వన్‌ప్లస్ N6x స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ సామర్థ్యమే. ఇందులో 7,000 mAh భారీ బ్యాటరీని అందిస్తున్నారు.
Photo Credit: OnePlus
OnePlus N6x
OnePlus N6x : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తమ ఎన్-సిరీస్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ భారత మార్కెట్లో మరో నూతన స్మార్ట్‌ఫోన్ 'వన్‌ప్లస్ N6x'ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సరసమైన ధరల విభాగంలో రానున్న ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 31న అధికారికంగా దేశంలో అడుగుపెట్టనుంది. గత నెలలోనే కంపెనీ వన్‌ప్లస్ N6ను భారతదేశంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాబోయే N6x కోసం ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమేజాన్ ప్రత్యేకంగా ఒక మైక్రోసైట్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది.
7,000 mAh భారీ బ్యాటరీ, పవర్ బ్యాకప్
వన్‌ప్లస్ N6x స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ సామర్థ్యమే. ఇందులో 7,000 mAh భారీ బ్యాటరీని అందిస్తున్నారు. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఈ బ్యాటరీ నిరంతరాయంగా రెండు రోజుల కంటే ఎక్కువ కాలం వస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. వినోదం, వినియోగానికి సంబంధించి ఈ ఫోన్ కింద పేర్కొన్న విధంగా అద్భుతమైన బ్యాకప్‌ను అందిస్తుంది:
* 20 గంటల కంటే ఎక్కువ సమయం నిరంతర వీడియో ప్లేబ్యాక్
* 133 గంటల కంటే ఎక్కువ సేపు మ్యూజిక్ ప్లేబ్యాక్
* 25 గంటల కంటే ఎక్కువ సమయం సోషల్ మీడియా స్క్రోలింగ్
* 11 గంటల కంటే ఎక్కువ సమయం వీడియో రికార్డింగ్
ఆకట్టుకునే డిజైన్, కెమెరా సెటప్
వన్‌ప్లస్ N6x డిజైన్ పరంగా ఐస్ బ్లూ, బర్గండి రెడ్ రంగుల ఎంపికల్లో లభించనుంది. ఫోన్ వెనుక భాగంలో పిల్-షేప్ కెమెరా మాడ్యూల్తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ లైట్ ఉన్నాయి. ఫోన్ బ్యాక్ ప్యానెల్ టెక్స్చర్డ్ ఫ్లాట్ ఫినిషింగ్‌తో వచ్చి, మధ్యలో వన్‌ప్లస్ బ్రాండింగ్ చిహ్నాన్ని కలిగి ఉంటుంది. కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్ బటన్లు ఇచ్చారు. ఈ ఫోన్ ఓవరాల్ లుక్, డిజైన్ వన్‌ప్లస్ నోర్డ్ సీఈ 6 మోడల్‌ను పోలి ఉంటుంది.
వన్‌ప్లస్ N6 గత మోడల్ స్పెసిఫికేషన్లు ఒకచూపులో
గత నెలలో భారత మార్కెట్లో ఆవిష్కృతమైన వన్‌ప్లస్ N6 ధరలను పరిశీలిస్తే, 4 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999గానూ, 6 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999గానూ ఉంది. ఇది ఫ్రెష్ మింట్, మిడ్నైట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. వన్‌ప్లస్ N6 మోడల్ 6.75 అంగుళాల HD+ LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOS 16పై పనిచేసే ఈ ఫోన్లో 50MP ప్రైమరీ కెమెరా (10x డిజిటల్ జూమ్), 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అంతేకాకుండా 8,000 mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ దీని ప్రత్యేకతలు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Free Fire India Launch Date Set for October 28; Confirmed to Feature Parental Controls, Playtime Limits