Redmi Note 17 : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సునామీ.. 8,000mAh బ్యాటరీతో వస్తున్న రెడ్‌మీ నోట్ 17

రెడ్‌మీ నోట్ 17 6 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.30,000 గా ఉండవచ్చని, అలాగే 8 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,000 వరకు ఉండే అవకాశం ఉంది.

Redmi Note 17 :  స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సునామీ.. 8,000mAh బ్యాటరీతో వస్తున్న రెడ్‌మీ నోట్ 17

Photo Credit: Redmi

Redmi Note 17

ముఖ్యాంశాలు
  • త్వరలోనే భారత్‌లోకి రెడ్‌మీ నోట్ 17 గ్రాండ్ ఎంట్రీ
  • 8,000mAh బ్యాటరీతో వస్తున్న రెడ్‌మీ నోట్ 17
  • ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో త్వరలో ఇండియాలో లాంచ్
ప్రకటన

Redmi Note 17 :  ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్‌మీ భారత మార్కెట్లోకి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 17ను లాంచ్ చేయడానికి వేగంగా సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ రెడ్‌మీ ఇండియా తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఒక టీజర్ వీడియోను విడుదల చేసింది. ఈ టీజర్‌లో ఫోన్ రియర్ డిజైన్ కనిపించింది. ఇందులో రెక్టాంగ్యులర్ కెమెరా మోడ్యూల్‌ను అందించారు. ఇటీవల చైనాలో విడుదలైన ఈ ఫోన్ త్వరలోనే భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

అంచనా ధర, లాంచ్ తేదీ
ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ ఆగస్టు 6న భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశముంది. రెడ్‌మీ నోట్ 17 6 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.30,000 గా ఉండవచ్చని, అలాగే 8 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 33,000 వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, భారతీయ వేరియంట్ ఫీచర్లలో చైనీస్ వర్షన్‌తో పోలిస్తే కొన్ని చిన్నపాటి మార్పులు ఉండవచ్చు.

పవర్‌ఫుల్ ప్రాసెసర్, బెంచ్‌మార్క్ స్కోర్లు
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు అడ్రెనో జీపీయూను ఉపయోగించారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత షియోమీ హైపర్‌ఓఎస్ 3 పై పనిచేస్తుంది. బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్ గీక్‌బెంచ్ టెస్టింగ్‌లో ఈ ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్‌లో 950 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్‌లో 2,324 పాయింట్ల అద్భుతమైన స్కోర్‌ను సాధించి తన పవర్ ఏంటో చూపించింది.

Oppo A7 Pro Max : పవర్ బ్యాంక్‌లకు శాశ్వతంగా గుడ్ బై.. ఒప్పో కొత్త ఫోన్ చూస్తే షాక్ అవ్వడం ఖాయం

డిస్‌ప్లే, కెమెరా సెటప్
ఇటీవల చైనాలో విడుదలైన వివరాల ప్రకారం.. ఇందులో 7 అంగుళాల ఫుల్ HD+ (1080x2396 పిక్సెల్స్) ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. కెమెరా విభాగం విషయానికొస్తే.. వెనుక వైపు LED ఫ్లాష్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను, ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ ద్వారా 1080p/30 fps వరకు వీడియోలను రికార్డ్ చేయవచ్చు.

8,000mAh జంబో బ్యాటరీ, భద్రత
రెడ్‌మీ నోట్ 17 ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ. ఇందులో ఏకంగా 8,000 mAh కెపాసిటీ గల భారీ బ్యాటరీని అందించారు. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంది. చైనాలో ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 17 ప్రో కూడా లాంచ్ అయినప్పటికీ ఆ ప్రో మోడల్ భారత్‌లోకి ఎప్పుడు వస్తుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.
 

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »