Photo Credit: Realme
Realme 14 Pro+ 5G బికనెర్ పర్పుల్, పర్ల్ వైట్ మరియు స్వెడ్ గ్రే షేడ్స్‌లో వస్తుంది
మన దేశంలో ఈ ఏడాది జనవరిలో Realme 14 Pro 5Gతో పాటు Realme 14 Pro+ 5G లాంఛ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ 8GB+128GB, 8GB+256GB, 12GB+256GB గల మూడు RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో పరిచయమైంది. తాజాగా, కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ 512GB వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ Realme 14 Pro+ 5G స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ వస్తుంది. అలాగే, తాజా హ్యాండ్‌సెట్‌ను 6,000mAh సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీ, పెరిస్కోప్ షూటర్‌తో సహా 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌తో రూపొందించారు.
Realme 14 Pro+ 5G నుంచి వస్తోన్న కొత్త 12GB + 512GB వేరియంట్ ధర రూ. 37,999గా నిర్ణయించినట్లు కంపెనీ ఓ పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించింది. ఇది పెర్ల్ వైట్, సూడ్ గ్రే కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రానుంది. ఈ కొత్త స్టోరేజ్ ఆప్షన్ మార్చి 6న ఫ్లిప్‌కార్ట్, Realme ఇండియా ఈ-స్టోర్‌తోపాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్స్ ద్వారా మన దేశంలో అమ్మకానికి వస్తోంది. సేల్ మొదటి రోజున వినియోగదారులు రూ. 3,000 తగ్గింపుతో హ్యాండ్‌సెట్‌ను సొంతం చేసుకోవచ్చు.
మన దేశంలో Realme 14 Pro+ 5G ధర 8GB + 128GB వేరియంట్ రూ. 29,999 నుండి ప్రారంభమవుతుంది. అలాగే, 8GB + 256GB, 12GB + 256GB వెర్షన్‌ల ధర వరుసగా రూ. 31,999, రూ. 34,999గా ఉన్నాయి. ఈ ఫోన్ పెర్ల్ వైట్, సూడ్ గ్రే కలర్ ఆప్షన్‌లతో పాటు అదనంగా బికనీర్ పర్పుల్ షేడ్‌లో లభిస్తోంది. ఇది 6.83-అంగుళాల 1.5K (1,272×2,800 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే, 120Hz రిఫ్రెష్ రేట్, 3,840Hz PWM డిమ్మింగ్, 1,500nits పీక్ బ్రైట్‌నెస్ లెవల్‌తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను అందించారు. ఇది Android 15-ఆధారిత Realme UI 6.0తో వస్తోంది.
Realme 14 Pro+ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), f/1.88 ఎపర్చర్‌తో 50-మెగాపిక్సెల్ 1/1.56-అంగుళాల సోనీ IMX896 ప్రైమరీ రియర్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇది 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్, 3x ఆప్టికల్, 6x లాస్‌లెస్ జూమ్ సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 పెరిస్కోప్ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది.
Realme 14 Pro+ 5G ఫోన్ 80W వైర్డు ఫాస్ట్-ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీతో వస్తుంది. సెక్యూరిటీ కోసం, దీనికి ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఈ హ్యాండ్‌సెట్ దుమ్ము, నీటి నియంత్రణకు IP66+IP68+IP69 రేటింగ్‌లను కలిగి ఉంది. ఇది 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS, గ్లోనాస్, బీడౌ, గెలీలియో, QZSS, USB టైప్-C కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది.
ప్రకటన
ప్రకటన