వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ 2023 ఫిబ్రవరిలో లాంచ్ చేసింది. వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అసలు ధర రూ.56,999 గా ఉంది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై ఏకంగా 35 శాతం భారీ తగ్గింపును ఇస్తోంది.
Photo Credit: OnePlus
OnePlus के फ्लैगशिप स्मार्टफोन OnePlus 11 5G पर धांसू ऑफर आया है।
OnePlus 11 5G : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. వన్‌ప్లస్ సంస్థకు చెందిన మోస్ట్ పాపులర్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్‌ప్లస్ 11 5జీ పై ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. క్వాలిటీ కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో ఉండే ఈ లగ్జరీ ఫోన్‌ను సొంతం చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ టైమ్ అని చెప్పవచ్చు. నిజానికి వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ 2023 ఫిబ్రవరిలో లాంచ్ చేసింది. వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ అసలు ధర రూ.56,999 గా ఉంది. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై ఏకంగా 35 శాతం భారీ తగ్గింపును ఇస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ కింద కస్టమర్లు కేవలం రూ.38,948కే ఈ ఫోన్‌ను లిస్టింగ్ చేశారు. అంటే ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేకుండానే నేరుగా 18 వేల రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది.
బ్యాంక్ ఆఫర్‌తో అదనపు తగ్గింపు
ఫ్లిప్‌కార్ట్ ఈ డీల్‌ను ఇంతటితో ఆపలేదు. ఈ ఫోన్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్లను కూడా జత చేసింది. కస్టమర్లు గనుక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే, వారికి మరో రూ.1,948 అదనపు తగ్గింపు లభిస్తుంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ కూడా తోడైతే వన్‌ప్లస్ 11 5జీ ఫోన్ ఫైనల్ ధర కేవలం రూ.37,000కే చేరుకుంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఫోన్‌పై దాదాపు 22 వేల రూపాయల వరకు భారీ లాభం కలుగుతుంది.
కళ్ళు చెదిరే డిస్‌ప్లే, ప్రాసెసర్ ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన స్పెసిఫికేషన్లతో వస్తుంది. ఇందులో 6.7 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 3216 x 1440 పిక్సెల్స్ స్క్రీన్ రెజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఇక ఫోన్ పర్ఫార్మెన్స్ కోసం ఇందులో శక్తివంతమైన ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ 2 ప్రాసెసర్‌ను వాడారు. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.
నిమిషాల్లో చార్జ్ అయ్యే పవర్‌ఫుల్ బ్యాటరీ
ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో 5,000mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీని అమర్చారు. దీనికి తోడు 100W సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం విశేషం. ఈ ఫీచర్ వల్ల కేవలం కొద్ది నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ చార్జ్ అయిపోతుంది. సుదీర్ఘమైన బ్యాటరీ బ్యాకప్ కస్టమర్లకు లభిస్తుంది. సెక్యూరిటీ కోసం ఫోన్ స్క్రీన్ లోపలే ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించారు.
ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ కెమెరా సెటప్
కెమెరాల విషయానికి వస్తే వన్‌ప్లస్ 11 5జీ లో టాప్ క్లాస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో f/1.8 అపెర్చర్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, f/2.2 అపెర్చర్‌తో 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 32 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాలను అమర్చారు. దీనివల్ల ప్రొఫెషనల్ రేంజ్ ఫోటోలు తీసుకోవచ్చు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్ బరువు 205 గ్రాములు మాత్రమే ఉంటుంది. ఇంతటి ప్రీమియం ఫీచర్లు ఉన్న ఫోన్ 37 వేల ధరకే రావడం నిజంగానే లక్కీ డీల్ అని చెప్పాలి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Google Play Store ‘Shop Devices’ Feature Goes Live in India With Pixel Phones and Accessories