రెడ్‌మి నోట్ 15 5G ఫోన్ కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది. గతంలో రూ.24,999కి లభించిన 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర ఇప్పుడు రూ.26,999కి చేరింది.
Redmi 15 5G was launched in India in August 2025
Xiaomi : భారతదేశంలో బడ్జెట్, మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రెడ్‌మి ఫోన్ల ధరలు ఒక్కసారిగా ప్రియమయ్యాయి. ప్రముఖ చైనా మొబైల్ దిగ్గజం షావోమికి చెందిన సబ్-బ్రాండ్ రెడ్‌మి.. తమ లేటెస్ట్ మోడల్స్ అయిన రెడ్‌మి నోట్ 15 5G, రెడ్‌మి 15 5Gల ధరలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ టిప్‌స్టర్ సంజూ చౌదరి సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల పై కంపెనీ ఏకంగా రూ. 2,000 వరకు ధరలను పెంచింది. ఈ పెరిగిన కొత్త ధరలు ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ అమలులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మెమొరీ చిప్‌ల కొరత, మారుతున్న మార్కెట్ పరిస్థితుల వల్లే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రెడ్‌మి నోట్ 15 5G కొత్త ధరల లెక్కలు ఇవే
ఈ తాజా ధరల పెంపుతో రెడ్‌మి నోట్ 15 5G ఫోన్ కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది. గతంలో రూ.24,999కి లభించిన 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర ఇప్పుడు రూ.26,999కి చేరింది. అలాగే, దీని టాప్ ఎండ్ మోడల్ అయిన 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999 నుంచి ఏకంగా రూ. 29,999 కి ఎగబాకింది. నిజానికి ఈ ఫోన్ లాంచ్ అయినప్పటి ధరలతో పోలిస్తే.. ఇప్పటివరకు మొత్తంగా రూ.4,000 నుంచి రూ. 5,000 వరకు రేట్లు పెరగడం గమనార్హం.
Oppo A6c 4G : గెలాక్సీ, రెడ్‌మిలకు పోటీగా 7,000mAh బ్యాటరీతో ఒప్పో A6c లాంచ్
రెడ్‌మి 15 5G పై కూడా బాదుడు.. మూడు వేరియంట్లూ కాస్ట్లీ
మరోవైపు, బడ్జెట్ శ్రేణిలో ఉన్న రెడ్‌మి 15 5G ఫోన్ ధరలను కూడా కంపెనీ రూ.2,000 మేర పెంచేసింది. దీని ప్రకారం:
* 6GB + 128GB వేరియంట్: పాత ధర రూ. 18,499 నుంచి ఇప్పుడు రూ. 20,499 కి చేరింది.
* 8GB + 128GB వేరియంట్: పాత ధర రూ. 20,499 నుంచి ఇప్పుడు రూ. 22,499 కి పెరిగింది.
* 8GB + 256GB వేరియంట్: పాత ధర రూ. 22,499 నుంచి ఇప్పుడు రూ. 24,499 కి మార్చబడింది.
ఈ ఫోన్ల ధరలు పెరగడం మునుపటి కొన్ని నెలల్లో ఇది రెండవసారి కావడం విశేషం. ఏప్రిల్ నెలలో కూడా ఈ రెండు మోడళ్లపై కంపెనీ రేట్లు పెంచింది.
ప్రకటన
ప్రకటన
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹44,652
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹37,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹37,999
Haier M70 Mini LED 65-inch
Starts from ₹74,990
CMF Buds Neo True Wireless Stereo (TWS) Earphones
Starts from ₹2,199
Xiaomi TV FX Mini LED 65
Starts from ₹64,999
iPhone 18 Pro Series’ A20 Pro Chipset Appears on Multiple Benchmarking Platforms Showing Performance Gains