దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి ఎట్టకేలకూ తన మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారు ప్రొడక్షన్ వెర్షన్ వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ను అధికారికంగా ఆవిష్కరించింది.
Photo Credit: Maruti Suzuki
Maruti Suzuki Wagon R Flex Fuel E85 इथेनॉल फ्यूल सपोर्ट के साथ पेश हुई
Wagon R Flex Fuel : భారతదేశ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి తెర లేచింది. దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి ఎట్టకేలకూ తన మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారు ప్రొడక్షన్ వెర్షన్ వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. గతంలో ఈ కారుకు సంబంధించిన ప్రొటోటైప్ మోడళ్లను కంపెనీ ప్రదర్శించినప్పటికీ, ఇప్పుడు పూర్తిస్థాయిలో రోడ్లపైకి తెచ్చేందుకు ప్రొడక్షన్ మోడల్‌ను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ సరికొత్త ఇంధన కారును కమర్షియల్ సెక్టార్ (టాక్సీ, ఇతర వ్యాపారాల) కోసం మాత్రమే అందుబాటులోకి తెచ్చారు.
అసలు ఫ్లెక్స్ ఫ్యూయల్ అంటే ఏమిటి?
ఈ వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును మొదటిసారిగా 2022లో ప్రదర్శించారు. ఆ తర్వాత భారత్ మొబిలిటీ షో 2024 లోనూ షోకేస్ చేశారు. ఇప్పుడు వచ్చిన ఫైనల్ వెర్షన్ కారు E85 ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా సర్టిఫై చేయబడింది. అంటే ఈ కారులో ఏకంగా 85 శాతం వరకు ఇథనాల్‌ను, మిగిలిన 15 శాతం పెట్రోల్‌ను కలిపి ఇంధనంగా వాడుకోవచ్చు. ఇంకా సులభంగా చెప్పాలంటే, ఈ కారు E20 (20% ఇథనాల్) నుండి E100 (100% ప్యూర్ ఇథనాల్) వరకు ఏ రకమైన పెట్రోల్-ఇథనాల్ మిశ్రమంతోనైనా సులభంగా నడుస్తుంది.
ఇంజన్‌లో చేసిన భారీ మార్పులు ఇవే
సాధారణ పెట్రోల్ కార్లలో ఇథనాల్ మిశ్రమాన్ని ఎక్కువగా వాడితే ఇంజన్ పాడైపోయే అవకాశం ఉంది. అందుకే మారుతి సుజుకి ఈ కొత్త వ్యాగన్ ఆర్ లోని 1.2-లీటర్, K12N ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసింది. ఇథనాల్ ఇంధనానికి తట్టుకునేలా ఇందులో కొత్త ఫ్యూయల్ ఇంజెక్టర్లు, పవర్‌ఫుల్ ఫ్యూయల్ పంప్, సరికొత్త ఫ్యూయల్ లైన్లను అమర్చారు. వీటితో పాటు కారులోని ఇంధనంలో ఎంత శాతం ఇథనాల్ ఉందో గుర్తించడానికి ప్రత్యేకంగా ‘ఇథనాల్ సెన్సార్' మరియు రీ-కాలిబ్రేటెడ్ ఈసీయూను కూడా అమర్చారు. అయితే ఈ కారు పవర్, మైలేజ్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
దేశంలోనే మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్రొడక్షన్ కారు
ఈ లాంచ్‌తో భారతదేశంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాన్ని ప్రొడక్షన్ దశకు తీసుకొచ్చిన మొట్టమొదటి కార్ల తయారీ సంస్థగా మారుతి సుజుకి రికార్డు సృష్టించింది. గతంలో టయోటా సంస్థ తన కొరోల్లా ఫ్లెక్స్ ఫ్యూయల్ (2022), ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ (2024) మోడళ్లను ప్రదర్శించింది. అలాగే టాటా మోటార్స్ కూడా పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును ప్రదర్శించినప్పటికీ.. మార్కెట్లోకి ప్రొడక్షన్ మోడల్‌ను మాత్రం మారుతి సుజుకి సంస్థే ముందుగా తీసుకురావడం విశేషం. ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఈ కారు ఎంతగానో ఉపయోగపడనుంది.
Ugly Story : ఓటీటీలోకి వచ్చేసిన అవికా గోర్ అగ్లీ స్టోరీ.. గుండెల్ని పిండేసే ఎమోషనల్ డ్రామా
ఇథనాల్ బంకుల లభ్యత ఎలా ఉంది?
కొత్త టెక్నాలజీతో కార్లు వస్తున్నప్పటికీ, ప్రస్తుతం దేశంలో E85 ఇంధన లభ్యత చాలా పరిమితంగా ఉంది. ఎందుకంటే ఇథనాల్ ఇంధనాన్ని నిల్వ చేయడానికి, కార్లలో కొట్టించడానికి విడిగా ప్రత్యేకమైన స్టోరేజ్, డిస్పెన్సింగ్ మెషీన్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం మనదేశంలో సాధారణ బంకుల్లో కేవలం E20 మాత్రమే బేస్ స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంది. పూర్తిస్థాయిలో E85 ఇంధనం దొరకడానికి మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది.
2027 నాటికి 5,000 ఇథనాల్ బంకులు
ఈ ఇంధన కొరతను అధిగమించడానికి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి భారీ ప్రణాళికను ప్రకటించారు. మొదటగా ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై-పుణె-నాగ్పూర్ హైవే కారిడార్లలో 50 నుంచి 100 వరకు E85 ఇంధన బంకులను ప్రారంభించనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి వాటి సంఖ్యను 500కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా 2027 చివరి నాటికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు 5,000 E85 డిస్పెన్సింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఇథనాల్ ఇంధనం ధర సాధారణ పెట్రోల్ కంటే తక్కువగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Google Play Store ‘Shop Devices’ Feature Goes Live in India With Pixel Phones and Accessories