Social Media ban for Under 16 kids in Inida: పిల్లల సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించడంలో ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
Social Media Ban
Social Media Ban for Under 16 Kids in Inida: గత కొన్ని నెలలుగా చిన్నారులపై సోషల్ మీడియా చూపిస్తున్న దుష్ప్రభావాన్ని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇదే బాటలో భారతదేశం కూడా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌పై ఆంక్షలు విధించే దిశగా తీవ్రంగా ఆలోచిస్తోంది. ఆన్‌లైన్ భద్రత, పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతినడం, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఉండే అడిక్షన్ ఫీచర్లు, హానికరమైన కంటెంట్ వల్ల కలిగే ప్రమాదాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించింది.
అంతర్జాతీయ నిబంధనలను పరిశీలిస్తున్న భారత్..
ఈ అంశంపై ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ మాట్లాడారు. ఇతర దేశాలు సోషల్ మీడియా వినియోగంపై ఎలాంటి చట్టాలు చేశాయో, వాటి ప్రభావం ఎలా ఉందో భారత్ క్షుణ్ణంగా పరిశీలిస్తోందని ఆయన స్పష్టం చేశారు. చిన్నారులకు సోషల్ మీడియా రీల్స్, నోటిఫికేషన్లు అలవాటుగా మారి వారి చదువు, మానసిక సమతుల్యత దెబ్బతింటున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, భారత్‌లో కూడా ఇదే తరహా ప్రమాదాలు ముంచుకొస్తున్నాయని ఆయన వెల్లడించారు.
ఆస్ట్రేలియా, యూఏఈ, బ్రిటన్ బాటలో భారత్..?
పిల్లల సోషల్ మీడియా వినియోగంపై ఆంక్షలు విధించడంలో ఆస్ట్రేలియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది ఆస్ట్రేలియా 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా చట్టం తెచ్చింది. ఆ తర్వాత సంయుక్త అరబ్ ఎమిరేట్స్ (UAE) కూడా 15 ఏళ్ల లోపు పిల్లలపై సోషల్ మీడియా బ్యాన్ విధించింది. ఇటీవల బ్రిటన్ కూడా 16 ఏళ్ల లోపు బాలబాలికలకు సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఐరోపా యూనియన్ (EU) సహా పలు ఇతర దేశాలు కూడా ఇదే తరహా నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లకు నో ఎంట్రీ..?
ఈ ప్రతిపాదిత నిషేధం అమల్లోకి వస్తే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్‌టాక్, స్నాప్‌చాట్, ఎక్స్ వంటి ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు 16 ఏళ్ల లోపు పిల్లలకు లభించవు. అయితే, నేరుగా సమాచారం చేరవేసే ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌లైన వాట్సాప్, సిగ్నల్ వంటి వాటికి ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది.
పార్లమెంటరీ కమిటీల్లోనూ తీవ్ర చర్చ..
భారతదేశంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలతో పాటు వివిధ వర్గాల నిపుణులు, విద్యావేత్తలు, సైకాలజిస్టులు సోషల్ మీడియా వల్ల పిల్లలకు కలుగుతున్న ముప్పుపై సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని, భాగస్వాములందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే ప్రపంచ ట్రెండ్‌కు అనుగుణంగా తగిన చర్యలు ఉంటాయని ఎస్ కృష్ణన్ వివరించారు.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
IFA 2026: Lenovo Unveiled New IdeaPad, Yoga and ThinkBook Laptops
IFA 2026: Nvidia RTX Spark PCs, Local AI Tools Announced With October Launch Planned
Luna Band Now Available Globally: Check Price in India, Specifications and Features