Poco M8 Power: రెడ్‌మి నోట్ 17 కి రీబ్రాండెడ్ వెర్షన్.. కేవలం ఇండియన్ మార్కెట్ కోసమే ప్రత్యేకంగా పోకో కొత్త ఫోన్

Poco M8 Power Launching in India: పోకో M8 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం భారతీయ మార్కెట్ కోసం మాత్రమే ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

Poco M8 Power: రెడ్‌మి నోట్ 17 కి రీబ్రాండెడ్ వెర్షన్.. కేవలం ఇండియన్ మార్కెట్ కోసమే ప్రత్యేకంగా పోకో కొత్త ఫోన్

Photo Credit: Xiaomi

Poco

ముఖ్యాంశాలు
  • భారత్ లో పోకో కొత్త సంచలనం
  • భారీ 8000 mAh బ్యాటరీతో వస్తున్న 'Poco M8 Power'
  • రెడ్‌మి నోట్ 17 కి రీబ్రాండెడ్ వెర్షన్
ప్రకటన

Poco M8 Power Launching in India: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు పోకో బ్రాండ్ మరో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. భారతీయ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ సరికొత్త మోన్‌స్టర్ బ్యాటరీ మొబైల్‌ను లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది. Poco M8 Power పేరుతో రానున్న ఈ సరికొత్త ఫోన్ కి సంబంధించిన లీకులు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. చైనాలో ఇటీవలే విడుదలైన పాపులర్ స్మార్ట్‌ఫోన్  రెడ్‌మి నోట్ 17కి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ కొత్త పోకో ఫోన్ భారత మార్కెట్లో అడుగుపెట్టనుందని సమాచారం. ముఖ్యంగా ఈ ఫోన్‌లో ఏకంగా 8,000 mAh సామర్థ్యం గల అతి పెద్ద బ్యాటరీని అమర్చబోతుండటం మొబైల్ ప్రియులలో భారీ అంచనాలను పెంచుతోంది.

ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్  కాస్పర్‌ స్క్రైపెక్ లీక్ చేసిన సమాచారం ప్రకారం.. ఈ సరికొత్త పోకో స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచ్ కావడానికి ముందే భారతీయ ప్రమాణాల సంస్థ  బీఐఎస్ సర్టిఫికేషన్ ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. లీకైన రిపోర్ట్ ప్రకారం.. ఈ ఫోన్ మోడల్ నంబర్ 2602IPC8I గా ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఫోన్ ఒరిజినల్ రెడ్‌మి వెర్షన్ కూడా Redmi Note 17 పేరుతో విడిగా భారత మార్కెట్లో విడుదల కానుంది. భారతీయ మార్కెట్ కోసం రానున్న ఈ రెడ్‌మి మోడల్ నంబర్ 26021RN18I గా లీకైంది.

ఈ సిరీస్ లోని బ్యాటరీ విభాగం గురించి ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ బయటకు వచ్చింది. పోకో M8 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం భారతీయ మార్కెట్ కోసం మాత్రమే ప్రత్యేకంగా డిజైన్ చేశారు. గ్లోబల్ మార్కెట్లో ఇది లభించదు. ఇండియాలో విడుదల కాబోయే ఈ పోకో M8 పవర్ ఫోన్ లో 8,000 mAh బ్యాటరీ ఉండగా, గ్లోబల్ మార్కెట్ లోకి రాబోయే రెడ్‌మి నోట్ 17 మోడల్ మాత్రం కాస్త చిన్నదైన 7,700 mAh బ్యాటరీతో రానుంది. ఇదే పద్ధతిలో రాబోయే  Redmi Note 17 Pro ఇండియన్ వేరియంట్ లో ఏకంగా 9,000 mAh భారీ బ్యాటరీ ఉండబోతుండగా, దీని గ్లోబల్ వేరియంట్ మాత్రం 8,340 mAh బ్యాటరీతో రానున్నట్లు లీకుల ద్వారా స్పష్టమవుతోంది.

Hero Vida VX2 Plus : ఈవీ మార్కెట్లోకి హీరో కొత్త బాంబ్.. 187 కి.మీ రేంజ్‌తో విడా VX2 ప్లస్ 4.4 kWh లాంచ్

సాంకేతిక వివరాలు పరిశీలిస్తే.. ఈ సరికొత్త పోకో M8 పవర్ స్మార్ట్‌ఫోన్ లో ఏకంగా 7 ఇంచుల భారీ  FHD+ అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చనున్నారు. విజువల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా ఇందులో శామ్‌సంగ్ కంపెనీ తయారు చేసిన ప్రీమియం డిస్‌ప్లే ప్యానెల్‌ను వాడుతున్నట్లు తెలుస్తోంది. ఇది 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో రానుంది. దీనివల్ల అవుట్‌డోర్ లో ఎండ ఎక్కువగా ఉన్నా సరే స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో క్వాల్కమ్ కంపెనీకి చెందిన  స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 పవర్‌ఫుల్ చిప్‌సెట్‌ను ఉపయోగించబోతున్నారు.

ఫోటోగ్రఫీ పరంగా చూస్తే ఈ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఇవ్వబోతున్నారు. దీని ద్వారా చాలా స్పష్టమైన ఫోటోలు, వీడియోలను క్యాప్చర్ చేయవచ్చు. ఇక ఇంత పెద్ద బ్యాటరీని చాలా వేగంగా ఛార్జ్ చేయడానికి కస్టమర్ల కోసం 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. దీనితో పాటు అత్యవసర సమయాల్లో ఇతర చిన్నపాటి గ్యాడ్జెట్లు లేదా ఇతర స్మార్ట్‌ఫోన్లను ఛార్జ్ చేసుకునేందుకు వీలుగా 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా ఇందులో చేర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ బడ్జెట్ ధరలోనే భారతీయ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉండటంతో, మిడ్-రేంజ్ విభాగంలో ఇది పెద్ద సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »