Redmi Note 17 Pro : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మి సంచలనం.. ఏకంగా 9000mAh బ్యాటరీతో వస్తున్న నోట్ 17 ప్రో

రెడ్‌మి నోట్ 17 ప్రో మొబైల్‌లో అత్యంత స్పష్టత గల 1.5K హై-రిజల్యూషన్ డిస్‌ప్లేను అందించనున్నారు.

Redmi Note 17 Pro : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మి సంచలనం.. ఏకంగా 9000mAh బ్యాటరీతో వస్తున్న నోట్ 17 ప్రో

Photo Credit: Redmi

Redmi Note 17 Pro

ముఖ్యాంశాలు
  • స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెడ్‌మి సంచలనం
  • ఏకంగా 9000mAh బ్యాటరీతో వస్తున్న నోట్ 17 ప్రో
  • ఈ నెల 14నే గ్రాండ్ ఎంట్రీ
ప్రకటన

Redmi Note 17 Pro : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్‌మి గ్లోబల్ మార్కెట్లో సరికొత్త రికార్డులు సృష్టించడానికి సిద్ధమైంది. తన పాపులర్ నోట్ సిరీస్‌లో భాగంగా  రెడ్‌మి నోట్ 17 సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ సిరీస్ కింద రెడ్‌మి నోట్ 17, రెడ్‌మి నోట్ 17 ప్రో అనే రెండు మోడల్స్ రానున్నాయి. వీటిలో నోట్ 17 ప్రో మోడల్‌పై ప్రస్తుతం టెక్ ప్రపంచంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అధికారికంగా ఈ నెల 14వ తేదీన చైనా మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. లాంచ్‌కు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన అత్యంత శక్తివంతమైన ఫీచర్లు సోషల్ మీడియాలో లీకై హల్‌చల్ చేస్తున్నాయి.

మార్బుల్‌పై పడినా పగలని డిస్‌ప్లే 
లీకైన వివరాల ప్రకారం, రెడ్‌మి నోట్ 17 ప్రో మొబైల్‌లో అత్యంత స్పష్టత గల 1.5K హై-రిజల్యూషన్ డిస్‌ప్లేను అందించనున్నారు. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా ఇందులో 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఫీచర్ ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా, ఈ డిస్‌ప్లేకు రక్షణగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. ఇది ఫైవ్-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తోంది. ఫోన్ పొరపాటున 3 మీటర్ల ఎత్తు నుంచి గట్టి మార్బుల్ ఫ్లోర్‌పై పడినా కూడా స్క్రీన్ పగలదని కంపెనీ చాలా నమ్మకంగా చెప్తోంది.

బ్యాటరీ తగ్గితే ఫ్రీగా 10,000mAh బ్యాటరీ 
ఈ స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద హైలైట్ దీని బ్యాటరీ సామర్థ్యమే. ఈ ఫోన్‌లో ఏకంగా 9000mAh భారీ బ్యాటరీని అమర్చారు. షియోమికి చెందిన ప్రత్యేక జిన్షాజియాంగ్ బ్యాటరీ టెక్నాలజీతో ఇది వస్తోంది. ఈ సెగ్మెంట్లోనే ఇంత పెద్ద బ్యాటరీ ఉన్న ఏకైక ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ బ్యాటరీకి TUV SUD సంస్థ నుంచి ఫైవ్-స్టార్ క్వాలిటీ సర్టిఫికేషన్ కూడా లభించింది. దీనికి తోడు 67W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మొదటి సేల్‌లో ఈ ఫోన్ కొనేవారికి కంపెనీ 5 ఏళ్ల బ్యాటరీ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌ను ఇస్తోంది. మొదటి 4 ఏళ్లలో బ్యాటరీ హెల్త్ 80 శాతం కంటే తగ్గితే, కంపెనీ ఉచితంగా పాత బ్యాటరీ స్థానంలో ఏకంగా 10,000mAh కొత్త బ్యాటరీని మార్చి ఇస్తుంది.

Digital Arrest : అసలు ఏంటి ఈ డిజిటల్ అరెస్ట్ స్కామ్? నాలుగేళ్లలో రూ.4,000 కోట్లకు పైగా స్వాహా

 4 రకాల ఐపీ రేటింగ్స్, పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ 
మన్నిక విషయంలో కూడా ఈ ఫోన్ రారాజు అనిపించుకోనుంది. ఎందుకంటే ఇందులో IP66, IP68, IP69, IP69K వంటి నాలుగు రకాల వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ఏకంగా 2 మీటర్ల లోతు నీటిలో దాదాపు 72 గంటల పాటు ఉన్నా కూడా పాడవదని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. పర్ఫార్మెన్స్ కోసం ఇందులో క్వాల్కమ్ కంపెనీకి చెందిన పవర్‌ఫుల్  స్నాప్‌డ్రాగన్ 6 సిరీస్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. వినోదం కోసం ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అమర్చారు. లాంచ్ తేదీకి ఇంకా కొన్ని రోజులే సమయం ఉండటంతో, ఈ ఫోన్ ధర, కెమెరా వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.

ప్రకటన

ప్రకటన

#తాజా కథనాలు
  1. 80th Independence Day: 80వ స్వాతంత్ర్య వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల పండగ.. ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలంటే?
  2. iphone Ultra Launch: యాపిల్ ప్రేమికులకు బిగ్ సర్ ప్రైజ్.. మార్కెట్లోకి ఫస్ట్ మడత ఐఫోన్
  3. iQOO 16: ఐకూ లవర్స్‌కు మైండ్ బ్లాకింగ్ న్యూస్.. 8,500 mAh బ్యాటరీతో ఐకూ 16..కళ్లు చెదిరే ఫీచర్లు
  4. Vivo X500 Pro Max: వివో లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వివో X500 ఫ్లాగ్‌షిప్ సిరీస్ రాక
  5. iQOO Buds: ఐకూ లవర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 20న మార్కెట్లోకి అదిరిపోయే బడ్స్
  6. Oppo Find X9s: ఒప్పో ఫైండ్ X9s పై ఏకంగా రూ.60,000 తగ్గిన ధర.. భారీ డిస్కౌంట్ ఆఫర్ చూస్తే షాకే
  7. BSNL: ప్రైవేట్ సంస్థలకు షాకిచ్చేలా బీఎస్ఎన్ఎల్ మాస్టర్ ప్లాన్.. రూ.77,000 కోట్ల పెట్టుబడితో 5జీ సేవలు
  8. iQOO Neo 11 Ultra: ఐకూ నుంచి పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్..9100mAh బ్యాటరీ.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే
  9. Google Pixel 11 Pro xl vs Vivo x300 Ultra vs Samsung Galaxy s26 Ultra: ఏది కొనడం బెస్ట్ ?
  10. Tecno Pova 8 Pro 5G: బ్యాక్ సైడ్ క్రేజీ డిస్‌ప్లే.. 6500mAh భారీ బ్యాటరీతో టెక్నో కొత్త 5జీ ఫోన్ రచ్చ
© Copyright Red Pixels Ventures Limited 2026. All rights reserved.
Trending Products »
Latest Tech News »