వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్ 2026 పేరుతో దేశవ్యాప్తంగా ఈ సేల్ ఘనంగా ప్రారంభమైంది.
OnePlus 15's launch price in India was set at Rs. 72,999 for the base variant
OnePlus Community Sale 2026: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల బ్రాండ్ వన్ ప్లస్ భారతీయ కస్టమర్ల కోసం సరికొత్త సేల్‌ను అనౌన్స్ చేసింది. వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్ 2026 పేరుతో దేశవ్యాప్తంగా ఈ సేల్ ఘనంగా ప్రారంభమైంది. పరిమిత కాలం పాటు అందుబాటులో ఉండే ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా వన్ ప్లస్ కంపెనీ తన వైడ్ రేంజ్ ప్రొడక్ట్స్‌పై భారీ తగ్గింపులు, అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లు, సులభమైన నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తోంది. ఈ ఆఫర్లు ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ లైవ్ అయ్యాయి.
ఫ్లాగ్‌షిప్ వన్ ప్లస్ 15 సిరీస్‌పై డిస్కౌంట్లు
ఈ కమ్యూనిటీ సేల్‌లో అందరి కళ్లు వన్ ప్లస్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లపైనే ఉన్నాయి. కంపెనీ తన మోస్ట్ పవర్‌ఫుల్ మొబైల్ వన్ ప్లస్ 15 పై రూ. 3,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌ను ప్రకటించింది. దీనివల్ల రూ. 77,999 ఉన్న ఈ ఫోన్ ఎఫెక్టివ్ ధర రూ. 74,999 కి తగ్గిపోయింది. ఇదే తరహాలో వన్ ప్లస్ 15R మోడల్‌పై కూడా బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది. దీంతో ఈ ఫోన్‌ను కస్టమర్లు కేవలం రూ. 51,999 లకే సొంతం చేసుకోవచ్చు.
వన్ ప్లస్ 13 పై ఏకంగా 17 వేల లాభం
ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వారికి వన్ ప్లస్ 13 ఒక సూపర్ ఆప్షన్ కానుంది. అసలు ధర రూ. 69,999 ఉన్న ఈ ఫోన్‌పై కంపెనీ తాత్కాలికంగా రూ. 12,000 ధరను తగ్గించింది. దీనికి అదనంగా రూ. 5,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా తోడైంది. అంటే మొత్తంగా రూ. 17,000 తగ్గి.. కేవలం రూ. 52,999 లకే ఈ ఫోన్ లభిస్తోంది. అలాగే కాంపాక్ట్ డిజైన్‌తో వచ్చే వన్ ప్లస్ 13s మోడల్‌పై రూ. 2,000 ప్రైస్ కట్, రూ. 3,000 బ్యాంక్ ఆఫర్ కలిపి రూ. 49,999 కే అందుబాటులో ఉంది.
మిడిల్ క్లాస్ ఫేవరెట్ నార్డ్ సిరీస్ ఆఫర్లు
మధ్యతరగతి యువతను ఎంతగానో ఆకట్టుకునే వన్ ప్లస్ నార్డ్ సిరీస్‌పై కూడా కంపెనీ ఆఫర్లను వర్తింపజేసింది. లేటెస్ట్ వన్ ప్లస్ నార్డ్ 6 ఫోన్ రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత రూ. 40,999 కి లభిస్తోంది. ఇక వన్ ప్లస్ నార్డ్ CE6 మోడల్‌ను రూ. 2,000 బ్యాంక్ ఆఫర్‌తో రూ. 29,999 కి కొనవచ్చు. అలాగే బడ్జెట్ రేంజ్ లో వచ్చే నార్డ్ CE6 లైట్ పై రూ. 1,500 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తోంది, దీనివల్ల దీని ధర కేవలం రూ. 21,499 గా మారింది. వీటితో పాటు క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.
OnePlus 11 5G : ఫ్లిప్‌కార్ట్‌లో క్రేజీ ఆఫర్.. సగం ధరకే లగ్జరీ వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్!
ట్యాబ్లెట్లు కొంటే ప్రీమియం గిఫ్ట్ ఉచితం
స్మార్ట్‌ఫోన్లతో పాటు వన్ ప్లస్ ట్యాబ్లెట్లపై కూడా క్రేజీ ఆఫర్లు ఉన్నాయి. వన్ ప్లస్ ప్యాడ్ 4 మోడల్‌పై రూ. 3,000 బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుండటంతో దీని ఎఫెక్టివ్ ధర రూ. 56,999 గా ఉంది. వన్ ప్లస్ ప్యాడ్ గో 2 కారు చౌకగా రూ. 26,999 కి మరియు ప్యాడ్ లైట్ డిస్కౌంట్ల తర్వాత రూ. 16,999 కి లభిస్తున్నాయి. ఇక్కడే వన్ ప్లస్ ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది. పరిమిత కాలం పాటు వన్ ప్లస్ ప్యాడ్ 4 కొనేవారికి రూ. వేల విలువైన స్టైలో ప్రో పెన్, అలాగే ప్యాడ్ గో 2 కొనేవారికి స్టైలో గో 2 పెన్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది.
ఆడియో ప్రొడక్ట్స్, సేల్ చివరి తేదీ
మ్యూజిక్ లవర్స్ కోసం వన్ ప్లస్ బడ్స్ 4 ప్రత్యేకంగా రూ. 6,099 కి అందుబాటులో ఉండగా.. ప్రీమియం వన్ ప్లస్ బడ్స్ ప్రో 3ని రూ. 11,999 కి కొనుగోలు చేయవచ్చు. వీటితో పాటు నార్డ్ బడ్స్ 3, నార్డ్ బడ్స్ 3 ప్రో, నార్డ్ బడ్స్ 4 ప్రో, బులెట్స్ వైర్‌లెస్ Z2 ANC, బులెట్స్ వైర్‌లెస్ Z3 మోడళ్లపై కూడా మంచి డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ ఆఫర్లన్నీ వన్ ప్లస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మైంత్రా, బ్లింకిట్, ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్ జూన్ 10 వరకు కొనసాగుతుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Google Play Store ‘Shop Devices’ Feature Goes Live in India With Pixel Phones and Accessories