Smartphone Comparison : భారత మార్కెట్‌లోకి కొత్త వన్‌ప్లస్ N6x లాంచ్.. ఐకూ, రియల్‌మీ ఫోన్లకు గట్టి పోటీ

వన్‌ప్లస్ N6x బేసిక్ 4GB+64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999 కాగా, 4GB+128GB వేరియంట్ ధర రూ. 20,999 గా ఉంది.

Smartphone Comparison : భారత మార్కెట్‌లోకి కొత్త వన్‌ప్లస్ N6x లాంచ్.. ఐకూ, రియల్‌మీ ఫోన్లకు గట్టి పోటీ

Photo Credit: OnePlus/iQOO/Realme

OnePlus N6x vs iQOO Z11 Lite vs Realme Narzo 100x 5G

ముఖ్యాంశాలు
  • మార్కెట్‌లోకి వన్‌ప్లస్ కొత్త అవతారం
  • ఐకూ, రియల్‌మీలకు చెమటలు పట్టిస్తున్న ఫీచర్లు
  • 7000mAh భారీ బ్యాటరీతో వన్‌ప్లస్ కొత్త మొబైల్ ధమాకా
ప్రకటన

Smartphone Comparison : పాపులర్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ భారతదేశంలో తన సరికొత్త స్మార్ట్‌ఫోన్  వన్‌ప్లస్ N6xను అధికారికంగా లాంచ్ చేసింది. బడ్జెట్, మిడ్-రేంజ్ విభాగంలో వచ్చిన ఈ ఫోన్ మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న iQOO Z11 లైట్, రియల్‌మీ నార్జో 100x 5G మోడళ్లకు గట్టి పోటీనిస్తోంది. ఈ మూడు ఫోన్లు కూడా అత్యాధునిక ఫీచర్లు, పవర్‌ఫుల్ బ్యాటరీలతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి పోటీపడుతున్నాయి.

ధరలు, స్టోరేజ్ వేరియంట్లు 
కొత్తగా వచ్చిన వన్‌ప్లస్ N6x బేసిక్ 4GB+64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999 కాగా, 4GB+128GB వేరియంట్ ధర రూ. 20,999 గా ఉంది. ఇక ఐకూ Z11 లైట్ విషయానికి వస్తే 4GB+128GB వేరియంట్ రూ. 19,499, 6GB+128GB వేరియంట్ రూ. 21,499, 6GB+256GB వేరియంట్ రూ. 24,499కి లభిస్తున్నాయి. పోటీగా ఉన్న రియల్‌మీ నార్జో 100x 5G మోడల్ 4GB+128GB వేరియంట్ రూ. 19,499, 6GB+128GB వేరియంట్ రూ. 21,499, 6GB+256GB వేరియంట్ రూ. 23,499 ధరకు అందుబాటులో ఉన్నాయి.

డిస్‌ప్లే అండ్ రిజల్యూషన్ అనుభవం 
వన్‌ప్లస్ N6x లో 6.8-ఇంచుల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 720x1570 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఐకూ Z11 లైట్ లో 6.74-ఇంచుల HD+ LCD డిస్‌ప్లే, 1600×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. అయితే రియల్‌మీ నార్జో 100x 5G డిస్‌ప్లే విషయంలో ఒక అడుగు ముందుకేసి 6.6-ఇంచుల HD+ LCD స్క్రీన్‌తో పాటు ఏకంగా 144Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తోంది.

ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్ 
స్మూత్ పెర్ఫార్మన్స్ కోసం వన్‌ప్లస్ N6x లో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 ఎపెక్స్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఐకూ Z11 లైట్ లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 (6nm) ప్రాసెసర్ ఉండగా, రియల్‌మీ నార్జో 100x 5G లో కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G ప్రాసెసర్‌ను అందించారు. ఇక సాఫ్ట్‌వేర్ పరంగా వన్‌ప్లస్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16 పై పనిచేస్తుంది. ఐకూ ఫోన్ ఆరిజిన్ ఓఎస్ 6 పై, రియల్‌మీ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యుఐ 7.0తో పనిచేస్తాయి.

Vivo X500 Pro : ప్రీమియమ్ లుక్, 144Hz డిస్‌ప్లే.. మైండ్ బ్లాక్ చేసే డిజైన్, ఫీచర్లతో వివో X500 ప్రో లీక్స్

కెమెరా సెటప్ అండ్ సెల్ఫీలు 
కెమెరాల విషయానికి వస్తే, వన్‌ప్లస్ N6x రేర్ సైడ్ 10x డిజిటల్ జూమ్‌తో కూడిన 13MP ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ సైడ్ 5MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఐకూ Z11 లైట్ వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరా + 0.08MP సెకండరీ కెమెరా, ముందు వైపు 5MP కెమెరాతో వస్తుంది. అయితే రియల్‌మీ నార్జో 100x 5G లో మెరుగైన కెమెరా సెటప్ ఉంది. దీని వెనుక 50MP ప్రైమరీ కెమెరా,  సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు.

భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ 
ఈ విభాగంలో మూడు ఫోన్లు భారీ బ్యాటరీలతో పోటీపడుతున్నాయి. వన్‌ప్లస్ N6x లో 7,000mAh భారీ బ్యాటరీ ఉంది, ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్,  5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఐకూ Z11 లైట్ లో 6,500mAh బ్యాటరీతో పాటు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఇచ్చారు. అందరికంటే ఎక్కువగా రియల్‌మీ నార్జో 100x 5G లో ఏకంగా 8,000mAh అతిపెద్ద బ్యాటరీ,  45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుండటం విశేషం.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »