వన్‌ప్లస్ ఏస్ సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ ఏస్ 7 పేరుతో ఈ కొత్త మొబైల్ రాబోతోంది. అధికారికంగా లాంచ్ కాకముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కీలక ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.
Photo Credit: OnePlus
हाल ही में OnePlus Ace 6 Ultra को पेश किया गया है
OnePlus Ace 7 : ప్రముఖ గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ మార్కెట్లోకి మరో పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను తీసుకురావడానికి చకచకా ఏర్పాట్లు చేస్తోంది. వన్‌ప్లస్ ఏస్ సిరీస్‌లో భాగంగా వన్‌ప్లస్ ఏస్ 7 పేరుతో ఈ కొత్త మొబైల్ రాబోతోంది. అధికారికంగా లాంచ్ కాకముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కీలక ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. గేమింగ్ ప్రియులను, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కోరుకునే యూజర్లను టార్గెట్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ ఫీచర్లతో ఈ ఫోన్‌ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ వీబోలో ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. వన్‌ప్లస్ సంస్థ ప్రస్తుతం అత్యంత శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 6 చిప్‌సెట్‌తో ఒక హై-పర్ఫార్మెన్స్ డివైజ్‌ను టెస్టింగ్ చేస్తోందని, అది వన్‌ప్లస్ ఏస్ 7 మోడలే అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనివల్ల ఈ ఫోన్ మల్టీటాస్కింగ్, హెవీ గేమింగ్స్ సమయంలో ల్యాగ్ లేకుండా సూపర్ స్మూత్‌గా పనిచేస్తుంది.
ఊహకందని 10,000 mAh మెగా బ్యాటరీ
ఈ స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద హైలైట్ ఏంటంటే.. ఇందులో ఏకంగా 10,000 mAh భారీ బ్యాటరీని అమర్చబోతున్నట్లు తాజా లీక్స్ చెబుతున్నాయి. మొదట్లో ఈ ఫోన్ 9,000 mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని అందరూ భావించారు. కానీ కస్టమర్లకు అంతకంటే పెద్ద సర్ప్రైజ్ ఇస్తూ బ్యాటరీ సామర్థ్యాన్ని మరింత పెంచినట్లు తెలుస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజులతో పనిలేకుండా హ్యాపీగా వాడుకోవచ్చు.
గేమర్ల కోసం 185Hz రిఫ్రెష్ రేట్, కూలింగ్ ఫ్యాన్
గేమింగ్ ఆడేటప్పుడు డిస్‌ప్లే ఎక్స్‌పీరియన్స్ అద్భుతంగా ఉండేలా వన్‌ప్లస్ ఏస్ 7 లో 1.5K ఫ్లాట్ ప్యానెల్ స్క్రీన్‌ను ఇస్తున్నారు. ఇది ఏకంగా 185Hz అల్ట్రా-హై రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల విజువల్స్ చాలా స్పీడ్‌గా, క్లియర్‌గా ఉంటాయి. అంతేకాకుండా హెవీ గేమ్స్ ఆడేటప్పుడు మొబైల్ అస్సలు వేడెక్కకుండా ఉండేందుకు దీని లోపల ఒక యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌ను కూడా అమర్చి టెస్టింగ్ చేస్తున్నట్లు లీక్స్ ద్వారా స్పష్టమైంది.
Xiaomi Pad 8 : టాబ్లెట్ కొనాలనుకునే వారికి షాక్.. గుట్టుచప్పుడు కాకుండా ధరలు పెంచేసిన షావోమి
కెమెరా సెటప్, లాంచ్ వివరాలు
కెమెరా విషయానికి వస్తే.. వన్‌ప్లస్ ఏస్ 7 వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండబోతోంది. అందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉండనున్నాయి. అలాగే సెల్ఫీల కోసం ముందు వైపు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. ఈ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ తన రాబోయే వన్‌ప్లస్ 16 సిరీస్‌తో పాటు చైనా మార్కెట్లో చాలా త్వరగా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై వన్‌ప్లస్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
రీసెంట్‌గా వచ్చిన వన్‌ప్లస్ ఏస్ 6 ఆల్ట్రా రికార్డులు
ఇదిలా ఉంటే, వన్‌ప్లస్ సంస్థ ఇటీవల చైనాలో వన్‌ప్లస్ ఏస్ 6 ఆల్ట్రాను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. డ్యూయల్ సిమ్ కలిగిన ఈ ఫోన్ 6.78 ఇంచుల ఫుల్ HD+ అమోలెడ్ స్క్రీన్, 165Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వచ్చింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రొసెసర్‌ను ఉపయోగించారు. ఇది ఆండ్రాయిడ్ 16 బేస్డ్ కలర్ ఓఎస్ 16 పై రన్ అవుతుంది. ఈ ఫోన్ వెనుక 50MP + 8MP కెమెరాలు, ముందు 16MP కెమెరా ఉన్నాయి. అలాగే దీనిలోని 8,600 mAh బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెక్యూరిటీ కోసం ఇందులో ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసానిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. ఇప్పుడు రాబోయే ఏస్ 7 దీనికంటే డబుల్ పవర్‌తో రాబోతుండటంతో అంచనాలు భారీగా పెరిగాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
GTA 6 Is Getting an Official Soundtrack Album With 34 Original Tracks; Physical Version Pre-Orders Now Live
Ai+ Pulse 2 FE India Launch Teased; Colour Options, Flipkart Availability Confirmed