యూత్ కోసం హీరో తీసుకొచ్చిన ఎక్స్‌ట్రీమ్ 125R మోటార్ సైకిల్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 86,200 ఆకర్షణీయమైన ప్రారంభ ధరతో అందుబాటులోకి రానుంది.
Photo Credit: Flipkart
Flipkart Freedom Sale 8
Flipkart Freedom Sale : భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌ను ఆగస్ట్ 8 నుంచి నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కస్టమర్లను ఆకట్టుకునేలా ఎలక్ట్రానిక్స్, దుస్తులతో పాటు ఈసారి మోటార్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లపై కూడా ప్రత్యేకాఫర్లను లైవ్ చేస్తోంది. మీరు సరికొత్త బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఈ సేల్‌లో మీకు భారీగా డబ్బులు ఆదా చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ సూచించే ఈ ధరలు కేవలం ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. దీనిపై రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి ఇతర చార్జీలు అదనంగా ఉంటాయి.
హీరో ఎక్స్‌ట్రీమ్ 125R
స్పోర్టీ లుక్ ఇష్టపడే యూత్ కోసం హీరో తీసుకొచ్చిన ఎక్స్‌ట్రీమ్ 125R మోటార్ సైకిల్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 86,200 ఆకర్షణీయమైన ప్రారంభ ధరతో అందుబాటులోకి రానుంది. ఈ బైక్‌లో 125 సీసీ ఇంజన్ ఉంటుంది, ఇది 11.4 BHP పవర్, 10.5 Nm టాప్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. సెల్ఫ్, కిక్ స్టార్ట్ రెండింటి సౌకర్యం కలిగిన ఈ బైక్‌లో వెట్ మల్టీ-ప్లేట్ క్లచ్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ కూలింగ్ సిస్టమ్ అందుబాటులో ఉన్నాయి.
బజాజ్ చేతక్ C3503
ఎలక్ట్రిక్ స్కూటర్ లవర్స్ కోసం బజాజ్ కంపెనీకి చెందిన చేతక్ C3503 ఈ-స్కూటర్ ఆకర్షణీయమైన ధరకే లభించనుంది. ఇందులో పవర్ ఫుల్ PMSM స్వింగ్‌ఆర్మ్ మోటార్ ఇచ్చారు. ఇది 186 Nm భారీ టార్క్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల టాప్ స్పీడుతో ప్రయాణించగలదు. అంతేకాకుండా ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 151 కిలోమీటర్ల సుదీర్ఘ రేంజ్ ఇస్తుంది. ప్రయాణం సౌకర్యవంతంగా ఉండటానికి ఇందులో సింగిల్ సైడెడ్, మోనోషాక్ సస్పెన్షన్ వ్యవస్థను ఇచ్చారు.
హీరో స్ప్లెండర్ ప్లస్
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే మైలేజ్ బైక్ హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 71,287 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉంటుంది. స్ప్లెండర్ ప్లస్‌లో 97.2 సీసీ ఫోర్-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 5.9 kW పవర్, 8.05 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో కూడిన ఈ బైక్‌లో సెల్ఫ్, కిక్ స్టార్ట్ రెండూ అందుబాటులో ఉంటాయి.
టీవీఎస్ స్పోర్ట్
తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజ్ ఇచ్చే టీవీఎస్ స్పోర్ట్ బైక్ ఈ సేల్‌లో రూ. 48,000 వంటి అతి తక్కువ ప్రారంభ ధరకే లభిస్తోంది. ఇందులో 109.7 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంది, ఇది 8.18 bhp పవర్, 8.7 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది. ఇందులో మెరుగైన బ్రేకింగ్ కోసం డిస్క్ బ్రేక్ ఆప్షన్ కూడా లభిస్తోంది.
టీవీఎస్ ఐక్యూబ్
ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఎంతో ప్రాచుర్యం పొందిన టీవీఎస్ ఐక్యూబ్ సేల్‌లో రూ. 1,04,322 ప్రారంభ ధరతో కస్టమర్లకు లభించనుంది. ఈ ఇ-స్కూటర్‌లో 4.4 kW పీక్ పవర్, 140 Nm టార్క్‌ను అందించే BLDC హబ్ మౌంటెడ్ ట్రాక్షన్ మోటార్ ఉంటుంది. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌పై 94 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 75 కిలోమీటర్లు. ఈ స్కూటర్‌ను పూర్తి ఛార్జ్ చేయడానికి కేవలం 2.75 గంటల సమయం మాత్రమే పడుతుంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains