ప్రముఖ చైనా మొబైల్ దిగ్గజం ఒప్పో భారతీయ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి తమ సరికొత్త సంచలనం ఒప్పో A6cను సోమవారం అధికారికంగా విడుదల చేసింది.
Photo Credit: Oppo
Oppo A6c features a 5-megapixel selfie camera
Oppo : ప్రముఖ చైనా మొబైల్ దిగ్గజం ఒప్పో భారతీయ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి తమ సరికొత్త సంచలనం ఒప్పో A6cను సోమవారం అధికారికంగా విడుదల చేసింది. సామాన్య కస్టమర్ల జేబుకు తగినట్లు, తక్కువ ధరలో అద్భుతమైన బ్యాటరీ లైఫ్ కోరుకునే వారిని టార్గెట్ చేస్తూ ఈ మొబైల్‌ను కంపెనీ డిజైన్ చేసింది. సాధారణంగా మార్కెట్లో వచ్చే బడ్జెట్ ఫోన్లలో ఉండే బ్యాటరీల కంటే ఇది చాలా పెద్దది. ఈ ఫోన్ ప్రస్తుతం ఒప్పో ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్ ద్వారా వినియోగదారులకు అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.
ధరల విషయానికి వస్తే, ఒప్పో A6c బేస్ మోడల్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999 గా ఉంది. అలాగే దీని టాప్-ఎండ్ మోడల్ అయిన 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 16,999 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫెదర్ వైట్, స్టోన్ బ్రౌన్ అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది.
ఈ సరికొత్త ఒప్పో A6c స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ, అతిపెద్ద ప్లస్ పాయింట్ ఇందులో ఉన్న 7,000mAh భారీ బ్యాటరీ. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంతో ఈ ఫోన్ రెండు నుంచి మూడు రోజుల పాటు సులభంగా బ్యాకప్ ఇస్తుంది. దీనితో పాటు టైప్-సి పోర్ట్ ద్వారా 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కంపెనీ అందించింది. నిరంతరం ప్రయాణాలు చేసేవారికి, ఊర్లకి వెళ్లేవారికి పవర్‌బ్యాంక్‌ల అవసరం లేకుండా ఈ ఫోన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
డిస్‌ప్లే విభాగంలో ఒప్పో రాజీ పడలేదు. ఇందులో 6.75-ఇంచుల HD+ LCD టచ్‌స్క్రీన్ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇది 120Hz హై రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. దీనివల్ల ఫోన్ స్క్రీన్‌ను స్క్రోల్ చేస్తున్నప్పుడు లేదా బ్రౌజ్ చేస్తున్నప్పుడు చాలా స్మూత్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 100% sRGB కలర్ కవరేజ్ ఉన్నందున ఎండలో కూడా డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ లోపల ఆక్టా-కోర్ యూనిసోక్ T7250 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. గ్రాఫిక్స్ కోసం మాలి-G57 జీపీయూ, 4GB LPDDR4x ర్యామ్‌ను జత చేశారు. ఇది రోజువారీ సాధారణ టాస్క్‌లు, సోషల్ మీడియా అప్లికేషన్లను చాలా వేగంగా రన్ చేస్తుంది. ఫొటోల విషయానికొస్తే, ఒప్పో A6c వెనుక భాగంలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా (f/2.2 అపెర్చర్)తో పాటు మరొక సెకండరీ సెన్సార్‌ను అమర్చారు. ఇది ఆటోఫోకస్ ఫీచర్‌తో వస్తుంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఈ రెండు కెమెరాల ద్వారా 1080p క్వాలిటీతో సెకనుకు 30 ఫ్రేమ్స్ (fps) వేగంతో వీడియోలను రికార్డ్ చేయవచ్చు.
భద్రత కోసం ఫోన్ పక్కభాగంలో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇచ్చారు. దుమ్ము, నీటి చినుకుల నుంచి ఫోన్ పాడవకుండా ఉండేందుకు దీనికి IP64 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది. కనెక్టివిటీ కోసం 4G LTE, వై-ఫై 5, బ్లూటూత్ 5.2, 3.5mm ఆడియో జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని బరువు కేవలం 215 గ్రాములు మాత్రమే.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,805
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Oppo Find X10 Pro Max India Launch Teased; Confirmed to Feature MediaTek Dimensity 9600 Pro SoC