హెచ్‌ఎమ్‌డీ పల్స్ 2, పల్స్ 2 ప్లస్ మోడళ్లలో 6.67-ఇంచుల HD+ IPS LCD డిస్‌ప్లేను అందించనున్నారు. ఇది స్మూత్ స్క్రోలింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది.
HMD Pulse 2, Pulse 2 Plus, Pulse 2 Pro
HMD Pulse 2 Series : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హెచ్‌ఎమ్‌డీ తన తదుపరి పల్స్ సిరీస్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సన్నాహాలు వేగవంతం చేసింది. హెచ్‌ఎమ్‌డీ పల్స్ 2 పేరుతో రాబోతున్న ఈ సిరీస్‌లో కంపెనీ ఒకేసారి మూడు మోడళ్లను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో హెచ్‌ఎమ్‌డీ పల్స్ 2, హెచ్‌ఎమ్‌డీ పల్స్ 2 ప్లస్, హెచ్‌ఎమ్‌డీ పల్స్ 2 ప్రో మోడళ్లు ఉండే అవకాశం ఉంది. అధికారిక ప్రకటనకు ముందే ప్యాషనేట్‌గీక్స్ ద్వారా ఈ ఫోన్ల కీలక స్పెసిఫికేషన్లు, డిజైన్ వివరాలు ఆన్‌లైన్ వేదికగా లీక్ అయ్యాయి.
హెచ్‌ఎమ్‌డీ పల్స్ 2, పల్స్ 2 ప్లస్ డిస్‌ప్లే అండ్ ప్రాసెసర్
లీక్ అయిన నివేదికల ప్రకారం.. హెచ్‌ఎమ్‌డీ పల్స్ 2, పల్స్ 2 ప్లస్ మోడళ్లలో 6.67-ఇంచుల HD+ IPS LCD డిస్‌ప్లేను అందించనున్నారు. ఇది స్మూత్ స్క్రోలింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ రెండూ పవర్‌ఫుల్ యూనిసోక్ T615 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. ఇవి 6GB వరకు రామ్, 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లలో లభించనున్నాయి. రంగుల విషయానికి వస్తే పల్స్ 2 బ్లాక్, బ్లూ రంగుల్లో.. పల్స్ 2 ప్లస్ మోడల్ ఆప్రికాట్, డార్క్ బ్లూ రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది.
కెమెరా, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ వివరాలు
కెమెరా విభాగానికి వస్తే.. ఈ రెండు ఫోన్ల వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అయితే సెల్ఫీ కెమెరా విషయంలో వ్యత్యాసం ఉంది. స్టాండర్డ్ పల్స్ 2 మోడల్‌లో 8MP ఫ్రంట్ కెమెరా ఉండగా, పల్స్ 2 ప్లస్ మోడల్‌లో 13MP సెల్ఫీ కెమెరాను అందించారు. రోజంతా నిరంతరాయంగా పనిచేసేందుకు ఈ రెండు ఫోన్లలో 5000mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇది 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
Oppo K13 Turbo Pro 5G: ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో K13 టర్బో ప్రో 5G పై ఊహించని డిస్కౌంట్.. ఏకంగా రూ. 12,000 కంటే ఎక్కువ ఆదా
హెచ్‌ఎమ్‌డీ పల్స్ 2 ప్రో మోడల్ ప్రత్యేకతలు
ఈ సిరీస్‌లో టాప్ మోడల్‌గా రాబోతున్న హెచ్‌ఎమ్‌డీ పల్స్ 2 ప్రో లో 6.72-ఇంచుల HD+ పెద్ద డిస్‌ప్లే ఉండనుంది. ఇది కూడా యూనిసోక్ T615 చిప్‌సెట్‌తోనే పనిచేస్తుంది, కానీ ఇందులో 8GB వరకు రామ్, 256GB వరకు UFS 2.1 వేగవంతమైన స్టోరేజ్ లభిస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరాతో పాటు 8MP సెకండరీ సెన్సార్‌ను ఇచ్చారు. సెల్ఫీ ప్రియుల కోసం ముందు భాగంలో కూడా ఏకంగా 50MP హై-రిజల్యూషన్ ఫ్రంట్ కెమెరాను అందించడం విశేషం.
కలర్ వేరియంట్లు, బ్యాటరీ కెపాసిటీ
హెచ్‌ఎమ్‌డీ పల్స్ 2 ప్రో మోడల్‌లో కూడా మిగిలిన ఫోన్లలాగే 5000mAh బ్యాటరీ, 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వనున్నారు. ఈ ప్రీమియమ్ మోడల్‌ను మిడ్‌నైట్ బ్లాక్, గ్లేసియర్ గ్రీన్, ట్విలైట్ పర్పుల్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో కస్టమర్ల ముందుకు తీసుకురానున్నారు. బడ్జెట్ ధరకు తోడు ఆకట్టుకునే ఫీచర్లు ఉండటంతో ఈ సిరీస్ కస్టమర్లలో భారీ అంచనాలను పెంచేసింది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy S26 FE Camera Specifications Leaked Ahead of Expected Launch, May Reuse Its Predecessor's Main Rear Camera