8GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర THB 19,999 (మన కరెన్సీలో దాదాపు రూ. 56,000) గా ఉంది. అలాగే, 12GB ర్యామ్ + 256GB టాప్ వేరియంట్ ధర THB 22,999 (మన కరెన్సీలో సుమారు రూ. 65,000) గా నిర్ణయించారు.
Photo Credit: Oppo Reno 16
Oppo Reno 16
Oppo Reno 16 : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో, అంతర్జాతీయ టెక్ మార్కెట్లో తన మోస్ట్ అవేటెడ్ ఫ్లాగ్‌షిప్ లైనప్ ఒప్పో రెనో 16 సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. థాయిలాండ్, మలేషియా వంటి ప్రముఖ గ్లోబల్ మార్కెట్లలో ఈ సిరీస్ ప్రస్తుతం విడుదలైంది. ఈ సిరీస్ కింద కంపెనీ మూడు వేరియంట్లను పరిచయం చేసింది. అందులో ఒప్పో రెనో 16, ఒప్పో రెనో 16F, టాప్ ఎండ్ మోడల్‌గా ఒప్పో రెనో 16 ప్రో 5G ఉన్నాయి. ఇందులో స్టాండర్డ్, ఎఫ్ మోడల్స్ అద్భుతమైన ఫీచర్లు, వినూత్నమైన టెక్నాలజీతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ సిరీస్ లో ఒప్పో ప్రవేశపెట్టిన అత్యంత క్రేజీ, వినూత్నమైన ఫీచర్ ఒప్పో బబుల్ మ్యాగ్ ఈ-బ్యాడ్జ్ డిస్‌ప్లే. ఇది ఒక స్మార్ట్ మ్యాగ్నెటిక్ డిస్‌ప్లే, ఇది ఫోన్ బ్యాక్ ప్యానెల్‌కు అయస్కాంతం సహాయంతో సులభంగా అతుక్కుంటుంది. ఇది ఒప్పో కలర్ఓఎస్ సాఫ్ట్‌వేర్‌తో కలిసి సింక్ అవుతుంది. దీని ప్రధాన ఉపయోగం ఏంటంటే, మీరు ఫోన్ వెనుక కెమెరాను వాడుతున్నప్పుడు ఈ చిన్న స్క్రీన్‌పై లైవ్ ప్రివ్యూను చూసుకోవచ్చు. దీనివల్ల వెనుక ఉన్న హై-క్వాలిటీ కెమెరాలతో అత్యంత స్పష్టమైన సెల్ఫీలు, గ్రూప్ ఫోటోలు తీసుకోవడం చాలా ఈజీ అవుతుంది.
సిరీస్ లోని స్టాండర్డ్ మోడల్ అయిన ఒప్పో రెనో 16 రెండు స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని 8GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర THB 19,999 (మన కరెన్సీలో దాదాపు రూ. 56,000) గా ఉంది. అలాగే, 12GB ర్యామ్ + 256GB టాప్ వేరియంట్ ధర THB 22,999 (మన కరెన్సీలో సుమారు రూ. 65,000) గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను కస్టమర్లు పాప్ వైట్, ట్విలైట్ వయొలెట్, డ్రీమ్ పర్పుల్ రంగులలో కొనుగోలు చేయవచ్చు.
కాస్త తక్కువ బడ్జెట్‌లో వచ్చే ఒప్పో రెనో 16F మోడల్ కూడా రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ మోడల్ ధర THB 15,999 (దాదాపు రూ. 45,000) గా ఉంది. ఇక 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర THB 16,999 (సుమారు రూ. 48,000) గా ఉంది. ఈ ఫోన్ కూడా పాప్ వైట్, ట్విలైట్ వయొలెట్, డ్రీమ్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో వినియోగదారులకు లభిస్తుంది.
ఒప్పో రెనో 16 స్మార్ట్‌ఫోన్ 1.5K రెజల్యూషన్ సపోర్ట్ గల 6.32-ఇంచుల కాంపాక్ట్ అమోలెడ్ స్క్రీన్‌తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ లో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌ను అమర్చారు. దీనికి తోడు వేగవంతమైన LPDDR5X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని అందించారు. పవర్ బ్యాకప్ కోసం ఇందులో 80W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 6,700mAh భారీ బ్యాటరీ ఉంది.
ఫొటోగ్రఫీ పరంగా ఒప్పో రెనో 16 వెనుక భాగంలో మూడు అద్భుతమైన కెమెరాలను అందించారు. ఇందులో 2-యాక్సిస్ OIS సపోర్ట్ గల 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. దీనితో పాటు 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 3.5x ఆప్టికల్ జూమ్, OIS సపోర్ట్ కలిగిన మరొక 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను జోడించారు. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో ఆటోఫోకస్ ఫీచర్ కలిగిన అడ్వాన్స్‌డ్ 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కేటాయించారు.
8849 Tank 5 : స్మార్ట్‌ఫోన్ లోనే హోమ్ థియేటర్.. ఇన్-బిల్ట్ ప్రొజెక్టర్‌తో వచ్చిన సరికొత్త రగ్గడ్ మొబైల్
ఈ సిరీస్ లో అందరినీ ఆశ్చర్యపరిచే మరో మొబైల్ ఒప్పో రెనో 16F. ఈ ఫోన్ లో క్రిస్టల్ గార్డ్ ప్రొటెక్షన్ కలిగిన 6.57-ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300-ఎనర్జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్ ప్రధాన హైలైట్ ఏమిటంటే, ఇందులో ఏకంగా 7000mAh సామర్థ్యం గల రాక్షస బ్యాటరీని ప్యాక్ చేశారు. దీనికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ఒప్పో రెనో 16F బ్యాక్ కెమెరా విషయానికి వస్తే, ఇందులో 2-యాక్సిస్ OIS కలిగిన 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. దీనితో పాటు 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 3.5x ఆప్టికల్ జూమ్, OIS సపోర్ట్ కలిగిన 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, క్లియర్ వీడియో కాల్స్ కోసం ఈ మోడల్‌లో కూడా ఆటోఫోకస్ సపోర్ట్ గల 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఈ గ్లోబల్ లైనప్ త్వరలోనే భారత మార్కెట్లో కూడా లాంచ్ కాబోతోంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹59,805
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Lenovo ThinkBook 14x Launched in India With Intel Core Ultra Series 2 Processors: Price, Specifications