ఈ పవర్‌ఫుల్ క్రైమ్ సాగా సిరీస్ జూలై 2, 2026న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Photo Credit: Amazon Prime
Isakhapatnam is landing on the OTT, Amazon Prime from July 2, 2026.
OTT Movie : తెలుగు డిజిటల్ వినోద రంగంలో క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో కస్టమర్ల కోసం ఒక పవర్‌ఫుల్ ఒరిజినల్ సిరీస్‌ను సిద్ధం చేసింది. అదే ఇసకపట్నం. 1990ల కాలం నాటి పీరియడ్ యాక్షన్ అండ్ రివెంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రతిష్టాత్మక వెబ్ సిరీస్ అధికారిక డిజిటల్ విడుదల తేదీని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు.
ఈ పవర్‌ఫుల్ క్రైమ్ సాగా సిరీస్ జూలై 2, 2026న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇండియాలోని ఓటీటీ వీక్షకులతో పాటు దాదాపు 240కి పైగా దేశాలు, ప్రాంతాలలో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. మొత్తం 7 ఎపిసోడ్లతో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్‌ను మాతృభాష తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్ చేయనున్నారు. అలాగే ఇంగ్లీష్ సహా 15 అంతర్జాతీయ భాషల్లో సబ్‌టైటిల్స్ కూడా లభిస్తాయి.
ఈ కథాంశం మొత్తం 1990ల నేపథ్యంలో ఒక కల్పిత తీరప్రాంత పోర్ట్ టౌన్ చుట్టూ తిరుగుతుంది. ఆ ప్రాంతంలో నాయుడు అనే ఒక క్రూరమైన, పవర్ఫుల్ వ్యక్తి తన నేర సామ్రాజ్యాన్ని ఏలుతుంటాడు. అతడి పేరు చెబితేనే స్థానిక ప్రజలు, వ్యాపారులు వణికిపోతుంటారు. అయితే, అతడి కఠినమైన పరిపాలనను, అరాచకాలను అణచివేయడానికి ముగ్గురు వ్యక్తులు సవాల్ విసురుతారు. అదే సమయంలో నాయుడు వల్ల అన్యాయానికి గురై, న్యాయం కోసం పోరాడే ఒక ధైర్యవంతురాలైన మహిళ, అలాగే తన యజమాని పట్ల విశ్వాసానికి, తన సొంత నైతిక విలువల మధ్య నలిగిపోయే ఒక నమ్మకస్థుడైన అనుచరుడు ఉంటారు. వీరి జీవితాలు ఒక ప్రమాదకరమైన ఆపరేషన్‌లో ఎలా ముడిపడ్డాయి, వీరంతా కలిసి నాయుడు సామ్రాజ్యాన్ని ఎలా కూల్చేశారు అనేదే ఈ సిరీస్ కథ.
YouTube : లింకులు కాపీ చేసే శ్రమ తప్పింది.. ఇకపై యూట్యూబ్‌లోనే డైరెక్ట్ మెసేజ్ పంపొచ్చు
ఈ వెబ్ సిరీస్‌లో సౌతిండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని, టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో పాటు టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సునీల్, నరేష్ అగస్త్య, రాజీవ్ కనకాల, మైమ్ గోపి, సుధాకర్ కోమకుల, మెరిన్ ఫిలిప్, రోహిణి, బెనర్జీ, జ్వాల కోటి, రవివర్మ, రాజా చెంబోలు వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌కు ప్రముఖ ఎడిటర్ అండ్ డైరెక్టర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించగా, ప్రశాంత్ రాఘతి పవర్‌ఫుల్ స్క్రిప్ట్ అందించారు. తాజుద్దీన్ సయ్యద్ రాసిన సంభాషణలు ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఇసకపట్నం సిరీస్ ఇంకా విడుదల కానప్పటికీ, ఇటీవల విడుదలైన దీని ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. 1990ల నాటి కోస్తా తీర ప్రాంత వాతావరణాన్ని, గ్యాంగ్ వార్స్, పొలిటికల్ ఫ్యామిలీ డ్రామాలను డైరెక్టర్ గ్యారీ స్క్రీన్ మీద ఎంతో రియలిస్టిక్‌గా చూపించినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. అమెజాన్ ప్రైమ్ డే స్పెషల్ లైనప్‌లో భాగంగా వస్తున్న ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వడం ఖాయమని టెక్, సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Lava Virat Curve 5G Launched in India With MediaTek Dimensity 7100 SoC, 6,000mAh Battery: Price, Specifications