాబ్ లేదు.. హైటెక్ పరికరాలు లేవు
లెవిన్ చేసిన ఆవిష్కరణల వెనుక ఉన్న అసలు రహస్యం అతని ఇంట్లోనే ఉంది. అతనికి ప్రయోగాలు చేయడానికి పెద్ద పెద్ద సైంటిఫిక్ ల్యాబ్‌లు లేదా ఖరీదైన పరికరాలు ఏవీ లేవు. ఇంట్లో సాధారణంగా పడేసే పనికిరాని వస్తువులు, పాత ఎలక్ట్రిక్ సామాన్లతోనే ఇవన్నీ సాధించాడు. తన ప్రయోగాల ద్వారా ఇళ్లకు ఉపయోగపడే వస్తువులను తయారు చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
సీఎంను సైతం మెప్పించిన లెవిన్ టాలెంట్
సాధారణ వస్తువులతో అద్భుతాలు సృష్టిస్తున్న లెవిన్ నైపుణ్యాన్ని కేరళలోని ప్రముఖులు గుర్తించారు. అతడి క్రియేటివిటీని మెచ్చుకుంటూ కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీషన్ స్వయంగా లెవిన్‌ను కలిసి అభినందించేందుకు ప్రత్యేక అవకాశాన్ని ఇచ్చారు. పెద్ద చదువులు లేదా వనరులు లేకపోయినా కేవలం ఆలోచన, పట్టుదల ఉంటే ఎంతటి గొప్ప ఆవిష్కరణలైనా చేయవచ్చని లెవిన్ నిరూపించాడు. నెటిజన్లు కూడా లెవిన్ క్రియేటివిటీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains