Oppo A7 Pro Max : పవర్ బ్యాంక్‌లకు శాశ్వతంగా గుడ్ బై.. ఒప్పో కొత్త ఫోన్ చూస్తే షాక్ అవ్వడం ఖాయం

ఒప్పో A7 ప్రో మ్యాక్స్‌లో ఏకంగా 10,000 mAh Single-Cell బ్యాటరీని అందించనున్నారు.

Oppo A7 Pro Max  : పవర్ బ్యాంక్‌లకు శాశ్వతంగా గుడ్ బై.. ఒప్పో కొత్త ఫోన్ చూస్తే షాక్ అవ్వడం ఖాయం

Photo Credit: Oppo

Oppo A7 Pro Max

ముఖ్యాంశాలు
  • అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో కొత్త ధమాకా
  • ఏకంగా 10,000mAh భారీ బ్యాటరీతో ఒప్పో A7 ప్రో మ్యాక్స్
  • 10,000mAh బ్యాటరీతో రానున్న ఒప్పో A7 ప్రో మ్యాక్స్
ప్రకటన

Oppo A7 Pro Max  : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన పాపులర్ ఎ-సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది.  ఒప్పో A7 ప్రో మ్యాక్స్ పేరుతో రాబోతున్న ఈ ఫోన్‌కు సంబంధించి చైనాలో ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వేదిక వీబో వేదికగా ఒప్పో ఈ ఫోన్ అధికారిక టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌లో ఫోన్ వెనుక వైపు డిజైన్‌ను స్పష్టంగా చూపించారు. కొద్దిగా ఎత్తుగా ఉండే రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్, రెండు పెద్ద కెమెరా రింగులు, స్పెషల్ పవర్ ఫ్లాష్ బ్రాండింగ్‌తో కూడిన ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో ఈ ఫోన్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.  

10,000mAh భారీ బ్యాటరీ స్పెషల్  
ఈ ఫోన్‌లోని ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ కెపాసిటీ. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో 5,000mAh బ్యాటరీ చూస్తుంటాం, కానీ ఒప్పో A7 ప్రో మ్యాక్స్‌లో ఏకంగా 10,000 mAh Single-Cell బ్యాటరీని అందించనున్నారు. దీని రేటెడ్ క్యాపాసిటీ 9,700 mAh కాగా, నామినల్ క్యాపాసిటీ 10,000 mAh అని కంపెనీ ధృవీకరించింది. అంతేకాకుండా ఈ భారీ బ్యాటరీని ఫాస్ట్ గా ఛార్జ్ చేయడానికి 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తున్నారు.  ప్రాసెసర్, డిస్‌ప్లే, సాఫ్ట్‌వేర్ వివరాలు  

 ఇటీవలి బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్ గీక్‌బెంచ్ లిస్టింగ్ ప్రకారం.. ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5  ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. డిస్‌ప్లే విషయానికొస్తే.. 6.78 అంగుళాల ఫ్లాట్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 1.5K రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్‌ఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. 

Digital India : దేశమంతటా డిజిటల్ జోరు.. 99.9 శాతం జిల్లాల్లో అందుబాటులోకి 5G సేవలు

 కెమెరా సెటప్, ఇతర ఫీచర్లు
కెమెరా విభాగానికి వస్తే ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉండనుంది. అందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో ఏకంగా 50 మెగాపిక్సెల్ హై-రెసల్యూషన్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చే అవకాశముంది. ఫోన్ కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ బటన్లు అమర్చబడి ఉన్నాయి.  

ఇటీవల లాంచ్ అయిన ఒప్పో K15 విశేషాలు  
ఒప్పో ఇటీవల చైనా మార్కెట్లో ఒప్పో K15 మోడల్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్‌లో 6.59 అంగుళాల ఫుల్ HD+ అమోలెడ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించారు.  50MP ప్రైమరీ కెమెరా, 50MP ఆల్ట్రా-వైడ్ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరాతో పాటు 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి బలమైన ఫీచర్లు ఉన్నాయి.  

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »