Massive Discount on Realme P4 Lite in Flipkart: రియల్‌మీ P4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ MRP ధర రూ.36,999గా నిర్ణయించబడింది.
realme P4 Lite 5G
Massive discount on Realme P4 Lite 5G in Flipkart: తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ రోజులు నిలిచే పవర్‌ఫుల్ బ్యాటరీ ఉన్న 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే మీకోసం ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ ఒక అదిరిపోయే వార్త మోసుకొచ్చింది. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ P4 లైట్ 5G మోడల్‌పై భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేలా భారీ తగ్గింపు ధరతో ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయింది. ఏకంగా 7,000mAh సామర్థ్యం గల జంబో బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకు పొందే ఛాన్స్ ఇప్పుడు కస్టమర్ల ముందుకు వచ్చింది.
రూ.36,999 ఫోన్ ఇప్పుడు చాలా చవకగా..
రియల్‌మీ P4 లైట్ 5G స్మార్ట్‌ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ MRP ధర రూ.36,999గా నిర్ణయించబడింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో తాజా సేల్ డిస్కౌంట్ ఆఫర్ కింద దీని ధరను రూ.29,999కే లిస్ట్ చేశారు. అంటే ఎలాంటి ప్రత్యేక బ్యాంక్ కార్డ్‌లు లేకుండానే డైరెక్ట్ డిస్కౌంట్ రూపంలో కస్టమర్లకు ఏకంగా రూ.17,000 కంటే ఎక్కువ ఆదా అయ్యే అవకాశం లభిస్తోంది. పండగ సీజన్ లేదా సమ్మర్ ఆఫర్లతో సంబంధం లేకుండా ఇలాంటి ఆఫర్ రావడం పట్ల టెక్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంక్ ఆఫర్లతో ధర మరింత డౌన్..
డైరెక్ట్ డిస్కౌంట్‌తో పాటు అదనపు బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించుకుంటే ఈ ఫోన్ ధర మరింత తగ్గుతుంది. కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ బ్యాంక్ కార్డ్‌ల ద్వారా చెల్లింపులు జరిపితే రూ.1,000 అదనపు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్లు అన్నింటినీ వర్తింపజేసిన తర్వాత రియల్‌మీ P4 లైట్ 5G ఎఫెక్టివ్ ధర కేవలం రూ.18,999కి చేరుకుంటుంది. పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉండే ఈ ఆఫర్ వివరాల కోసం ఫ్లిప్‌కార్ట్ అధికారిక యాప్‌ను సందర్శించవచ్చు.
Social Media Ban : పిల్లలకు సోషల్ మీడియా బంద్?.. 16 ఏళ్ల లోపు వారికి ఆంక్షలపై కేంద్ర ప్రభుత్వం యోచన
రియల్‌మీ P4 లైట్ 5G అదిరిపోయే ఫీచర్లు..
స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, రియల్‌మీ P4 లైట్ 5G ఫోన్ 6.8 అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ సఫీగా సాగడానికి ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించారు. వేగవంతమైన పెర్ఫార్మెన్స్ కోసం ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రొసెసర్‌ను ఉపయోగించారు. మైక్రోఎస్‌డీ కార్డ్ ద్వారా దీని స్టోరేజ్‌ను ఏకంగా 2TB వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే 7,000mAh బ్యాటరీ ఈ ఫోన్‌కు ప్రధాన ప్లస్ పాయింట్‌గా నిలుస్తోంది.
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ IP64 రేటింగ్..
కెమెరా విభాగంలో రియల్‌మీ P4 లైట్ 5G వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందూ భాగంలో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. ఫోన్ నీటి చుక్కలు మరియు దుమ్ము నుండి పాడవకుండా IP64 రేటింగ్‌తో పాటు మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ అందించే MIL-STD 810H సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, డ్యూయల్ 4G VoLTE, వై-ఫై, బ్లూటూత్ 5.3, హెడ్‌ఫోన్ జాక్ వంటి అన్ని అవసరమైన ఫీచర్లను అందిస్తున్నారు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
IFA 2026: Lenovo Unveiled New IdeaPad, Yoga and ThinkBook Laptops
IFA 2026: Nvidia RTX Spark PCs, Local AI Tools Announced With October Launch Planned
Luna Band Now Available Globally: Check Price in India, Specifications and Features