Photo Credit: Honor
హానర్ 400 అనేది చైనా-ఎక్స్‌క్లూజివ్ హానర్ 300 యొక్క వారసుడు అని భావిస్తున్నారు
ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్న హానర్ 400 త్వరలోనే ప్రో మోడల్‌తోపాటుగా కంపెనీ లైనప్‌లో హానర్ 400 లైట్ జాబితాలో చేరనున్నట్ల వెల్లడించింది. దీని విడుదలకు ముందే, రాబోయే కొత్త మోడల్‌కు సంబంధించిన కీలకమైన స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఇది పూర్తి స్థాయిలో అప్‌గ్రేడ్‌లను పొందనున్నట్లు అంచనా. అలాగే, కొన్ని నివేదికల ప్రకారం.. ఈ మోడల్ 6.55 అంగుళాల 120 హెచ్‌జెడ్ AMOLED స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ఉన్న డ్యూయల్ రియల్ యూనిట్‌ను పొందవచ్చని భావిస్తున్నారు. దీని ధర గతంలో వేసిన అంచనాలను మించి ఉన్నట్లు తెలుస్తోంది.హానర్ 400 అంచనా ధర,YTechB నివేదిక ఆధారంగా, కొత్త హానర్ 400 టాప్ ఎండ్ 512జీబీ స్టోరేజీ వేరియంట్ ధర EUR (సుమారు రూ. 47,000)గా ఉండొచ్చని అంచనా. 256జీబీ కాన్ఫిగరేషన్‌లో కూడా ఈ మోడల్ అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. అయితే, ఈ వేరియంట్ ధరపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. హానర్ 400 బ్లాక్, గోల్డ్, గ్రే కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి రావచ్చు. గతంలో వచ్చని హానర్ 200 మోడల్‌లో ఎక్కువ స్టోరేజీ వేరియంట్ మాదిరిగా ఈ కొత్త మోడల్ ఉంటుంది. హానర్ 200 8జీబీ ర్యామ్+ 512జీబీ స్టోరేజీ వేరియంట్ ధర EUR 468.89 (సుమారు రూ. 45,000)గా ఉంది.
ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్న హానర్ 400 6.55 అంగుళాల వివిడ్ AMOLED స్క్రీన్‌ను 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 5000 నీట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. అలాగే, ప్యానల్ ఫ్రంట్ కెమెరా కోసం హోల్ పంచ్ కటౌట్‌తో రూపొందించారు. ఇది 156.5X 74.6 X 7.3 ఎంఎం పరిమిణంతో 184 గ్రాముల బరువును కలిగి ఉండవచ్చు.8జీబీ ర్యామ్, 512జీబీ వరకూ స్టోరేజీతో అటాచ్ చేయబడి ఉంటుంది.
కొత్త హానర్ 400 మోడల్ అండ్రాయిడ్ 15 ఆధారంగా MagicOS 9.0 తో రన్ కావొచ్చని అంచనా. హానర్ ఏఐ సూట్‌లో గూగుల్ సర్విల్ టు సెర్చ్, జెమిని, ఏఐ సమ్మరీ, ఏఐ సూపర్ జూమ్, ఏఐ పోర్ట్రెయిట్, ఏఐ ఎరేజర్ వంటి ఏఐ ఫీచర్స్‌కు సపోర్ట్ చేస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, 66 W సూపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5300 mAh బ్యాటరీతో రావొచ్చు.
ఈ మోడల్ ఫోన్ కెమెరా విషయనికి వస్తే.. దీనికి డ్యూయల్ రియల్ కెమెరా యూనిట్‌ను అందించవచ్చు. ఇందులో ఎఫ్-1.9 ఎపర్చర్‌తో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా అందించవచ్చని అంచనా. దుమ్ము, నీటి నియంత్రణకు ఐపీ65 రేటెడ్ బిల్డ్‌తో వస్తుందని కూడా అంచనా. ఈ మోడల్ లాంఛ్ తేదీ దగ్గరపడే కొద్దీ, మరిన్ని విషయాలు బహిర్గతం అయ్యే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.
ప్రకటన
ప్రకటన