Oneplus dual bluetooth audio: ఈ ఫీచర్ ద్వారా మీ ఫోన్ లో ప్లే అవుతున్న సాంగ్స్ లేదా వీడియో ఆడియోను మీ ఇయర్‌బడ్స్‌తో పాటు మీ పక్కన ఉన్న మీ స్నేహితుడి ఇయర్‌బడ్స్‌కు కూడా ఒకేసారి కనెక్ట్ చేయవచ్చు.
Oneplus dual bluetooth audio: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ తమ వినియోగదారుల కోసం ఒక సరికొత్త మార్కెట్ ట్రెండింగ్ ఫీచర్‌ను రోలవుట్ చేయడం ప్రారంభించింది. ఇప్పటివరకు ఆపిల్, శామ్‌సంగ్ లాంటి గ్లోబల్ దిగ్గజ కంపెనీల ప్రీమియం ఫోన్లకే పరిమితమైన డ్యూయల్ బ్లూటూత్ ఆడియో షేరింగ్ ఫీచర్‌ను వన్‌ప్లస్ ఇప్పుడు తన స్మార్ట్‌ఫోన్లలోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త అప్‌డేట్ సహాయంతో వినియోగదారులు తమ మొబైల్ ఆడియోను ఒకే సమయంలో రెండు వేర్వేరు బ్లూటూత్ డివైజ్‌లతో చాలా ఈజీగా షేర్ చేసుకోవచ్చు.
ఒకేసారి ఇద్దరు కలిసి వినే అద్భుత అవకాశం..
ఈ ఫీచర్ ద్వారా మీ ఫోన్ లో ప్లే అవుతున్న సాంగ్స్ లేదా వీడియో ఆడియోను మీ ఇయర్‌బడ్స్‌తో పాటు మీ పక్కన ఉన్న మీ స్నేహితుడి ఇయర్‌బడ్స్‌కు కూడా ఒకేసారి కనెక్ట్ చేయవచ్చు. ఉదాహరణకు మీరు జర్నీలో ఉన్నప్పుడు ఏదైనా మంచి సినిమా చూస్తున్నా లేదా సాంగ్స్ వింటున్నా.. గతంలో లాగా ఇయర్‌బడ్‌ని చెరో ఒకటి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్ తన దగ్గర ఉన్న బ్లూటూత్ ఇయర్‌బడ్స్ లేదా హెడ్‌ఫోన్స్‌ని మీ ఫోన్ కి కనెక్ట్ చేసుకుని, ఇద్దరూ పూర్తి ఆడియోను ఎవరి డివైజ్‌లో వాళ్లు స్పష్టంగా ఆస్వాదించవచ్చు.
ఈ వన్‌ప్లస్ మోడల్స్ లోనే ప్రస్తుతానికి ఛాన్స్..
కంపెనీ అధికారిక కమ్యూనిటీ పోస్ట్ ప్రకారం.. సరికొత్త ఆక్సిజన్ ఓఎస్ అప్‌డేట్ వర్షన్ 16.0.8.300/301 ద్వారా ఈ సరికొత్త ఫీచర్‌ను అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ అప్‌డేట్ కేవలం కొన్ని లేటెస్ట్ ప్రీమియం వన్‌ప్లస్ ఫోన్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ లిస్ట్‌లో వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 15ఆర్, వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఎస్ మోడల్స్ ఉన్నాయి. భారత్‌తో పాటు యూరప్, అమెరికా మార్కెట్లలో ఈ ఫీచర్ ప్రస్తుతం రోలవుట్ అవుతోంది.
Jio : జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇకపై ఫోన్ మాట్లాడుతూనే ఫుడ్ ఆర్డర్, క్యాబ్ బుక్ చేసుకోవచ్చు
ఇతర బ్రాండ్ల ఇయర్‌బడ్స్ కూడా సపోర్ట్..
ఆపిల్ కంపెనీ తన ఆడియో షేరింగ్ ఫీచర్‌ను కేవలం ఆపిల్ ఎకోసిస్టమ్ (ఎయిర్‌పాడ్స్)కు మాత్రమే పరిమితం చేయగా.. వన్‌ప్లస్ మాత్రం అందరికీ ఉపయోగపడేలా ఓపెన్ నిర్ణయం తీసుకుంది. ఈ డ్యూయల్ ఆడియో షేరింగ్ ఫీచర్ కేవలం వన్‌ప్లస్ బ్రాండ్ ఇయర్‌బడ్స్ కే కాకుండా, ఇతర ఏ కంపెనీకి చెందిన బ్లూటూత్ ఇయర్‌బడ్స్ లేదా వైర్‌లెస్ స్పీకర్లకైనా సరే పర్ఫెక్ట్‌గా సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల యూజర్లకు చాలా పెద్ద ఊరట లభించిందని చెప్పవచ్చు.
డ్యూయల్ ఆడియో ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి..?
ఈ సరికొత్త ఫీచర్‌ను యాక్టివేట్ చేయడం చాలా సులభం. మొదటగా మీరు కనెక్ట్ చేయాలనుకుంటున్న రెండు వేర్వేరు బ్లూటూత్ ఇయర్‌బడ్స్ లేదా స్పీకర్లను మీ వన్‌ప్లస్ ఫోన్‌కు బ్లూటూత్ ద్వారా పెయిర్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ లో ఏదైనా మ్యూజిక్ లేదా వీడియో ప్లే చేసి, నోటిఫికేషన్ ప్యానెల్‌లోని మీడియా ప్లేయర్ లో కనిపించే ఇయర్‌బడ్స్ ఐకాన్ పై టాప్ చేయాలి. అక్కడ మీకు కనెక్ట్ అయి ఉన్న రెండు డివైజ్‌ల పేర్లు కనిపిస్తాయి. అందులో రెండో డివైజ్‌ను కూడా సెలెక్ట్ చేసుకుంటే చాలు.. ఆడియో రెండు డివైజ్‌లలో ఒకేసారి స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడ మరో క్రేజీ ఫీచర్ ఏంటంటే.. ఇద్దరు యూజర్లు తమకు నచ్చినట్లుగా వాల్యూమ్‌ను విడివిడిగా కంట్రోల్ చేసుకోవచ్చు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains