గ్లోబల్ మార్కెట్లోకి రెడ్మీ నోట్ 17 సిరీస్‌లో మొత్తం నాలుగు మోడళ్లు రానున్నాయి.
Photo Credit: Redmi
Redmi Note 17
Redmi Note 17 : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమి తమ సబ్ బ్రాండ్ రెడ్మీ నుంచి ఎంతో ప్రజాదరణ పొందిన నోట్ సిరీస్‌లో కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రెడ్మీ నోట్ 17 సిరీస్ పేరుతో ఈ స్మార్ట్ఫోన్లను భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో త్వరలోనే ఆవిష్కరించనున్నారు. ఈ నెల ప్రారంభంలోనే ఈ మోడళ్లను చైనాలో లాంచ్ చేయగా, భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లలోకి త్వరలోనే తీసుకువస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే, అధికారిక ప్రకటన వెలువడక ముందే గ్లోబల్ మార్కెట్లోకి రానున్న నాలుగు వేరియంట్ల అంచనా ధరలు, వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లో రానున్న నాలుగు మోడళ్లు, లీకైన ధరలు
వైటెక్ బి నివేదికల ప్రకారం.. గ్లోబల్ మార్కెట్లోకి రెడ్మీ నోట్ 17 సిరీస్‌లో మొత్తం నాలుగు మోడళ్లు రానున్నాయి. ఇందులో రెడ్మీ నోట్ 17 4జి, నోట్ 17 5జి, నోట్ 17 ప్రో 5జి, నోట్ 17 ప్రో మాక్స్ 5జి ఉన్నాయి.
బేస్ మోడల్ అయిన రెడ్మీ నోట్ 17 4జి మోడల్ 4GB+128GB వేరియంట్ ధర EUR 250 (సుమారు రూ. 27,000) గాను, 6GB+256GB వేరియంట్ ధర EUR 300 (సుమారు రూ. 33,000) గాను ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, పర్పుల్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఇక రెడ్మీ నోట్ 17 5జి మోడల్‌కి చెందిన 6GB+256GB వేరియంట్ ధర EUR 400 (సుమారు రూ. 44,000) గా ఉండవచ్చని తెలుస్తోంది.
అదేవిధంగా రెడ్మీ నోట్ 17 ప్రో 5జి 6GB+256GB వేరియంట్ EUR 500 (సుమారు రూ. 55,000) కు, హై-ఎండ్ మోడల్ అయిన రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్ 5జి 8GB+256GB వేరియంట్ EUR 600 (సుమారు రూ. 65,000) కు లభించే అవకాశం ఉంది.
boAt Sailor Nav : పిల్లలు ఎక్కడున్నా పేరెంట్స్ కనిపెట్టేస్తారు.. బోట్ తెచ్చిన కిలాడీ స్మార్ట్‌వాచ్
చైనా మార్కెట్లోని ధరల వివరాలు
చైనాలో ఇప్పటికే అందుబాటులో ఉన్న రెడ్మీ నోట్ 17 సిరీస్ మోడళ్ల వివరాలను పరిశీలిస్తే.. రెడ్మీ నోట్ 17 (6GB+128GB) ప్రారంభ ధర CNY 1,299 (సుమారు రూ. 18,000) గా ఉంది. దీనిలోని 8GB+128GB వేరియంట్ CNY 1,399 (సుమారు రూ. 20,000) మరియు 8GB+256GB వేరియంట్ CNY 1,599 (సుమారు రూ. 23,000) ధరకు విక్రయిస్తున్నారు. మరోవైపు, రెడ్మీ నోట్ 17 ప్రో (8GB+128GB) ప్రారంభ ధర చైనాలో CNY 1,599 (సుమారు రూ. 22,700) గా ఉంది.
భారత మార్కెట్లో విడుదల, అంచనా ధర
ప్రముఖ టెక్ టిప్స్టర్లు యోగేష్ బ్రార్, అభిషేక్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. భారత మార్కెట్లో రెడ్మీ నోట్ 17 ప్రారంభ ధర రూ.30,000 కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది 6GB+128GB బేస్ మోడల్‌తో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. స్థానిక పన్నులు, దిగుమతి సుంకాలను బట్టి భారత మార్కెట్ ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. షావోమి త్వరలోనే అధికారిక లాంచ్ తేదీతో పాటు మిగిలిన కీలక ఫీచర్ల వివరాలను ప్రకటించనుంది.
ప్రకటన
ప్రకటన
Apple Watch Series 12
Starts from ₹56,900
Samsung Galaxy Watch Ultra 2
Starts from ₹62,479
Samsung Galaxy Watch 9 (44mm, LTE)
Starts from ₹41,999
Samsung Galaxy Watch 9 (40mm, LTE)
Starts from ₹38,999
Samsung Galaxy Watch 9 (40mm)
Starts from ₹36,999
Samsung Galaxy Watch 9 (44mm)
Starts from ₹40,999
ChatGPT Can Now Access iCloud Mail and Calendar as OpenAI Introduces New Plugins
OnePlus Ace 7 Confirmed to Feature Snapdragon 8 Elite Gen 5 V Series Chip, 9,000mAh Battery
Sony LYTIA 720 Image Sensor Launched With 50-Megapixel Resolution, 4K 60fps HDR Video Support