ప్రతిరోజూ నెట్‌వర్క్ సమస్యలతో, మాట్లాడేటప్పుడు మధ్యలోనే కాల్ కట్ అవ్వడం వంటి తిప్పలతో విసిగిపోతున్న కస్టమర్ల అనుభవాలను నేరుగా టెలికాం కంపెనీలకు, ప్రభుత్వానికి తెలియజేసేందుకు TRAI MyCall యాప్ కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది.
Photo Credit: Pexels/Andrea Piacquadio
TRAI MyCall
TRAI MyCall : భారత టెలికాం నియామక సంస్థ (TRAI) దేశంలోని 100 కోట్లకు పైగా ఉన్న టెలికాం వినియోగదారుల కోసం ఒక అద్భుతమైన యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రతిరోజూ నెట్‌వర్క్ సమస్యలతో, మాట్లాడేటప్పుడు మధ్యలోనే కాల్ కట్ అవ్వడం వంటి తిప్పలతో విసిగిపోతున్న కస్టమర్ల అనుభవాలను నేరుగా టెలికాం కంపెనీలకు, ప్రభుత్వానికి తెలియజేసేందుకు TRAI MyCall యాప్ కొత్త వెర్షన్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమకు ఎదురవుతున్న కాలింగ్ సమస్యలపై నేరుగా ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చు.
యాప్ లభ్యత, ఆపిల్ యూజర్ల వివరాలు
ప్రస్తుతం ఈ TRAI MyCall యాప్‌ను కేవలం ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలుగా గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంచారు. ఐఓఎస్ వినియోగదారులకు ఈ యాప్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది లేదా వస్తుందా లేదా అనే విషయంపై ట్రాయ్ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆండ్రాయిడ్ యూజర్లు ప్లేస్టోర్ నుంచి సులభంగా దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు
ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత, యూజర్లు తాము మాట్లాడే ప్రతి కాల్ ముగిసిన వెంటనే నెట్‌వర్క్ క్వాలిటీపై రేటింగ్ ఇవ్వవచ్చు. ప్రతీ కాల్ పూర్తికాగానే స్క్రీన్ పై ఒక పాప్-అప్ ప్రత్యక్షమవుతుంది. అక్కడ మీకు లభించిన కాల్ క్వాలిటీని బట్టి రేటింగ్ ఇవ్వొచ్చు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే.. వినియోగదారులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్, వ్యక్తిగత వివరాలు అత్యంత రహస్యంగా, భద్రంగా ఉంచబడతాయని ట్రాయ్ స్పష్టం చేసింది.
TRAI MyCall యాప్‌ను ఎలా ఉపయోగించాలి?
* ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి TRAI MyCall యాప్‌ను డౌన్‌లోడ్ చేసి మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
* యాప్ ఓపెన్ చేసిన తర్వాత నిబంధనలు, షరతులను చదివి అంగీకరించాలి.
* ప్రతి కాల్ తర్వాత స్క్రీన్ పై రేటింగ్ పాప్-అప్ కనిపించడానికి అవసరమైన అనుమతులను యాప్‌నకు అనుమతించాలి.
* ఇకపై కాల్ డ్రాప్ అయినా లేదా మాటల మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినా నేరుగా యాప్ ద్వారా టెలికాం కంపెనీకి, ట్రాయ్‌కి ఫిర్యాదు చేయవచ్చు.
* ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా టెలికాం కంపెనీలు తమ టవర్ల సామర్థ్యాన్ని, నెట్‌వర్క్ నాణ్యతను మెరుగుపరుస్తాయి.
UPI : యూపీఐ ఉచిత సేవలకు చెక్ పెట్టనున్న కేంద్రం.. డిజిటల్ లావాదేవీలపై త్వరలో ఛార్జీలు
యాప్‌లో ఉన్న కీలక ఫీచర్లు ఇవే
* ఇన్‌స్టంట్ రేటింగ్: 1 నుంచి 5 స్టార్ల వరకు రేటింగ్ ఇచ్చే సదుపాయం ఉంది.
* వివిధ సమస్యల నమోదు: కాల్ డ్రాప్స్, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్, వాయిస్ ఆలస్యంగా రావడం, క్రాస్ కనెక్షన్, వాయిస్ బ్రేకింగ్, ఎదుటివారికి గొంతు వినపడకపోవడం, కాల్ కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ సమయం పట్టడం వంటి అనేక సమస్యలను ఇందులో ఎంచుకోవచ్చు.
* ఆటోమేటిక్ ప్రాంప్ట్స్: మాట్లాడటం పూర్తయిన వెంటనే ఫీడ్‌బ్యాక్ సబ్మిట్ చేయడానికి ఆటోమేటిక్ ప్రాంప్ట్ వస్తుంది.
* ఇంటరాక్టివ్ మ్యాప్: మీ రేటింగ్ హిస్టరీ, కవరేజ్ వివరాలను ఇంటరాక్టివ్ మ్యాప్‌లో చూసుకోవచ్చు.
* కవరేజ్ టెస్ట్: మీ ప్రాంతంలో మొబైల్ సిగ్నల్ తీవ్రతను పరీక్షించుకోవడానికి కవరేజ్ టెస్ట్ ఫీచర్ కూడా ఉంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains