సాధారణంగా ఈ కోడ్‌నేమ్ రెడ్‌మి కంపెనీకి చెందిన K-సిరీస్ మోడళ్లకు సంబంధించి ఉపయోగిస్తుంటారు.
Photo Credit: Redmi
Redmi K100 Series
Redmi K100 Series : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ షామీ సబ్‌బ్రాండ్ రెడ్‌మి నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ త్వరలోనే వినియోగదారుల ముందుకు రాబోతోంది. రెడ్‌మి K100 పేరుతో రానున్న ఈ కొత్త సిరీస్‌లో మొత్తం మూడు పవర్‌ఫుల్ మోడళ్లు ఉండే అవకాశం ఉంది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వేబోలో షామీ పార్ట్‌నర్, ప్రెసిడెంట్ లు వీబింగ్ చేసిన తాజా పోస్ట్ ద్వారా ఈ వివరాలు బయటకు వచ్చాయి. చైనాలో జూలై 31 నుంచి ప్రారంభమయ్యే చైనాజాయ్ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పోలో రెడ్‌మి అధికారికంగా పాల్గొననుంది. ఈ ఈవెంట్‌లోనే గేమింగ్ లవర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక కొత్త ప్రాడక్ట్‌ను కంపెనీ లాంచ్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.
డెమోన్ కింగ్ కోడ్‌నేమ్‌తో గేమింగ్ స్మార్ట్‌ఫోన్
లు వీబింగ్ పంచుకున్న పోస్ట్‌లో గేమింగ్ ఫీచర్లతో కూడిన ఒక స్మార్ట్‌ఫోన్ ఇమేజ్‌ను ప్రదర్శించారు. దానికి డెమోన్ కింగ్ అనే కోడ్‌నేమ్‌ను కేటాయించారు. సాధారణంగా ఈ కోడ్‌నేమ్ రెడ్‌మి కంపెనీకి చెందిన K-సిరీస్ మోడళ్లకు సంబంధించి ఉపయోగిస్తుంటారు. దీంతో చైనాజాయ్ ఈవెంట్‌లోనే రెడ్‌మి K100 సిరీస్ గ్రాండ్ లాంచ్ కానుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ నయా సిరీస్‌లో బేస్ మోడల్ రెడ్‌మి K100తో పాటు రెడ్‌మి K100 ప్రో, రెడ్‌మి K100 ప్రో మాక్స్ అనే మోడళ్లు ఉండే అవకాశం ఉంది.
185Hz డిస్‌ప్లే.. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రొసెసర్
రెడ్‌మి K100 సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో అత్యంత వేగవంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రొసెసర్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు అత్యంత స్మూత్ అనుభూతిని అందించేందుకు ఏకంగా 185Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన LTPO ఫ్లాట్ డిస్‌ప్లేను అందించనున్నారు. ఇక ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం ఈ సిరీస్‌లోని ప్రైమరీ కెమెరాను ఏకంగా 200 మెగాపిక్సెల్ కెపాసిటీతో డిజైన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే K100 ప్రో మోడల్ రియర్ కెమెరా సెటప్‌లో 50MP పేరిస్కోప్ టెలిఫోటో కెమెరా, మైండ్ బ్లాంక్ సౌండ్ కోసం సిమెట్రికల్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండనున్నాయి.
OnePlus N6x : రెండు రోజులు ఛార్జింగ్ టెన్షన్ లేదు.. 7000mAh బ్యాటరీతో వస్తున్న OnePlus N6x
9,000mAh భారీ బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఈ ఫోన్లలో బ్యాటరీ కెపాసిటీ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉండనుంది. బేస్ మోడల్ రెడ్‌మి K100 లో 8,500 mAh బ్యాటరీ ఉండగా, టాప్ మోడల్ K100 ప్రో మాక్స్ లో ఏకంగా 9,000 mAh భారీ బ్యాటరీని అందించనున్నారు. అంతేకాకుండా ఇవి 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఇటీవల కంపెనీ లాంచ్ చేసిన రెడ్‌మి K90 అల్ట్రాలో 6.83-ఇంచుల 1.5K AMOLED డిస్‌ప్లే (165Hz రిఫ్రెష్ రేట్, 3500 నిట్స్ బ్రైట్‌నెస్), స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, D2 AI గేమింగ్ గ్రాఫిక్స్ చిప్, ఫోన్ వేడెక్కకుండా ఆక్టివ్ కూలింగ్ ఫ్యాన్ వంటి ఫీచర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాబోతున్న K100 సిరీస్ అంతకుమించిన పర్ఫార్మెన్స్‌తో మార్కెట్‌ను ఊపేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,590
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹41,061
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999