Photo Credit: Amazon
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 స్మార్ట్‌ఫోన్‌లు మరియు ఉపకరణాలపై 40 శాతం వరకు తగ్గింపులను హామీ ఇస్తుంది
మే 1 అర్థరాత్రి 12 గంటల నుంచీ అమెజాన్ ప్రైమ్ సభ్యులకు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 మొదలయ్యింది. ఈ సేల్‌లో వినియోగదారులు బెస్ట్ డీల్స్, డిస్కౌంట్ ఆఫర్‌లను పొందవచ్చు. అనేక రకాల వంటగది వస్తువులతోపాటు అనేక ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ష్యాషన్ డెకర్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. అంతే కాదు, అమెజాన్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఈఎంఐ లావాదేవీలు, క్రెడిట్ కార్డులపై ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది. అలాగే, కూపన్ ఆధారిత తగ్గింపులను కూడా వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు.అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సమయం,ఇప్పటికే, అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మొదలైంది. అయితే, ఈ సేల్ ముగింపు తేదీని మాత్రం ఇప్పటికైతే ప్రకటించలేదు. ప్రైమ్ వినియోగదారు ఎప్పటిలాగే, ముందుగానే సేల్‌లో పాల్గొనవచ్చు. వీరికి మే 1 అర్థరాత్రిని అవకాశం ఉంటుందన్న మాట. మిగిలినవారు సేల్‌లో కొనుగోలు చేసేందుకు ఇప్పటికే అవకాశం వచ్చేసింది. ముగింపు తేదీ వెల్లడికాలేదు కనుక కొనుగోలుదారులు ఈ ఆఫర్ సేల్‌లో ముందస్తుగానే తమకు కావాల్సిన వస్తువులు డిస్కౌంట్ రేట్‌లకు సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
అమెజాన్ తమ ఆఫర్‌లను ఇప్పటికే వెబ్‌సైట్ మైక్రోసైట్ ద్వారా బహిర్గతం చేస్తూ వస్తోంది. ఈ సేల్‌లో ట్యాబ్‌లపై ఏకంగా 60 శాతం వరకూ డిస్కౌంట్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే, స్మార్ట్ ఫోన్‌లు, ఉపకరణాలపై 40 శాతం తగ్గింపు ధరలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 ప్రొజెక్టర్‌లు, స్మార్ట్ టీవీలు, కొన్ని గృహోపకరణాలపై ఏకంగా 65 శాతం వరకూ డిస్కౌంట్ ప్రకటించి కొనుగోలుదారులను మరింత ఆశ్చర్యపరుస్తోంది.
ఏటా నిర్వహించే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో సాధారణ కొనుగోలుదారుల కంటే ముందుగానే పాల్గొనేందుకు ప్రైమ్ సభ్యత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ నెల, మూడు నెలలకు వరుసగా రూ.299, రూ.599 రుసుమును చెల్లించడం ద్వారా సభ్యత్వాన్ని పొందొచ్చు. ఇందులో వార్షిక సభ్యత్వం కూడా ఉంది. ఇందుకోసం రూ.1499 చెల్లించాల్సి ఉంటుంది. కొత్త వినియోగదారులకు నెల రోజుల ఫ్రీ ట్రయల్‌ను సైతం అందుబాటులో ఉంచారు. ఇందులోనే ప్రైమ్ లైట్ ప్లాన్ పొందేందుకు ఏడాదికి రూ.799, ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్‌కు రూ.399 చెల్లించాలి. ప్రైమ్ సభ్యత్వం పొందినవారికి ఉచిత షిప్పింగ్, ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్ యాక్సెస్ ఉంటుంది.
స్మార్ట్ టీవీని తక్కుత ధరకు కొనుగోలు చేయాలనుకునేవారికి అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ గుడ్ న్యూస్ చెప్పింది. స్మార్ట్ టీవీలపై మార్కెట్ వర్గాలు ముందుగానే ఊహించినట్లుగా భారీ డిస్కౌంట్ ఆఫర్‌లను ప్రకటించింది. X
ప్రకటన
ప్రకటన