వన్ ప్లస్ 11 తర్వాత మళ్లీ ఈ మోడల్‌తో 8GB రామ్ వేరియంట్‌ను కంపెనీ రీ-ఇంట్రడ్యూస్ చేయబోతోంది.
OnePlus 15
OnePlus 16 : ప్రముఖ టెక్ దిగ్గజం వన్ ప్లస్ తమ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్ ప్లస్ 16ను త్వరలోనే విపణిలోకి విడుదల చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన స్నాప్‌డ్రాగన్ గేమింగ్ టెక్నాలజీ అవార్డ్స్ వేదికగా ఈ స్మార్ట్‌ఫోన్ మొదట చైనాలో లాంచ్ కానుందని కంపెనీ అధికారికంగా ధృవీకరించింది. గతంలో విడుదలైన వన్ ప్లస్ 15 మోడల్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా రానున్న ఈ కొత్త ఫోన్‌లో అడ్వాన్సుడ్ ఫీచర్లతో పాటు నెక్స్ట్ లెవెల్ గేమింగ్ టెక్నాలజీని అందించబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
8GB రామ్ వేరియంట్ రీ-ఎంట్రీ.. లీకైన ధరల వివరాలు
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X వేదికగా @OnePlusClub అందించిన సమాచారం ప్రకారం.. వన్ ప్లస్ 11 తర్వాత మళ్లీ ఈ మోడల్‌తో 8GB రామ్ వేరియంట్‌ను కంపెనీ రీ-ఇంట్రడ్యూస్ చేయబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం నాలుగు రామ్, స్టోరేజ్ వేరియంట్లలో లభించనుంది. ప్రాథమిక అంచనాల ప్రకారం:
* 8GB RAM + 256GB స్టోరేజ్: CNY 4,999 (సుమారు రూ. 70,600)
* 12GB RAM + 256GB స్టోరేజ్: CNY 5,499 (సుమారు రూ. 77,600)
* 12GB RAM + 512GB స్టోరేజ్: CNY 5,999 (సుమారు రూ. 84,700)
* 16GB RAM + 1TB స్టోరేజ్ (లిమిటెడ్ ఎడిషన్): CNY 7,499 (సుమారు రూ. 1,05,900) ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
నెక్స్ట్ లెవెల్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్
ఈ రాబోయే వన్ ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్‌లో గేమర్స్ కోసం ప్రత్యేకంగా సరికొత్త గేమింగ్ టెక్నాలజీని పొందుపరిచినట్లు కంపెనీ వెల్లడించింది. హై-ఎండ్ గ్రాఫిక్ గేమ్‌లను కూడా చాలా స్మూత్‌గా ఆడుకునేలా ప్రత్యేక కూలింగ్ సిస్టమ్, ఫ్రేమ్ రేట్ సపోర్ట్‌ను ఇందులో అందించనున్నారు. లీక్ అయిన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ గేమింగ్ విభాగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పనుంది.
మునుపటి మోడల్ వన్ ప్లస్ 15 ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
గతేడాది నవంబర్‌లో భారత్‌లో లాంచ్ అయిన వన్ ప్లస్ 15 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే.. ఇది 6.78 ఇంచుల FHD+ (1,272x2,772 పిక్సెల్స్) 1.5K LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ విషయానికొస్తే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పాటు Adreno 840 GPU అందించారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత Color OS 16పై పనిచేస్తుంది. గేమింగ్ కోసం ఇందులో ప్రత్యేకంగా ఐస్ రివర్ వేపర్ కూలింగ్ సిస్టమ్‌తో పాటు కొన్ని గేమ్‌లకు 165 fps వరకు సపోర్ట్ ఇచ్చారు.
Flipkart Freedom Sale : బండి కొనడానికి షోరూమ్‌కి వెళ్లే పనిలేదు.. ఫ్లిప్‌కార్ట్‌లో బైక్‌లపై భారీ డిస్కౌంట్లు
కెమెరా, పవర్‌ఫుల్ బ్యాటరీ సెటప్
వన్ ప్లస్ 15 వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో f/1.8 అపెర్చర్‌తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 50 మెగాపిక్సెల్ ఆల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు. సెక్యూరిటీ కోసం ఇన్-డిస్‌ప్లే ఆల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 7,300 mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్లన్నింటి కంటే మరింత మెరుగైన అప్‌గ్రేడ్స్‌తో వన్ ప్లస్ 16 రాబోతోంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know
WhatsApp Could Bring New Theme Categories and Wallpapers to Android
Mivi One 5G Camera Details Revealed, Mivi Care+ Support Teased Ahead of Launch