Hero Vida VX2 Plus with 187 Km Range: ఈ సరికొత్త ఈవీ స్కూటర్ లో ఒక్కొక్కటి 2.2 kWh సామర్థ్యం కలిగిన రెండు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌లను అమర్చారు.
Hero Vida VX2 Plus
Hero Vida VX2 Plus with 187 Km Range: భారతదేశపు అతిపెద్ద టూ-వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ సబ్‌బ్రాండ్ అయిన విడా కింద సరికొత్త ఈవీ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. వినియోగదారులకు మరింత ఎక్కువ రేంజ్ అందించడమే లక్ష్యంగా VIDA VX2 Plus 4.4 kWh కొత్త వేరియంట్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరను దాదాపు రూ.1.43 లక్షలుగా నిర్ణయించారు. అత్యంత శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్, స్మార్ట్ టెక్నాలజీ ఫీచర్లతో వస్తున్న ఈ స్కూటర్ రోజువారీ నగర ప్రయాణాలకే కాకుండా సుదీర్ఘ ప్రయాణాలకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రెండు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌లు..
తాజా మీడియా నివేదికల ప్రకారం.. ఈ సరికొత్త ఈవీ స్కూటర్ లో ఒక్కొక్కటి 2.2 kWh సామర్థ్యం కలిగిన రెండు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌లను అమర్చారు. దీనివల్ల మొత్తం బ్యాటరీ కెపాసిటీ 4.4 kWh గా మారుతుంది. ఈ మెగా బ్యాటరీ సాయంతో సింగిల్ పూర్తి ఛార్జ్‌పై ఐడీసీ సర్టిఫైడ్ రేంజ్ ఏకంగా 187 కిలోమీటర్లు వస్తుందని హీరో మోటోకార్ప్ స్పష్టం చేసింది. ఇకపోతే ఈ స్కూటర్ కొనుగోలుదారులకు 1 kW సామర్థ్యం గల పోర్టబుల్ ఛార్జర్‌ను కూడా కంపెనీ ఉచితంగా అందిస్తుంది. దీని ద్వారా ఇంటి వద్దే కేవలం 3.30 గంటల్లో బ్యాటరీని సున్నా నుంచి 80 శాతానికి సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.
ఫాస్ట్ ఛార్జింగ్‌తో కేవలం గంటలోనే రెడీ..
స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్‌తో వస్తున్న ఈ విడా స్కూటర్ హోమ్ ఛార్జింగ్‌తో పాటు డిసి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫాస్ట్ ఛార్జర్ సాయంతో బ్యాటరీని కేవలం 65 నిమిషాల వ్యవధిలోనే 0 నుంచి 80 శాతం వరకు నింపేయవచ్చు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. ఇందులో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 6 kW పీక్ పవర్, 26 Nm టార్క్‌ను జనరేట్ చేయగలదు. దీనివల్ల ఈ స్కూటర్ సునాయాసంగా గంటకు 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌ను అందుకుంటుంది. ఓవర్‌టేకింగ్ సమయాల్లో త్వరితగతిన వేగం పెంచడానికి ఇందులో ప్రత్యేకంగా బూస్ట్ మోడ్‌ను కూడా చేర్చారు.
Samsung : శాంసంగ్ లవర్స్‌కు పండగే.. త్వరలోనే ఆండ్రాయిడ్ 17 బేస్డ్ One UI 9 సరికొత్త అప్‌డేట్
స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు..
సాంకేతిక పరంగా ఈ స్కూటర్ లో అధునాతన 4.3 ఇంచుల టీఎఫ్‌టీ కలర్ డిస్‌ప్లేను అమర్చారు. ఇది బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. తద్వారా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు స్క్రీన్‌పైనే టర్న్-బై-టర్న్ నేవిగేషన్ చూసుకోవచ్చు. అంతేకాకుండా కారు తరహాలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కోసం ఓవర్-ది-ఎయిర్ ఫీచర్‌ను కూడా అందించారు. మన డ్రైవింగ్ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడానికి ఇందులో ఎకో, రైడ్, స్పోర్ట్ అనే మూడు విభిన్న డ్రైవింగ్ మోడ్స్‌ను కూడా జోడించారు.
BaaS ప్లాన్లతో లక్కీ ఆఫర్..
ఈ సరికొత్త వీడా వీఎక్స్2 ప్లస్ స్కూటర్‌ను కొనుగోలు చేయడానికి కంపెనీ కస్టమర్ల కోసం బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) అనే సరికొత్త స్కీమ్‌ను కూడా పరిచయం చేసింది. దీనివల్ల బ్యాటరీ ధరను మినహాయించి కేవలం స్కూటర్ ధరకు మాత్రమే తక్కువ పెట్టుబడితో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం విడా సంస్థకు దేశవ్యాప్తంగా 6,000 కంటే ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ల బలమైన నెట్‌వర్క్ ఉంది. ఇదిలా ఉండగా, దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో హీరో మోటోకార్ప్ అద్భుతమైన అమ్మకాలతో దూసుకెళ్తోంది. కేవలం జూన్ నెలలోనే రికార్డు స్థాయిలో 21,820 యూనిట్ల స్కూటర్లను విక్రయించి దేశంలోనే నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది ఇదే జూన్ నెలతో పోలిస్తే ఈసారి అమ్మకాలలో ఏకంగా 175 శాతానికి పైగా వృద్ధి నమోదు కావడం విశేషం.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹64,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
Vivo Watch 6 Design Revealed Ahead of September 21 Launch; Confirmed to Come With Titanium Body and BlueOS 4