పోకో M8 పవర్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 గాను, 8GB RAM + 128GB వేరియంట్ ధర రూ.27,999 గాను ఉంది.
Photo Credit: Poco/Vivo/OnePlus
Poco M8 Power vs Vivo T5x 5G vs OnePlus Nord CE6 Lite
Poco M8 Power vs Vivo T5x 5G vs OnePlus Nord CE6 Lite : పోకో సంస్థ భారత్‌లో తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ పోకో M8 పవర్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. మధ్యధర బడ్జెట్ విభాగంలో వచ్చిన ఈ ఫోన్ మార్కెట్లో ఇప్పటికే మంచి ఆదరణ పొందుతున్న వీవో T5x 5G, వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్ ఫోన్లకు ప్రత్యక్ష పోటీని ఇస్తోంది. పవర్ఫుల్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ, అడ్వాన్స్‌డ్ డిస్‌ప్లే ఫీచర్లతో వచ్చిన ఈ మూడు ఫోన్లలో ఏది అత్యుత్తమమైనదో వివరంగా తెలుసుకుందాం.
ధర, వేరియంట్ల వివరాలు
పోకో M8 పవర్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 గాను, 8GB RAM + 128GB వేరియంట్ ధర రూ.27,999 గాను ఉంది. వీవో T5x 5G విషయానికి వస్తే.. 6GB+128GB ధర రూ.24,999, 8GB+128GB ధర రూ.27,999 కాగా, 8GB+256GB వేరియంట్ ధర రూ.30,999 గా నిర్ణయించారు. ఇక వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్ 6GB+128GB వేరియంట్ రూ.25,999, 8GB+128GB వేరియంట్ రూ.27,999, 8GB+256GB వేరియంట్ రూ.30,999 ధరకు లభిస్తున్నాయి.
డిస్‌ప్లే క్వాలిటీ, రెజల్యూషన్
పోకో M8 పవర్ లో 6.83 ఇంచుల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 2396x1080 పిక్సెల్స్ రెజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. వీవో T5x 5G లో 6.76 ఇంచుల ఫుల్ HD+ LCD డిస్‌ప్లే (2344x1080 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్‌నెస్) ఉంది. వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్ లో 6.72 ఇంచుల ఫుల్ HD+ LCD డిస్‌ప్లే (2400x1080 పిక్సెల్స్, 144Hz రిఫ్రెష్ రేట్, 680 నిట్స్ బ్రైట్‌నెస్) అందించారు.
ప్రాసెసర్, ఆపరేటింగ్ సిస్టమ్
పోకో M8 పవర్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత షావోమి హైపర్ OS 3 పై పనిచేస్తుంది. వీవో T5x 5G మోడల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో చిప్‌సెట్ అందించారు, ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ OS 6 తో నడుస్తుంది. ఇక వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఎపెక్స్ ప్రాసెసర్ ఇచ్చారు, ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ OS 16 పై పనిచేస్తుంది.
TRAI MyCall : కాల్ డ్రాప్‌లతో విసిగిపోయారా?.. TRAI MyCall యాప్‌తో నెట్‌వర్క్ తిప్పలకు చెక్
కెమెరా పనితీరు వివరాలు
పోకో M8 పవర్ వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా (f/1.8) తో పాటు 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. వీవో T5x 5G వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ (f/1.8), 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. అయితే సెల్ఫీల కోసం ఇందులో భారీగా 32 మెగాపిక్సెల్ (f/2.0) ఫ్రంట్ కెమెరాను అందించారు. వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్ వెనుక 50 మెగాపిక్సెల్ (EIS సపోర్ట్‌తో), 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా, ముందు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
బ్యాటరీ, కనెక్టివిటీ ఆప్షన్లు
బ్యాటరీ విభాగంలో పోకో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. పోకో M8 పవర్లో 8,000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని ఇచ్చారు. ఇది 45W వైర్డ్ చార్జింగ్, 22.5W రివర్స్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వీవో T5x 5Gలో 44W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 7,200mAh బ్యాటరీ రాగా, వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్లో 45W SUPERVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీ లభిస్తుంది. కనెక్టివిటీ పరంగా మూడింట్లోనూ 5G, వై-ఫై, బ్లూటూత్, టైప్-సి పోర్ట్ సదుపాయాలు ఉన్నాయి.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,150
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Meta Muse AI Agent Arrives on Mac With Support for Complex Tasks: What to Know
WhatsApp Could Bring New Theme Categories and Wallpapers to Android
Mivi One 5G Camera Details Revealed, Mivi Care+ Support Teased Ahead of Launch