ప్రధాని మోదీ తన జీవితంలోనే మొదటి ఇన్స్టాగ్రామ్ సెల్ఫీ వీడియోను జూలై 23, 2026 రాత్రి 11:52 గంటలకు పోస్ట్ చేశారు.
Photo Credit: Instagram/narendramodi
PM Modi
PMModi : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఊహించని రీతిలో ఫాలోవర్ల సంఖ్య పెరిగిపోతోంది. నీట్ పేపర్ లీక్ ఆందోళనలు, వివాదాలపై స్పందిస్తూ ఆయన షేర్ చేసిన వరుస సెల్ఫీ వీడియోలు నెట్టింట విపరీతంగా వైరల్ కావడమే దీనికి కారణం. మొదటి సెల్ఫీ వీడియో అప్లోడ్ చేయడానికి ముందు ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 101 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. వరుసగా మూడు సెల్ఫీ వీడియోలు షేర్ చేసిన కేవలం నాలుగు రోజుల్లోనే మరో 40 లక్షల మంది కొత్త ఫాలోవర్లు వచ్చి చేరారు. దీంతో ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 105 మిలియన్ల మార్కును దాటేసింది.
మొదటి సెల్ఫీ వీడియోకి కోట్లలో వ్యూస్
ప్రధాని మోదీ తన జీవితంలోనే మొదటి ఇన్స్టాగ్రామ్ సెల్ఫీ వీడియోను జూలై 23, 2026 రాత్రి 11:52 గంటలకు పోస్ట్ చేశారు. నీట్ పరీక్షల అంశంపై స్పందిస్తూ ఆయన చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ వీడియోకు ఇప్పటివరకు ఏకంగా 396 మిలియన్ల (39.6 కోట్లు) వ్యూస్ వచ్చాయి. ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అత్యంత వేగంగా వ్యూస్ సాధించిన వీడియోగా ఇది నిలిచింది. ఈ ఒక్క వీడియో షేర్ చేసిన కొద్ది సమయంలోనే దాదాపు 14 లక్షల మంది నూతన ఫాలోవర్లు ఆయన ఖాతాకు తోడయ్యారు.
కృతజ్ఞతలు తెలుపుతూ రెండో సెల్ఫీ వీడియో
తొలి వీడియోకు నెటిజన్ల నుంచి లభించిన అద్భుతమైన స్పందనపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేస్తూ మరో సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు. ఎలాంటి ప్రభుత్వ పాలసీలు లేదా పథకాల గురించి మాట్లాడకుండా.. కేవలం ప్రజలు చూపించిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ రెండో వీడియో కూడా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి కూడా ఇప్పటివరకు 273 మిలియన్ల (27.3 కోట్లు) వ్యూస్ రావడం విశేషం.
Cyber Security : డిజిటల్ డేటాకు బిగ్ థ్రెట్.. క్వాంటమ్ కంప్యూటర్లతో డిజిటల్ ప్రపంచానికి ముప్పు నిజమేనా?
టాస్క్ ఫోర్స్ ప్రకటనతో మూడో వీడియో
వరుస వీడియోల సిరీస్‌లో భాగంగా ప్రధాని మోదీ మూడో సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు, సంస్కరణల కోసం ఒక హై-పవర్డ్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ వీడియోలో ప్రధాని అధికారికంగా ప్రకటించారు. పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మూడో వీడియోకు కూడా 167 మిలియన్ల వ్యూస్ లభించాయి. ఇలా వరుసగా వచ్చిన ఈ మూడు సెల్ఫీ వీడియోలు ప్రధాని ప్రజాదరణను ఇన్‌స్టాగ్రామ్‌లో కొండంతగా పెంచేశాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Grand Theft Auto 6 Will Reportedly Take Up 210GB of SSD Storage on Consoles