రియల్‌మీ 16T లో కేవలం 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మాత్రమే వస్తుండగా.. వన్‌ప్లస్ నార్డ్ CE 6 లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ లభిస్తుంది.
Motorola Edge 70 has a 6.7-inch AMOLED display
Smartphone Comparison : భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రూ.30,000 ధర పరిధిలో పోటీ ఒక్కసారిగా హీటెక్కింది. గత వారం సరికొత్త ఫీచర్లతో లాంచ్ అయిన రియల్‌మీ 16T.. మార్కెట్లో ఇప్పటికే సంచలనం సృష్టిస్తున్న వన్‌ప్లస్ నార్డ్ CE 6 5G, మోటోరోలా ఎడ్జ్ 70 ఫోన్లకు గట్టి పోటీనిస్తోంది. ఈ మూడు లేటెస్ట్ 5G మొబైల్స్ కూడా ఆండ్రాయిడ్ 16 ఓఎస్, అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలతో వస్తున్నాయి. మరి మీ జేబుకు తగినట్లు, తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఇచ్చే బెస్ట్ ఫోన్ ఏదో ఇప్పుడు చూద్దాం.
ధర విషయానికి వస్తే.. మూడింటి బేస్ వేరియంట్ ధర సరిగ్గా రూ. 29,999 నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ, రియల్‌మీ 16T లో కేవలం 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మాత్రమే వస్తుండగా.. వన్‌ప్లస్ నార్డ్ CE 6 లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ లభిస్తుంది. ఇక్కడ అన్నిటికంటే బెస్ట్ డీల్ మోటోరోలా ఎడ్జ్ 70 దే అని చెప్పాలి. ఎందుకంటే అదే రూ. 29,999 ధరకే మోటో ఫోన్ ఏకంగా 8GB ర్యామ్ + 256GB భారీ స్టోరేజ్ వేరియంట్‌ను అందిస్తోంది.
స్క్రీన్ పరంగా చూస్తే, రియల్‌మీ 16T లో 6.8-ఇంచుల భారీ ఎల్‌సీడీ ప్యానెల్, 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. కానీ, వన్‌ప్లస్ నార్డ్ CE 6 లో 6.78-ఇంచుల అద్భుతమైన 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు 144Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ బ్రైట్‌నెస్ లభిస్తాయి. ఇక మోటోరోలా ఎడ్జ్ 70 లో 6.7-ఇంచుల అమోలెడ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు ఏకంగా 4,500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ఉన్నాయి. దుమ్ము, నీటి రక్షణ కోసం రియల్‌మీకి IP68, మోటోకి IP68+IP69 రేటింగ్ ఉండగా.. వన్‌ప్లస్ ఫోన్ IP66, IP68, IP69, IP69K ల ఆల్‌రౌండ్ ప్రొటెక్షన్‌తో అగ్రస్థానంలో నిలిచింది.
Oppo A6c 4G : గెలాక్సీ, రెడ్‌మిలకు పోటీగా 7,000mAh బ్యాటరీతో ఒప్పో A6c లాంచ్
పెర్ఫార్మెన్స్ పరంగా రియల్‌మీ 16T లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ఉండగా.. వన్‌ప్లస్‌లో స్నాప్‌డ్రాగన్ 7s Gen 4, మోటోలో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్లు ఉన్నాయి. బ్యాటరీ విషయానికొస్తే రియల్‌మీ, వన్‌ప్లస్ రెండు ఫోన్లూ ఏకంగా 8,000mAh బ్యాటరీతో అదరగొడుతున్నాయి. అయితే ఛార్జింగ్ స్పీడ్‌లో మాత్రం వన్‌ప్లస్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రియల్‌మీ (45W) కంటే చాలా ముందుంది. మోటోరోలా ఎడ్జ్ 70 లో 5,000mAh బ్యాటరీ మాత్రమే ఉన్నప్పటికీ, ఇది 68W వైర్డ్ మరియు 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
కెమెరాల పరంగా చూస్తే, మోటోరోలా ఎడ్జ్ 70 ఓఐఎస్ (OIS) సపోర్ట్ గల 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP సెల్ఫీ షూటర్‌తో ఫోటోగ్రఫీ ప్రేమికులకు బెస్ట్ ఆప్షన్‌గా నిలిచింది. రియల్‌మీ, వన్‌ప్లస్ లలో 50MP+2MP డ్యూయల్ రియర్ కెమెరాలు మాత్రమే ఉన్నాయి.
మీకు ఎలాంటి టెన్షన్ లేని లాంగ్ బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే వన్‌ప్లస్ నార్డ్ CE 6 బెస్ట్ ఛాయిస్. అలా కాకుండా.. స్లిమ్ డిజైన్, లైట్ వెయిట్ (కేవలం 159 గ్రాములు), అదిరిపోయే కెమెరాలు, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటే మోటోరోలా ఎడ్జ్ 70 మీకోసం పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,805
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Oppo Find X10 Pro Max India Launch Teased; Confirmed to Feature MediaTek Dimensity 9600 Pro SoC