OnePlus N6x : రెండు రోజులు ఛార్జింగ్ టెన్షన్ లేదు.. 7000mAh బ్యాటరీతో వస్తున్న OnePlus N6x

భారత మార్కెట్‌లో ఒన్‌ప్లస్ N6x స్మార్ట్‌ఫోన్ జూలై 31, 2026 న అధికారికంగా లాంచ్ కానుంది.

OnePlus N6x  : రెండు రోజులు ఛార్జింగ్ టెన్షన్ లేదు.. 7000mAh బ్యాటరీతో వస్తున్న OnePlus N6x

OnePlus N6x

ముఖ్యాంశాలు
  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. OnePlus N6x బ్యాటరీ చూసి షాక్ అవుతారు
  • బడ్జెట్‌లోనే బీస్ట్ ఫోన్.. OnePlus N6x స్పెసిఫికేషన్లు వైరల్
  • 120Hz డిస్‌ప్లే, AI పోర్ట్రెయిట్ గ్లో.. OnePlus N6xలో అన్నీ ఉన్నాయి
ప్రకటన

OnePlus N6x  : ప్రముఖ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒన్‌ప్లస్ భారత మార్కెట్‌లో తన సరికొత్త మోడల్ ఒన్‌ప్లస్ N6xను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ధరలో రానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఇటీవల ఈ సిరీస్‌లో ఒన్‌ప్లస్ N6ను కంపెనీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాబోతున్న ఒన్‌ప్లస్ N6x కోసం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‎లో ప్రత్యేక మైక్రోసైట్ కూడా అందుబాటులోకి వచ్చింది.

లాంచ్ డేట్ అండ్ సేల్ వివరాలు
భారత మార్కెట్‌లో ఒన్‌ప్లస్ N6x స్మార్ట్‌ఫోన్ జూలై 31, 2026 న అధికారికంగా లాంచ్ కానుంది. లాంచ్ అయిన కొద్ది రోజులకే అంటే ఆగస్టు 4 నుంచి వినియోగదారులకు విక్రయానికి అందుబాటులోకి రానుంది. డిజైన్ పరంగా ఈ ఫోన్ చూడటానికి ఒన్‌ప్లస్ నార్డ్ CE 6 మోడల్‌ను పోలి ఉంటుంది. ఇందులో స్మూత్ ఎక్స్‌పీరియన్స్ అందించే 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఫ్లాట్ డిస్‌ప్లేను అందించారు. అంతేకాకుండా ఫోటోగ్రఫీని మరింత కలర్‌ఫుల్‌గా మార్చేందుకు AI పోర్ట్రెయిట్ గ్లో, AI అన్‌బ్లర్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లను జోడించారు.

7,000mAh రాక్షస బ్యాటరీ.. మైండ్ బ్లాంక్ బ్యాకప్
ఒన్‌ప్లస్ N6x స్మార్ట్‌ఫోన్‌లో అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని బ్యాటరీ కెపాసిటీ. ఇందులో ఏకంగా 7,000 mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ బ్యాటరీ ఏకంగా 2.5 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. అంతేకాకుండా సింగిల్ ఛార్జ్‌పై 20 గంటలకు పైగా వీడియో ప్లేబ్యాక్, 133 గంటలకు పైగా మ్యూజిక్, 25 గంటలకు పైగా సోషల్ మీడియా స్క్రోలింగ్ లేదా 11 గంటల పాటు నాన్‌స్టాప్ వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చని తెలిపారు. హెవీగా ఫోన్ వాడే వారికి ఇది సరైన ఛాయిస్‌గా నిలవనుంది.

PM Modi : మోదీ సెల్ఫీ వీడియోల మ్యాజిక్.. ఇన్స్టాగ్రామ్‌లో 105 మిలియన్ల రికార్డు ఫాలోవర్స్

లుక్స్, కలర్స్, ప్రీవియస్ మోడల్ వివరాలు
ఈ ఫోన్ ఐస్ బ్లూ, బర్గుండి రెడ్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభించనుంది. ఫోన్ వెనుక భాగంలో పిల్-షేప్ డ్యూయల్ రియర్ కెమెరా మోడ్యూల్ విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, టెక్స్చర్డ్ ఫ్లాట్ ప్యానెల్, సెంటర్‌లో ఒన్‌ప్లస్ బ్రాండింగ్ ఇచ్చారు. ఇటీవల భారత మార్కెట్‌లో లాంచ్ అయిన ఒన్‌ప్లస్ N6 మోడల్ 4GB+128GB వేరియంట్ ధర రూ. 22,999 గాను, 6GB+128GB వేరియంట్ ధర రూ. 24,999 గాను ఉంది. అందులో 6.75 ఇంచుల HD+ LCD డిస్‌ప్లే, 50MP కెమెరా, OxygenOS 16 ఉన్నాయి. రాబోయే N6x మోడల్ కూడా దాదాపు ఇదే బడ్జెట్ శ్రేణిలో భారీ బ్యాటరీతో రానుంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Apple : యాపిల్ మైండ్ బ్లాకింగ్ ప్లాన్.. త్వరలోనే మార్కెట్‌లోకి ఫస్ట్ టచ్‌స్క్రీన్ ఓఎల్‌ఈడీ మ్యాక్‌బుక్ ప్రో
  2. Vivo T5x 5G vs OnePlus Nord CE6 Lite vs Poco M8 5G : ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ ఆప్షన్?
  3. Fast Charging : మీ ఫోన్ స్లోగా ఛార్జ్ అవుతోందా?.. ఫాస్ట్‎గా ఛార్జింగ్ అవ్వడానికి ఈ ట్రిక్స్ పాటించండి
  4. Redmi K100 Series : 185Hz డిస్‌ప్లే, 9000mAh బ్యాటరీ.. త్వరలోనే రెడ్‌మి K100 సిరీస్ రాక
  5. OnePlus N6x : రెండు రోజులు ఛార్జింగ్ టెన్షన్ లేదు.. 7000mAh బ్యాటరీతో వస్తున్న OnePlus N6x
  6. PM Modi : మోదీ సెల్ఫీ వీడియోల మ్యాజిక్.. ఇన్స్టాగ్రామ్‌లో 105 మిలియన్ల రికార్డు ఫాలోవర్స్
  7. Cyber Security : డిజిటల్ డేటాకు బిగ్ థ్రెట్.. క్వాంటమ్ కంప్యూటర్లతో డిజిటల్ ప్రపంచానికి ముప్పు నిజమేనా?
  8. Redmi Note 17 : త్వరలోనే మార్కెట్‌లోకి రెడ్‌మీ నోట్ 17 సిరీస్.. గ్లోబల్ లీక్స్ ద్వారా మోడళ్లు, ధరలు లీక్
  9. boAt Sailor Nav : పిల్లలు ఎక్కడున్నా పేరెంట్స్ కనిపెట్టేస్తారు.. బోట్ తెచ్చిన కిలాడీ స్మార్ట్‌వాచ్
  10. Viral Hack : వ్యాలెట్‌కి అల్యూమినియం పేపర్ చుడితే రూపాయి కూడా పోదు.. వైరల్ అవుతున్న విచిత్రమైన ట్రిక్
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »