OPPO Find X10 Series EVT Prototype Leaked: ఇప్పటివరకు ఒప్పో తన ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో సర్క్యులర్ కెమెరా మాడ్యూల్‌ను అందించగా, ఫైండ్ X10 సిరీస్‌లో ఆ డిజైన్‌ను పూర్తిగా మారుస్తున్నట్లు లీకైన ఇంజనీరింగ్ ప్రొటోటైప్ ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
Oppo
OPPO Find X10 Series EVT Prototype Leaked: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో తన ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లో భాగంగా ఒప్పో ఫైండ్ X10 సిరీస్‌ను ఆవిష్కరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. మునుపటి పాపులర్ ఫైండ్ X9 సిరీస్‌కు సీక్వెల్‌గా రానున్న ఈ కొత్త మోడళ్లపై మార్కెట్‌లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ అందించిన లీక్స్ ఆధారంగా ఈ సిరీస్‌కు సంబంధించిన డిజైన్, కెమెరా మాడ్యూల్, ప్రాసెసర్, కీలక ఫీచర్ల వివరాలు బయటకు వచ్చాయి.
మారిన డిజైన్, కొత్త AI బటన్
ఇప్పటివరకు ఒప్పో తన ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో సర్క్యులర్ కెమెరా మాడ్యూల్‌ను అందించగా, ఫైండ్ X10 సిరీస్‌లో ఆ డిజైన్‌ను పూర్తిగా మారుస్తున్నట్లు లీకైన ఇంజనీరింగ్ ప్రొటోటైప్ ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి. ఈసారి ఫైండ్ X9s ప్రొ తరహాలో వైడ్ హారిజాంటల్ (అడ్డంగా ఉండే) కెమెరా మాడ్యూల్‌ను పరిచయం చేయనున్నారు. ఈ మాడ్యూల్ ఎడమవైపు మూడు కెమెరా సెన్సార్లు, కుడివైపు ఎల్‌ఈడీ ఫ్లాష్, మల్టీస్పెట్రల్ సెన్సార్‌తో తీర్చిదిద్దబడింది. అంతేకాకుండా, ఈ సిరీస్ ఫోన్లలో ప్రత్యేకంగా కస్టమైజబుల్ AI బటన్ కూడా రాబోతుండటం విశేషం. ఇవి వైట్, ఆరెంజ్, అండ్ సయాన్ కలర్ ఆప్షన్లలో లభ్యమయ్యే అవకాశం ఉంది.
LIPO డిస్ప్లే టెక్నాలజీ , మోడల్స్
ఈ సిరీస్‌లో ఒప్పో ఫైండ్ X10, ఫైండ్ X10 ప్రొ, ఫైండ్ X10 ప్రొ మాక్స్ అనే మూడు ప్రధాన మోడళ్లను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ ఫోన్లలో స్క్రీన్ అంచులు చాలా సన్నగా ఉండేలా LIPO టెక్నాలజీ డిస్ప్లేలను వాడుతున్నారు. లీక్స్ ప్రకారం.. ఫైండ్ X10 ప్రొ మాక్స్ మోడల్ 6.78-ఇంచ్ ఫ్లాట్ 1.5K AMOLED డిస్ప్లేతో పాటు స్మూత్ గేమింగ్ కోసం 165Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది.
iQOO Neo 11S : ఛార్జర్ ని మరచిపోయినా నో ప్రాబ్లమ్.. 8000mAh బ్యాటరీతో ఐకూ కొత్త ఫోన్ తెచ్చేస్తోంది
2nm ప్రాసెసర్, పవర్ ఫుల్ 200MP కెమెరాలు
పర్ఫార్మెన్స్ పరంగా ఒప్పో ఎక్కడా తగ్గేలా కనిపించడం లేదు. ఈ సిరీస్ ఫోన్లలో 2nm ప్రాసెస్ ఆధారంగా తయారైన మీడియాటెక్ డైమెన్సిటీ 9600 ప్రొ/ డైమెన్సిటీ 9600 లైట్ ప్రాసెసర్లను అందించబోతున్నారు. ఇక ఫోటోగ్రఫీ విభాగంలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు, పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్‌ను ఇవ్వనున్నారు. టాప్ వేరియంట్లలో ఏకంగా ట్రిపుల్ 200MP కెమెరా సెటప్ ఉండే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
భారీ బ్యాటరీ, లాంచ్ టైమ్‌లైన్
బ్యాటరీ విభాగంలో కూడా ఒప్పో పెద్ద విప్లవానికే తెరదీసింది. ఇందులో ఏకంగా 8,000mAh సిలికాన్-కార్బన్ భారీ బ్యాటరీని 100W లేదా 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందించనున్నట్లు సమాచారం. దీంతో పాటు IP68/IP69 డ్యూయల్ వాటర్ రెసిస్టెన్స్, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కేనర్ కూడా ఇందులో ఉంటాయి. ఈ సిరీస్‌ను ఒప్పో సంస్థ సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ ప్రారంభంలో అధికారికంగా మార్కెట్లోకి తీసుకురానుంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
IFA 2026: Lenovo Unveiled New IdeaPad, Yoga and ThinkBook Laptops
IFA 2026: Nvidia RTX Spark PCs, Local AI Tools Announced With October Launch Planned
Luna Band Now Available Globally: Check Price in India, Specifications and Features