Digital India : దేశమంతటా డిజిటల్ జోరు.. 99.9 శాతం జిల్లాల్లో అందుబాటులోకి 5G సేవలు

పట్టణాలు, నగరాలే కాకుండా దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లో సాధారణ పౌరులు సైతం 5G నెట్‌వర్క్‌ను సజావుగా ఉపయోగించుకోగలుగుతున్నారు.

Digital India : దేశమంతటా డిజిటల్ జోరు.. 99.9 శాతం జిల్లాల్లో అందుబాటులోకి 5G సేవలు

Photo Credit: Pexels/Z z

Digital India

ముఖ్యాంశాలు
  • సిగ్నల్ కోసం చెట్లు ఎక్కే రోజులు పోయాయి
  • మూలలో కూర్చున్నా ఫుల్ స్పీడ్ ఇంటర్నెట్!
  • 99.9 శాతం జిల్లాల్లో అందుబాటులోకి 5G సేవలు
ప్రకటన

Digital India :  భారతదేశంలో డిజిటల్ విప్లవం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా మూలమూలకూ హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాన్ని చేరవేసే ప్రక్రియ వేగవంతమైంది. ప్రస్తుతం దేశంలోని 99.9 శాతం జిల్లాల్లో ప్రజలకు ఫాస్టెస్ట్ 5G ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పట్టణాలు, నగరాలే కాకుండా దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లో సాధారణ పౌరులు సైతం 5G నెట్‌వర్క్‌ను సజావుగా ఉపయోగించుకోగలుగుతున్నారు.

రికార్డు స్థాయిలో పెరిగిన 5G టవర్లు
కేంద్ర కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో 5G ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భారీగా పెరిగింది. మార్చి 31, 2023 నాటికి దేశంలో కేవలం 1,40,623 గా ఉన్న 5G బేస్ ట్రాన్సీవర్ స్టేషన్ల సంఖ్య, జూన్ 30, 2026 నాటికి ఏకంగా 5,62,971కి చేరుకుంది. అతి తక్కువ సమయంలోనే ఇన్ని లక్షల టవర్లను ఏర్పాటు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా 99.9 శాతం జిల్లాలకు ఈ అధునాతన నెట్‌వర్క్ సేవలు విస్తరించాయి.

పల్లె పల్లెకూ చేరుకున్న 4G కనెక్టివిటీ
కేవలం నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.  డిజిటల్ భారత్ నిధి(DBN) ద్వారా నిధులు పొందుతున్న 4G శాచురేషన్ ప్రాజెక్ట్, ఇతర మొబైల్ కనెక్టివిటీ పథకాల కింద జూన్ 2026 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 24 వేల మొబైల్ టవర్లను ఏర్పాటు చేశారు. గతంలో అసలు ఎటువంటి నెట్‌వర్క్ సౌకర్యం లేని దట్టమైన అటవీ, మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇప్పుడు 4G నెట్‌వర్క్ అందుబాటులోకి వచ్చింది.

Vivo T5e vs Realme C100x vs Samsung Galaxy F70e 5G: రూ.15 వేల లోపు బెస్ట్ ఫోన్ ఏది?

ఆవిష్కరణలకు ఊతం ఇచ్చే టీటీడీఎఫ్ పథకం
టెలికాం టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫండ్ (TTDF) పథకం ద్వారా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (R&D) రంగానికి పెద్దపీట వేస్తున్నారు. ఈ పథకం కింద జూన్ 30, 2026 నాటికి సుమారు 136 వినూత్న ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల కోసం దాదాపు రూ. 5.43 బిలియన్ల (రూ.543 కోట్లు) నిధులను మంజూరు చేశారు. ఈ నిధుల ద్వారా 6G టెక్నాలజీ, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, శాటిలైట్ నెట్‌వర్క్స్, ఆప్టికల్ సిస్టమ్స్, స్వదేశీ 5G కోర్, టెలికాం సెక్యూరిటీ వంటి కీలక రంగాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి.

భారత్‌లో 6G సేవలకు స్ట్రాంగ్ పునాది
భవిష్యత్తు టెక్నాలజీతో భారత్‌ను ప్రపంచ స్థాయి విజేతగా నిలిపేందుకు మార్చి 2023లోనే ప్రభుత్వం భారత్ 6G విజన్ డాక్యుమెంట్‎ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సురక్షితమైన, ఇంటిలిజెంట్ కనెక్టివిటీ అందించడమే లక్ష్యంగా 6G టెక్నాలజీని ఇక్కడే డిజైన్ చేసి, అభివృద్ధి చేసి అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే, దేశీయంగా టెలికాం ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు టెలికాం శాఖ రూ. 121.95 బిలియన్ల (రూ. 12,195 కోట్లు) ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాన్ని కూడా విజయవంతంగా అమలు చేస్తోంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »