Redmi K100 Pro Series  : ఏకంగా 9000 mAh బ్యాటరీ, 200MP కెమెరా.. షావోమి నుంచి నెక్స్ట్ లెవెల్ స్మార్ట్‌ఫోన్లు

ప్రారంభంలో కంపెనీ రెడ్‌మి K100 ప్రో, రెడ్‌మి K100 ప్రో మాక్స్ మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ఆ తర్వాత కొద్దిరోజులకు కే100 స్టాండర్డ్ మోడల్‌ను విడుదల చేయనున్నారు.

Redmi K100 Pro Series  : ఏకంగా 9000 mAh బ్యాటరీ, 200MP కెమెరా.. షావోమి నుంచి నెక్స్ట్ లెవెల్ స్మార్ట్‌ఫోన్లు

Redmi K100 Pro Series 

ముఖ్యాంశాలు
  • షావోమి నుంచి నెక్స్ట్ లెవెల్ స్మార్ట్‌ఫోన్లు
  • ఏకంగా 9000 mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వస్తున్న రెడ్‌మి K100 ప్రో
  • మార్కెట్‌లోకి రెడ్‌మి కే100 ప్రో సిరీస్ రాక ఖరారు
ప్రకటన


Redmi K100 Pro Series  :  చైనీస్ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్‌మి తన మోస్ట్ ఎవైటెడ్ రెడ్‌మి కే100 ప్రో సిరీస్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మైక్రోబ్లాగింగ్ వేదిక వీబోలో చేసిన ప్రకటన ప్రకారం.. ఈ సిరీస్ ఆగస్టు 11న చైనాలో అధికారికంగా విడుదల కానుంది. గత ఏడాది విడుదలైన రెడ్‌మి K90 సిరీస్‌కు కొనసాగింపుగా ఇది రాబోతోంది. ప్రారంభంలో కంపెనీ రెడ్‌మి K100 ప్రో,  రెడ్‌మి K100 ప్రో మాక్స్ మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ఆ తర్వాత కొద్దిరోజులకు కే100 స్టాండర్డ్ మోడల్‌ను విడుదల చేయనున్నారు. ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే యూజర్ల కోసం దీనిని డిజైన్ చేసినట్లు షావోమి ప్రెసిడెంట్ లు వీబింగ్ స్పష్టం చేశారు.

ప్రీమియం డిజైన్,  బోస్ సౌండ్ సిస్టమ్ 
రెడ్‌మి K100 ప్రో మాక్స్ మోడల్ డిజైన్‌ను కంపెనీ ఇప్పటికే టీజ్ చేసింది. ఇది ఆకర్షణీయమైన కేబర్నెట్ రెడ్ కలర్‌లో రానుంది. ఈ ఫోన్‌కు మ్యాచింగ్ మెటల్ ఫ్రేమ్‌ను అందించారు. ఇందులో భారీ 6.9 ఇంచుల ఎల్టీపీఓ ఫ్లాట్ OLED స్క్రీన్‌ను అమర్చారు, ఇది ఏకంగా 185Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. వెనుక వైపు ప్రీమియం ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోసం సౌండ్ బై బోస్ బ్రాండింగ్‌ను అందించారు. దీనితో పాటు సిమెట్రికల్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, రక్షణ కోసం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు.

పవర్‌ఫుల్ ప్రాసెసర్, గ్లోబల్ రీబ్రాండింగ్ 
పర్ఫార్మెన్స్ పరంగా ఈ సిరీస్‌లో అత్యంత పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు సమాచారం. గ్లోబల్ మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లు పోకో బ్రాండింగ్‌తో రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో రెడ్‌మి కే100 ప్రో ఫోన్‌ను పోకో ఎఫ్‌9 ప్రోగా, రెడ్‌మి కే100 ప్రో మాక్స్‌ను పోకో ఎఫ్‌9 అల్ట్రాగా ల్యాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

HMD Pulse 2 Series : 5000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. గ్రాండ్ లాంచ్‌కు సిద్ధమవుతున్న హెచ్‌ఎమ్‌డీ పల్స్ 2 సిరీస్

200 మెగాపిక్సెల్ కెమెరా,  ఏకంగా 9000 mAh బ్యాటరీ 
కెమెరా విభాగానికి వస్తే.. ఈ ఫోన్లలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించనున్నారు. దీనికి తోడు రెడ్‌మి కే100 ప్రో వెనుక కెమెరా సెటప్‌లో 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా కూడా ఉంటుంది. బ్యాటరీ విభాగంలో రెడ్‌మి సంచలనం సృష్టించబోతోంది. ఈ సిరీస్ స్టాండర్డ్ మోడల్‌లో 8,500 mAh బ్యాటరీ ఉండగా, ప్రొ మాక్స్ మోడల్‌లో ఏకంగా 9,000 mAh భారీ బ్యాటరీని అమర్చనున్నారు. ఇవి 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఇటీవల కంపెనీ 6.83 ఇంచుల పిక్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లేతో K90 అల్ట్రాను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. Redmi K100 Pro Series  : ఏకంగా 9000 mAh బ్యాటరీ, 200MP కెమెరా.. షావోమి నుంచి నెక్స్ట్ లెవెల్ స్మార్ట్‌ఫోన్లు
  2. iQOO Z11 : ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయినా పర్లేదు.. ఐకూ Z11 ల్యాంచ్ డేట్ మీద క్లారిటీ వచ్చేసింది
  3. Samsung Galaxy : ఇక ఏ వస్తువు పోయినా ఈజీగా దొరికేస్తుంది..శాంసంగ్ నుంచి నెక్స్ట్ లెవెల్ ట్రాకర్
  4. Apple : యాపిల్ సేల్స్ సునామీ.. ఏకంగా 10.43 లక్షల కోట్ల ఆదాయంతో సరికొత్త రికార్డు
  5. ITR Filing : ఐటీఆర్ ప్రాసెస్ చాలా సింపుల్.. కొన్ని నిమిషాల్లోనే ఆన్‌లైన్‌లో పూర్త్యయ్యేలా ఈజీ స్టెప్స్ ఇవే
  6. FASTag : ఇక టోల్ గేట్ల దగ్గర ఆగక్కర్లేదు.. ఫాస్ట్‌ట్యాగ్‌లో కొత్త టెక్నాలజీ.. కేంద్రం బిగ్ ప్లాన్
  7. Google Play Store : గూగుల్ ప్లే స్టోర్‌ రూల్స్ మారాయి.. ఇకపై ఏ యాప్ వాడాలన్నా ఏజ్ వెరిఫికేషన్ తప్పనిసరి
  8. Samsung Galaxy F70 Pro 5G : 6000 mAh బ్యాటరీ, 50MP కెమెరా.. ఆగస్టు 3న శాంసంగ్ నుంచి ఊరమాస్ 5G ఫోన్
  9. HMD Pulse 2 Series : 5000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. గ్రాండ్ లాంచ్‌కు సిద్ధమవుతున్న హెచ్‌ఎమ్‌డీ పల్స్ 2 సిరీస్
  10. Oppo K13 Turbo Pro 5G: ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో K13 టర్బో ప్రో 5G పై ఊహించని డిస్కౌంట్.. ఏకంగా రూ. 12,000 కంటే ఎక్కువ ఆదా
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »