షియోమీ ఈ కొత్త వైర్‌లెస్ ఫ్లోర్ క్లీనర్ 5సి డివైజ్‌ను ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి తీసుకొచ్చింది.
Photo Credit: Xiaomi
Xiaomi
Xiaomi Mijia Wireless Floor Cleaner 5C : టెక్ దిగ్గజం షియోమీ తమ స్మార్ట్ హోమ్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ చైనా మార్కెట్‌లో కొత్త బడ్జెట్ వ్యాక్యూమ్ క్లీనర్ మిజియా వైర్‌లెస్ ఫ్లోర్ క్లీనర్ 5సిని అధికారికంగా విడుదల చేసింది. పాత మోడళ్లతో పోలిస్తే ఇది ఎన్నో అధునాతన అప్‌గ్రేడెడ్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది.
ధర, లభ్యత
షియోమీ ఈ కొత్త వైర్‌లెస్ ఫ్లోర్ క్లీనర్ 5సి డివైజ్‌ను ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధరను 999 యువాన్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.14,000)గా నిర్ణయించారు. ఈ డివైజ్ షియోమీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండగా, ఆగస్టు 3వ తేదీ నుంచి దీని సేల్స్ ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. అయితే గ్లోబల్ మార్కెట్‌లో, భారతదేశంలో దీని లభ్యతకు సంబంధించి కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు.
1. ఫీచర్లు, పనితీరు
శక్తివంతమైన 18,000Pa సక్షన్ పవర్ మిజియా వైర్‌లెస్ ఫ్లోర్ క్లీనర్ 5సి మోడల్‌లో కంపెనీ 18,000Pa శక్తివంతమైన సక్షన్ పవర్‌ను అందించింది. దీనివల్ల ఫ్లోర్‌పై ఉండే సన్నటి ధూళి, మొండి మురికి, ఆహార వ్యర్థాలు, పెంపుడు జంతువుల ఊడిన వెంట్రుకలను ఇది ఎంతో సమర్థవంతంగా గుంజి శుభ్రం చేస్తుంది. వివిధ రకాల ఫ్లోరింగ్‌లపై ఇది పనిచేస్తుంది.
2. ట్రిపుల్ యాంటీ-ట్యాంగిల్ టెక్నాలజీ
సాధారణంగా వ్యాక్యూమ్ క్లీనర్లలో జుట్టు చిక్కుకుపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. అయితే దీనిని నివారించడానికి షియోమీ ఈ మోడల్‌లో ట్రిపుల్ యాంటీ-ట్యాంగిల్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. దీనివలన క్లీనర్ రోలర్ బ్రష్‌కి వెంట్రుకలు సులభంగా చిక్కుకోవు. పదే పదే బ్రష్‌ను మాన్యువల్‌గా చేతులతో శుభ్రం చేయాల్సిన అవసరం లేకుండా ఇది సులభతరం చేస్తుంది.
Cab Rules : ఓలా, ఉబర్, రాపిడోలకు కొత్త రూల్స్..ఇకపై మగవారితో కలిపి ప్రయాణించే పనిలేకుండా కొత్త ఆప్షన్
3. లాంగ్ బ్యాటరీ లైఫ్, కవరేజ్
పెద్ద ఇళ్లను సులభంగా శుభ్రం చేసేలా ఈ డివైజ్‌ను రూపొందించారు. ఇది సింగిల్ ఛార్జ్‌పై ఏకధాటిగా 45 నిమిషాల పాటు క్లీనింగ్ చేయగలదు. ఒకే ఛార్జింగ్‌తో దాదాపు 341 చదరపు మీటర్ల (341m²) విస్తీర్ణంలో ఉన్న ఫ్లోర్‌ను ఇది క్లీన్ చేయగలదని కంపెనీ పేర్కొంది.
4. 60°C హాట్ ఎయిర్ ఫ్లో, సైలెంట్ ఆపరేషన్
ఈ క్లీనర్‌లో 60°C హాట్ ఎయిర్ డ్రైయింగ్/ఫ్లో ఫీచర్ ఉంది. ఇది శుభ్రం చేసిన తడి ఫ్లోర్‌ను త్వరగా ఎండబెట్టడమే కాకుండా, నేలపై ఉండే దుర్గంధాన్ని (బ్యాడ్ స్మెల్), బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది ఆపరేట్ అయ్యేటప్పుడు చాలా తక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. కేవలం 50dB వరకు మాత్రమే శబ్దం రావడం వల్ల ఇంట్లో ఎలాంటి అంతరాయం కలగదు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
Xiaomi Pad 9 Pro Spotted on Geekbench With Snapdragon 8 Gen 5 SoC