ఈ సిరీస్ అధికారికంగా లాంచ్ కాకముందే, దీనికి సంబంధించిన కీలకమైన స్పెసిఫికేషన్లు ఇంటర్నెట్‌లో లీకై హల్‌చల్ చేస్తున్నాయి.
Photo Credit: Xiaomi
Redmi Note 15
Redmi Note 17 : మొబైల్ మార్కెట్లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Redmi Note 17 సిరీస్ లాంచ్ డేట్ టైమ్‌లైన్ అధికారికంగా ఖరారైంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి తన సబ్‌బ్రాండ్ రెడ్‌మి నుంచి ఈ సరికొత్త సిరీస్‌ను ఈ జూలై నెలలోనే చైనా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. మార్కెట్లో సూపర్ హిట్ అయిన రెడ్‌మి నోట్ 15 సిరీస్‌కు సక్సెసర్‌గా ఈ సరికొత్త ఫోన్లు వస్తున్నాయి. ఈ సిరీస్ కింద కంపెనీ మూడు అద్భుతమైన మిడ్‌రేంజ్ మోడల్స్‌ను తీసుకురానుంది. ఇందులో బేస్ మోడల్ రెడ్‌మి నోట్ 17తో పాటు రెడ్‌మి నోట్ 17 ప్రో, ప్రీమియం మోడల్ అయిన రెడ్‌మి నోట్ 17 ప్రో మాక్స్ అనే వేరియంట్లు ఉన్నాయి.
రెడ్‌మి నోట్ 17 ప్రో మాక్స్ ఫీచర్లు లీక్
ఈ సిరీస్ అధికారికంగా లాంచ్ కాకముందే, దీనికి సంబంధించిన కీలకమైన స్పెసిఫికేషన్లు ఇంటర్నెట్‌లో లీకై హల్‌చల్ చేస్తున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ ఎక్స్‌పీరియన్స్ మోర్ వీబో వేదికగా ఈ సిరీస్ వివరాలను బయటపెట్టారు. ఈ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మోడల్ రెడ్‌మి నోట్ 17 ప్రో మాక్స్. లీకైన సమాచారం ప్రకారం.. ఈ టాప్-ఎండ్ వేరియంట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7500 పవర్‌ఫుల్ చిప్‌సెట్ ఉండనుంది. దీనితో పాటు ఫొటోగ్రఫీ కోసం ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించనున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా, ఈ ఫోన్‌లో ఊహకందని విధంగా 10,100mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీ, దానికి సపోర్ట్ చేసేలా 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ రానున్నట్లు తెలుస్తోంది.
రెడ్‌మి నోట్ 17 ప్రో, స్టాండర్డ్ మోడల్ స్పెసిఫికేషన్లు
ఇక ఈ సిరీస్‌లోని మిగిలిన రెండు మోడల్స్ కూడా తక్కువ తినలేదు. మిడిల్ వేరియంట్ అయిన Redmi Note 17 Pro ఫోన్ 1.5K రిజల్యూషన్ కలిగిన ఫ్లాట్ డిస్‌ప్లేతో రానుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నారు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు, ఈ మోడల్‌లో 9,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చని అంచనా. అదేవిధంగా బేస్ మోడల్ అయిన Redmi Note 17 స్మార్ట్‌ఫోన్ విషయానికొస్తే.. ఇందులో 6.83 అంగుళాల 1.5K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 చిప్‌సెట్, 50MP మెయిన్ కెమెరా, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
HP : కేవలం 30 నిమిషాల్లో 50% ఛార్జింగ్.. భారత్‌లో పవర్‌ఫుల్ ల్యాప్‌టాప్ లాంచ్ చేసి హెచ్‌పీ
మార్కెట్లో భారీ అంచనాలు
కంపెనీ అధికారికంగా ఈ స్పెసిఫికేషన్లను ఇంకా పూర్తిగా ప్రకటించనప్పటికీ, లీకైన బ్యాటరీ, కెమెరా ఫీచర్లు చూస్తుంటే ఈసారి రెడ్‌మి నోట్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ జూలైలో చైనాలో విడుదలైన తర్వాత, కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ పవర్‌ఫుల్ సిరీస్ భారత మార్కెట్లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹63,999
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999