ఈ కొత్త మోడల్ గతేడాది అక్టోబర్‌లో మార్కెట్‌లోకి వచ్చిన వివో X300 ప్రోకి తరువాతి వెర్షన్‌గా రాబోతోంది.
Vivo X300 Pro
Vivo X500 Pro : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన పాపులర్ ఎక్స్-సిరీస్‌లో మరో సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. వివో X500 ప్రో పేరుతో రాబోతున్న ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక వివరాలు ఆన్‌లైన్ వేదికగా లీక్ అయ్యాయి. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వైబోలో ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ ఫోన్ డిజైన్, డిస్‌ప్లే, ప్రాసెసర్‌కు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు. ఈ కొత్త మోడల్ గతేడాది అక్టోబర్‌లో మార్కెట్‌లోకి వచ్చిన వివో X300 ప్రోకి తరువాతి వెర్షన్‌గా రాబోతోంది.
అత్యాధునిక ప్రాసెసర్, డిస్‌ప్లే టెక్నాలజీ
లీకైన నివేదికల ప్రకారం.. వివో X500 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రో చిప్‌సెట్‌ను అందించనున్నారు. ఇక డిస్‌ప్లే విషయానికొస్తే, ఇందులో 6.37-ఇంచుల ఫ్లాట్ LTPO డిస్‌ప్లే ఉండనుంది. ఇది 1.5K రిజల్యూషన్, ఏకంగా 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఇంజనీరింగ్ శాంపిల్స్‌ను BOE తయారీ OLED ప్యానెల్‌తో ప్రస్తుతం టెస్టింగ్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా LIPO డిస్‌ప్లే ప్యాకేజింగ్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల స్క్రీన్ నాలుగు వైపులా చాలా నారో బెజెల్స్ లభిస్తాయి.
స్లీక్ మెటల్ ఫ్రేమ్, ఐకానిక్ కెమెరా మోడ్యూల్
డిజైన్ పరంగా ఈ కొత్త ఫోన్ చాలా ప్రీమియమ్‌గా రూపుదిద్దుకోనుంది. ఇందులో సాలిడ్ మెటల్ ఫ్రేమ్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. వెనుక భాగంలో సెంటర్‌లో అమర్చిన సర్క్యులర్ రియర్ కెమెరా మోడ్యూల్ రానుంది. ఇంతకుముందు వచ్చిన వివో ఎక్స్-సిరీస్ మోడళ్లలో ఉన్నటువంటి సిగ్నేచర్ కెమెరా డిజైన్‌నే ఇందులో కూడా కొనసాగిస్తున్నారు. చైనా మార్కెట్లో ఈ ఫోన్‌ను సెప్టెంబర్ నెలలోనే అధికారికంగా పరిచయం చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
Lava Mobiles : లావా నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్ల సేల్స్ షురూ.. రూ. 9 వేలకే అదిరిపోయే ఫీచర్లు
గత మోడల్ వివో X300 ప్రో ఫీచర్లు ఇవే
భారత్‌లో గతేడాది డిసెంబర్‌లో లాంచ్ అయిన వివో X300 ప్రో విశేషాలు చూస్తే.. ఇది 6.78-ఇంచుల 1.5K LTPO OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వచ్చింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 పై ఇది పనిచేస్తుంది.
కెమెరా, బ్యాటరీ, సెక్యూరిటీ
వివో X300 ప్రో కెమెరా విభాగంలో ఓఐఎస్ (OIS) సపోర్ట్‌తో 50MP సోనీ LYT-828 ప్రైమరీ కెమెరా, 3.5x ఆప్టికల్ జూమ్‌తో 200MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరాలను ఇచ్చారు. సెల్ఫీల కోసం ముందు వైపు 50MP కెమెరా ఉంది. ఇందులో 6,510 mAh భారీ బ్యాటరీతో పాటు 90W వైర్డ్, 40W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. సేఫ్టీ కోసం ఆల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఈ మోడల్‌తో పోలిస్తే కొత్త వివో X500 ప్రో డిస్‌ప్లే, ప్రాసెసర్ విభాగాల్లో భారీగా అప్‌గ్రేడ్ కానుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,909
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Nothing Deals Revealed for Phone 4 Series, CMF Buds Lineup, More Ahead of Flipkart's Big Billion Days Sale